Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల, తిరుపతిలలో గదులకు డిపాజిట్లు రద్దు - యాత్రికులకు ఊరట

తిరుమల తిరుపతి దేవస్థానం గదులకు సంబంధించి డిపాజిట్‌ వసూలు చేయడం నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయంతో యాత్రికులకు పెద్ద ఊరట లభించినట్లయింది. ప్రత్యేకించి సాధారణ భక్తులకు ఈ నిర్ణయం వల్ల రెండు విధాలామేలు జరి

Webdunia
బుధవారం, 2 నవంబరు 2016 (13:40 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం గదులకు సంబంధించి డిపాజిట్‌ వసూలు చేయడం నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయంతో యాత్రికులకు పెద్ద ఊరట లభించినట్లయింది. ప్రత్యేకించి సాధారణ భక్తులకు ఈ నిర్ణయం వల్ల రెండు విధాలామేలు జరిగింది. డిపాజిట్‌ రద్దుపై మొదట్లో తితిదే ఉద్యోగుల్లో కొంత వ్యతిరేకత వచ్చినా ఆ తర్వాత అన్ని సర్దుకున్నాయి. మొత్తంగా ఈఓ సాంబశివరావు పట్టుబట్టి చేసిన ఈ ప్రయోగం విజయవంతమైంది. 
 
శ్రీవారి దర్శనం కోసం వచ్చే యాత్రికులు బస చేయడం కోసం తిరుమల, తిరుపతిలో వేలాది అద్దె గదులు, విశ్రాంతి భవనాలు ఉన్నాయి. వీటి అద్దెలు 50 నుంచి 3 వేల రూపాయలు దాకా వీటిని అద్దెకు ఇచ్చేటప్పుడు గది అద్దె ఎంతయితే అంత డిపాజిట్‌ కూడా తీసుకునేవారు. గది అద్దె ఎంతయితే అంత డిపాజిట్‌ కూడా తీసుకునేవారు. గది అద్దె 1500 రూపాయలు వసూలు చేసేవారు. అంటే 3 వేల రూపాయలు చెల్లించాలి. గది ఖాళీ చేసేటప్పుడు డిపాజిట్‌ డబ్బులు వెనక్కి ఇస్తారు. ఇది ఒక రకంగా భక్తులకు భారంగా ఉండేది. తక్కువ డబ్బులతో తిరుమలకు వచ్చేవారు గది అద్దెకు తీసుకోవాలంటే డిపాజిట్‌ కూడా చెల్లించాల్సి రావడం ఇబ్బందిగా ఉండేది. దీన్ని గమనించిన ఈఓ సాంబశివరావు డిపాజిట్‌ రద్దు చేయాలని నిర్ణయించారు.
 
తొలుత పద్మావతి విచారణ కేంద్రం పరిధిలోని గదులకు డిపాజిట్‌ రద్దు చేశారు. ఆ తర్వాత దశలవారీగా అన్ని గదుల డిపాజిట్‌ తీసేశారు. ఇప్పుడు 50 రూపాయల సాధారణ గదికి కూడా డిపాజిట్‌ లేదు. ఇది యాత్రికులకు ఎంతో కొంత ఊరటనిచ్చిందని చెప్పడంతో డిపాజిట్‌ తిరిగి ఇచ్చే కౌంటర్ల వద్ద క్యూలో నిలబడాల్సి వచ్చేది. ఒక్కోసారి స్థానికులు ఎవరో ఒకరు గది బుక్‌ చేస్తారు. భక్తులు వచ్చిన తర్వాత తాళాలు వారికి అప్పగించి కిందకు దిగేస్తారు. అయితే గది ఖాళీ చేసేటప్పుడు ఇబ్బంది అయ్యేది. సంబంధిత వ్యక్తులు వస్తేనే డిపాజిట్‌ వెనక్కి ఇస్తామని చెప్పేవారు. దీంతో డిపాజిట్‌ వదులుకుని వెళ్ళిపోయిన భక్తులూ ఉన్నారు. గదుల కోసం చెల్లించిన డిపాజిట్‌ వదులుకుని వెళ్ళిపోయిన భక్తులూ ఉన్నారు. గదుల కోసం చెల్లించిన డిపాజిట్‌ నింపాదిగా వచ్చి వసూలు చేసుకునే అవకాశం కూడా ఉండేది కాదు. నిర్ణీత గంటల్లో డిపాజిట్‌ వెనక్కి తీసుకోకుంటే అది శ్రీవారి ఖాతాలో జయ అయ్యేది. ఇలాంటి ఇబ్బందులన్నీ ఇప్పుడు తొలగిపోయాయి.
 
అద్దె గదులకు డిపాజిట్‌ రద్దు చేయడంపై మొదట్లో తితిదే ఉద్యోగుల నుంచి ప్రధానంగా అటెండర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. డిపాజిట్‌ లేకుంటే నిర్లక్ష్యగా వెళ్ళిపోతారని, తాళాలు కూడా అప్పగించరని అటెండర్లు వాపోయారు. అటెండర్ల ఆవేదనలో అర్థమైంది. ఎందుకంటే ఒక్కోసారి భక్తులు తాళాలు ఇవ్వకుండా వెళ్ళిపోతే తాళం ఖరీదును సంబంధిత అటెండర్లతో కట్టించేవారు. అందుకే డిపాజిట్‌ రద్దుపై తొలుత కాస్త ఆందోళన వ్యక్తమైంది. అయినా ఈఓ ఇఓ వెనక్కి తగ్గలేదు. ప్రైవేట్ హోటల్లో ఇలాగే డిపాజిట్‌ వసూలు చేస్తున్నారా.. మనం మాత్రం ఎందుకు వసూలు చేయాలి అని ఘాటుగానే ప్రశ్నించారు. ఒకవేళ ఎవరైనా భక్తులు అదనపు అద్దె డబ్బులు చెల్లించుకుండా వెళ్ళిపోయినా తాళాలు పోగొట్టినా ఆ భారం అటెండర్లపై పడకుండా చూస్తారని భరోసా ఇచ్చారు. దీంతో అన్నీ సవ్యంగా జరిగాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మగవాళ్లపై గృహహింస: ‘పెళ్లైన 15 రోజులకే విడాకులన్నారు, ఇంటికి వెళితే దారుణంగా కొట్టి పంపించారు’

జగన్ థర్డ్ డిగ్రీ నుంచి బీజేపీలో ఉండటంతో తప్పించుకున్నా : విష్ణుకుమార్ రాజు

పెళ్లి బరాత్‌లో డ్యాన్స్ చేస్తూ.. గుండెపోటుతో యువకుడి మృతి..

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కారు డ్రైవర్ నెల వేతనం ఎంతో తెలుసా?

'ఆర్ఆర్ఆర్‌'కు చిత్రహింసలు.. విజయపాల్ డొంకతిరుగుడు సమాధానాలు...

అన్నీ చూడండి

లేటెస్ట్

ఏంజెల్ నంబర్ 1515 అంటే ఏమిటి? చూస్తే ఏం జరుగుతుంది?

క్షీరాబ్ధి ద్వాదశి.. సాయంత్రం పూట తులసీకోట ముందు దీపం తప్పనిసరి

నవంబర్ 17న తిరుమలలో కార్తీక వనభోజనం

13-11-2024 బుధవారం ఫలితాలు - కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి....

క్షీరాబ్ధి ద్వాదశి- తులసీ కోట వద్ద నేతి దీపం.. నువ్వుల నూనె వాడితే?

తర్వాతి కథనం
Show comments