Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో గదుల కేటాయింపులో లోపభూయిష్టం ... కాటేజీల కోసం నిత్యం భక్తుల కుస్తీలు

తిరుమల కొండపై సామాన్య భక్తుల కోసం అంతా పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం. గదులు, కాటేజీల కేటాయింపులలో మద్య దళారీలను అరికట్టాం. సిబ్బందిలో అవినీతికి పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటాం.

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2016 (12:12 IST)
తిరుమల కొండపై సామాన్య భక్తుల కోసం అంతా పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం. గదులు, కాటేజీల కేటాయింపులలో మద్య దళారీలను అరికట్టాం. సిబ్బందిలో అవినీతికి పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటాం. భక్తులను సులభంగా గదులు లభించేలా కేటాయింపులలో ఆన్‌లైన్‌ విధానం ప్రవేశపెట్టాం. భక్తులు నేరుగా కౌంటర్లలో గులు నిమిషాలలో పొందేలా ఏర్పాట్లు చేపట్టాం. ఇదీ తితిదే కార్యనిర్వహణాధికారి సాంబశివరావు తరచూ చేసే ప్రకటన. అయితే వాస్తవంతో అందుకు విరుద్థంగా జరుగుతోంది. 
 
తిరుమల కొండపై భక్తులు కాటేజీలు, గదులు కావాలంటే నానా యాతన అనుభవించాల్సిన వస్తోంది. పిల్లాపాపలతో గంటల తరబడి కౌంటర్ల వద్ద పడిగాపులు పడుతున్నప్పటికీ గదులు లభించడం దుర్లభం అవుతోంది. అంతా ఆన్‌లైన్‌ మహిమ అంటూ సిబ్బంది భక్తులకు మొండిచేయి చూపుతున్నారు. దీంతో నానా అవస్థలు పడి కొండకు కాలినడకన వచ్చిన భక్తులు కాళ్ల నొప్పులతో పడిగాపులు పడలేక కాసింత సేదతీరుదామంటే కాటేజీ లభించక పోవడంతో సహనం కోల్పోతున్నారు. కౌంటర్లలోని తితిదే సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్తితి ఇటీవల ఆన్‌లైన్‌ విధానంలో గదులన్నీ కేటాయించేందుకు నిర్ణయించడంతో మూడు మాసాలుగా కనిపిస్తోంది. 
 
అసలు నేరుగా తిరుమలకు వచ్చే భక్తులేమో ఇక్కడ గులు ఖాళీలు లేవని అవస్థలు పడుతుంటే ఎప్పుడో ఆన్‌లైవన్‌ ద్వారా ముందస్తు బుకింగ్‌ చేసుకున్న భక్తులకేమో అనవసరంగా డిపాజిట్‌ మినహాయింపు నిచ్చేస్తున్నాము అంటూ తితిదే తాయిలాలు ప్రకటిస్తోంది. మరో వైపు తితిదే అటెండర్లకు తలనొప్పిగా మారిపోయింది. ఎలాగూ డిపాజిట్లు కట్టలేదు కదా..అనుకుని ఒకరోజు బాడుగ చెల్లించి మూడు రోజులు తిష్టవేసి చెప్పా పెట్టకుండా గదులు ఖాళీ చేసేసి వెళ్లిపోతున్నారు అనేకమంది యాత్రికులు. 
 
వీరు కట్టాల్సిన అద్దె సొమ్ములు, లాక్‌ డిపాజిట్లు తదితర సొమ్ములు తితిదే అటెండర్లపై పడుతోంది. లేదంటే అటెండర్ల జీతాలలో కటింగ్‌ చేస్తున్నారు అధికారులు. గతంలో గది అద్దె 100అయినప్పటికీ తాళం డిపాజిట్టుగా తితిదే 500రూపాయలు వసూలు చేసేది. ఈ విధానం తాజాగా తొలగించడంతో సమస్యలు ఏర్పడ్డాయి. దాతలు, ముందస్తు బుకింగ్‌ దాడులకు ఈ డిపాజిట్టు విధానం అవసరం లేదని తితిదే మినహాయింపునిచ్చింది. దీంతో అటెండర్లు లబోదిబోమంటూ మొత్తుకుంటున్నారు. ఈ సమస్యపై ఉన్నతాధికారులు సరైన తీరులో స్పందించడం లేదు. 
 
వాస్తవానికి తిరుమల కొండపై మొత్తం 7,250గదులు భక్తులు కొరకు నిర్మించారు. వీటిలో 1600గదులు అడ్వాన్స్ బుకింగ్‌ విధానంలో కేటాయిస్తున్నారు. మిగిలిన గదులన్నీ తిరుమలలో వివిధ ప్రాంతాలలో ఉన్న ఎంబిసి, టిబిసి, జనరల్‌ కౌంటర్ల ద్వవారా భక్తులకు కేటాయింపులు జరుపుతున్నారు. ఇందులో అడ్వాన్స్ బుకింగ్‌ చేసుకున్న వారికి ఎఆర్‌పి కౌంటర్ల ద్వారా కేటాయిస్తున్నారు. అయితే అడ్వాన్స్ బుకింగ్‌ చేసుకున్న భక్తులు తాము ఒక్కరోజుకు మాత్రమే బుక్‌ చేసుకుని మూడు రోజులు పాటు ఖాళీలు చేయకుండా ఉండి పోతున్నారు. 
 
దీంతో నేరుగా తిరుమలకు వచ్చిన భక్తులు తాము ఒక్కరోజుకు మాత్రమే బుక్‌ చేసుకుని మూడురోజుల పాటు ఖాళీలు చేయకుండా ఉండిపోతున్నారు. దీంతో నేరుగా తిరుమలకు వచ్చిన సాధారణ భక్తులకు గదుల కేటాయింపులలో కోతపడిపోతోంది. మరుసటి రోజున వచ్చిన అడ్వాన్స్ బుకింగ్‌ దారులకు కూడా జనరల్‌ కౌంటర్‌ లోని అన్ని గదులు కేటాయించాల్సి రావడంతో నేరుగా తిరుమలకు వచ్చిన సామాన్య బక్తులు గంటల తరబడి ఎదురుచూపులు చూడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

లేటెస్ట్

మీనరాశిలోకి మారుతున్న శుక్రుడు.. ఈ 3 రాశుల వారికి అంతా శుభమే

08-04-2025 మంగళవారం మీ రాశిఫలాలు : సంతానం చదువులపై దృష్టిపెడతారు...

ఇంట్లోకి నల్ల చీమలు వస్తున్నాయా.. ఇది మంచికేనా.. లేకుంటే?

07-04-2025 సోమవారం మీ రాశిఫలాలు : మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది...

06-04-2025 ఆదివారం మీ రాశిఫలాలు : స్వయంకృషితో కార్యం సాధిస్తారు...

తర్వాతి కథనం
Show comments