Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారు బ్రహ్మదేవుడు కాదు... శివుడూ కాడు.. కుమారస్వామి అసలే కాదు...!

కలియుగ వైకుంఠుడు వేంకటేశ్వరస్వామివారు పద్మపీఠంపై నిలిచి ఉన్నందువల్ల చాలామంది బ్రహ్మదేవుడేమో అనుకుంటుంటారు. అలాగే శ్రీనివాసునికి నాగాభరణాలు కూడా ఉన్నాయి.

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2016 (13:13 IST)
కలియుగ వైకుంఠుడు వేంకటేశ్వరస్వామివారు పద్మపీఠంపై నిలిచి ఉన్నందువల్ల చాలామంది బ్రహ్మదేవుడేమో అనుకుంటుంటారు. అలాగే శ్రీనివాసునికి నాగాభరణాలు కూడా ఉన్నాయి. సంవత్సరంలో ప్రతి ధనుర్మాసంలో శివప్రీతికరమైన మారేడు దళాలతో (బిలువం) తిరుమల స్వామికి అర్చన జరుగుతుంది కదా..! అందువల్ల ఈ మూర్తి పరమశివుడు అంటుంటారు మరికొందరు. ఇంకొందరైతే కుమారస్వామి అంటారు. అసలు స్వామివారు బ్రహ్మదేవుడు కాదు.. శివుడు కాదు.. కుమారస్వామి అసలు కాదని పురాణాలు చెబుతున్నాయి..
 
పద్మపీఠంపై ఒక్క బ్రహ్మదేవుడు మాత్రమే నిలిచి ఉండడు కదా.. ఒకవేళ నిలిచి ఉన్నా ఆ బ్రహ్మదేవునికి వక్షస్థలంలో శ్రీ వత్స చిహ్నం వుండదు కాక ఉండదు. అందువలన స్వామివారు బ్రహ్మదేవుడు కానే కాదు. పైగా ప్రతిరోజు సుప్రభాతానికి ముందుగా బ్రహ్మమూహూర్త వేళలో బ్రహ్మ దేవుడు కూడా స్వయంగా తిరుమలప్పను పూజిస్తాడని ప్రతీతి. అర్చకులు కూడా ప్రతిరోజు బ్రహ్మదదేవుడు ఈ స్వామిని పూజించటానికి గాను ఒక బంగారు పాత్రలో జలాన్ని ఉంచుతారు. దీని తర్వాత భక్తులకు బ్రహ్మతీర్థంగా ఇస్తున్నారు కూడా. అంతేకాకుండా ఈ బ్రహ్మదేవుడు వేంకేటశ్వరునికి చేయించిన బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రతియేటా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి తిరుమల మీద ఈ మూర్తి బ్రహ్మదేవుడు కాదు గాక కాదని పురాణాలు చెబుతున్నాయి. 
 
అసలు బ్రహ్మదేవుని కోరికపైనే లీలామానుషుడైన శ్రీ మహావిష్ణువు ఈ సౌమ్యరూపంతో వేంకటాచలపతి పేరుతో వెలసినాడు. అందుకే నిత్యమూ బ్రహ్మదేవుని చేత అర్పించబడుతూ ఉన్న ఈ తిరుమలస్వామివారిని మనమందనం అష్టోత్తర, సహస్రనామాలలో కీర్తింపబడుతాయని పురాణాలు చెబుతున్నాయి. 
 
మరొకటి శివుడు.. వక్ష స్థలలో లక్ష్మీదేవి వున్నది కదా.. కాబట్టి వేంకటేశ్వరస్వామి శివుడంటారు. నాగాభరణుడు  కదా..! అని అంటే నాగేంద్రుడయిన ఆదిశేషుడు విష్ణువునకు శయ్యా, పాదుకా, సేవకుడు కూడా. అంతేకాకుండా పూర్వం వాయుదేవునికి శేషునికి జరిగిన ఘర్షణలో ఇక్కడికి ఎగిరి వచ్చిపడిన శేషుణ్ణి చేతిలోకి తీసుకొని అనునయించి ఆ శేషుణ్ణి తాను ఆభరణంగా చేసుకుంటానని, ఆ శేషుని మీదే స్థిరంగా నిలిచి శేషాచలపతిగా ప్రసిద్ధి పొందుతానని కూడా శ్రీ మహావిష్ణువు చెప్పాడని బ్రహ్మ పురాణం స్పష్టం చేస్తోంది. అందువల్ల వక్షస్థల లక్ష్మితో ఉన్న ఈ నాగాభరణుడు శివుడు ఎంతమాత్రం కాదు. కాని  మారేడుతో అర్‌చన జరుగుతోంది. బిల్వంతో శివునికే కదా అర్చన చేస్తారు. మరి ఈ విగ్రహం శివుడు ఎందుకు కాకూడదంటారు.. ఇది ఎంతమాత్రం సరైనది కాదు. శ్రీ మహాలక్ష్మి బిల్వవ్యనస్థ. బిల్వవనాలను అందువల్లే ఈ ప్రాంతంలో లక్ష్మికి ఆవాసమైన బిల్వంతో అర్చన జరుగుతోంది. అంతేకాదు శివునికి అర్చనలో ఉపయోగించని తులసి ప్రత్యేకంగా తిరుమల మీది స్వామివారి సహస్రనామార్చనాదుల్లో ప్రధానంగగా చోటుచేసుకుంది. 
 
తిరుమల స్వామివారు అత్యంత పుష్పప్రియుడు. అంతేకాకుండా క్షేత్ర అధిష్టాన దైవం శ్రీ వేంకటేశ్వరస్వాడు కాగా ఈ క్షేత్రపాలకుడు శివుడు అని కూడా అంటారు. బ్రహ్మోత్సవాలకుగాను ఆ సమయంలో ఆలయ సంప్రదాయం ప్రకారం ప్రత్యేకంగా ఈశాన్య దిక్పాలకునిగా ఈశ్వరుడు ఆహ్వానించపబడుతూ ఉన్నాడు. అందువల్ల ఈ క్షేత్రంలో వెలసిన ఈ మూర్తి శివుడు అంటారు. ముమ్మాటికీ వేంకటేశ్వరుడని పిలువబడుతున్న శ్రీ మహావిష్ణువే. అందువల్ల పరమశివునితో కొనియాడబడుతూ ఉన్న ఈ స్వామివారిని మనసారా ప్రార్థిస్తూ అష్టోత్తర సహస్రనామావళులతో పూజిస్తుంటారు. 
 
కుమారస్వామి అంటుంటారు.. స్వామివారు సాక్షాత్తు కుమారస్వామివారే. అందువల్లే తిరుమల మీద కోనేరును స్వామి పుష్కరిణి అని అంటారని ఇలా ఎన్నో విధాల శంకించటం జరుగుతోంది. కానీ ఈ అభిప్రాయం పొరపాటే. ఎందువల్ల అంటే ప్రపచంలోని అన్ని పుష్కరిణులకు, కోనేరులకు స్వామి వంటిది, ప్రభువు వంటిది ఈ  తిరుమల మీద కోనేరు. కాబట్టే స్వామి పుష్కరిణి అని ప్రసిద్ధికెక్కింది. ఆ పదంలోని స్వామి శబ్థం కుమారస్వామికి సంబంధించినది కానే కాదు. తారకాసుర సంహారం వల్ల కలిగిన బ్రహ్మహత్యా పాపాన్ని, సాక్షాత్తు కుమారస్వామివారే ఈ ప్రాంతంలో తపస్సు చేసి తిరుమల స్వామివారిచేత హోర పాపాన్ని నివృతి చేసుకున్నాడట. ఈ క్షేత్రంలో ఈయన తపస్సు చేసిన స్థలం కుమారతీర్థం అని కూడా ప్రసిద్ధి చెందింది. అందువల్లే స్వామివారు సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరుడని పిలువబడే శ్రీ మహావిష్ణువు అందుకే ఈ తిరుమలస్వామి నిత్యమూ ఈ విధంగా ప్రార్థింపబడడంతో ఆశ్చర్యం ఏమీ లేదని పురాణాలు చెబుతున్నాయి. 

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

బాలికలతో వ్యభిచారం.. డీఎస్పీ సహా 21 మంది అరెస్టు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

11-05-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి...

తర్వాతి కథనం
Show comments