అవి ఎంత చెడ్డవైనా వాని విషయం ఎన్నడూ ఎవ్వరితో...

Webdunia
బుధవారం, 31 జులై 2019 (22:30 IST)
వ్యక్తి యెుక్క పూర్వకర్మల ఫలితాల ననుసరించి జయాపజయాలు, సాధనా నిస్పృహలు, ఆకర్షణలు పని చేస్తుంటాయి. ఈ వరుస క్రమంలో అన్ని జరుగువలసిందే.. అందరూ అనుభవించ వలసినవే. అవాంఛనీయ సంఘటనలు తటస్థించినా వానిని చిరునవ్వుతో స్వీకరిస్తే మన జీవన భారం కొంత తేలిక పడుతుంది. 
 
1. ఇతరుల తప్పిదాలు అవి ఎంత చెడ్డవైనా వాని విషయం ఎన్నడూ ఎవ్వరితో ప్రసంగించకండి. దాని వల్ల ఉపయోగమేమీ లేదు. 
 
2. ద్వేషపూరిత హృదయానికి సంతృప్తి కలుగదు. ద్వేషం కార్చిచ్చు వంటిది. శాస్త్రాధ్యయనం వలన మానవుడు మేధావి కాలేడు. మహాత్ముల దైనందిక కార్యములందు సన్నిహితాన్ని పెంపొందించుకొనగలిగిన వాడే జ్ఞానియై రాణించగలడు.
 
3. దైవ చింతనతో గడుపుతున్న జీవితం స్వల్పకాలమైనా ఉత్తమమైనదే. దైవ భక్తి లేని జీవి లక్షలాది సంవత్సరాలు బ్రతికి ఉన్న ప్రయోజనం శూన్యమే.
 
4. కష్టపడి పనిచేయి. దేవుడు నామము ఉచ్చరించు. సద్గ్రంధాలు చదువు. వంతులకు, పోటీలకు పోవద్దు. అలా చేస్తే భగవంతునికి ఏహ్యం కలుగుతుంది.
 
6. మన సంభాషణ యందు మనం సత్యాన్ని ఆచితూచి పలకాలి. సాధకుడు మితభాషిగా ఉండాలి. 
 
7. దైవాన్ని మరచిన వారికి బలహీనత కలుగుతుంది. పరమేశ్వరుని జ్ఞాపకముంచు కొనవలనంటే ఆ దేవదేవుని మహిమను, నామాన్ని స్మరించడం అవసరం.
 
8. కష్టాలను అధిగమించితే మనకు నూతనుత్తేజం, ఆధ్యాత్మిక బలం చేకూరుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తూఛ్... సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని చెప్పలేదు : ఉదయనిధి స్టాలిన్

పూర్తిగా దగ్ధమైన కావేరీ ట్రావెల్స్ బస్సు - డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణికులంతా క్షేమం

వచ్చే యేడాది నుంచి ఆన్‍‌లైన్‌లో నీట్ ప్రవేశపరీక్ష : కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

తిరుపతిలో దారుణం, వేసవి శెలవులకు వచ్చిన 16 ఏళ్ల బాలికపై బాబాయ్ అత్యాచారం

నీట్-యూజీ 2026: జూన్ 21న మళ్లీ పరీక్ష.. ఎన్టీఏ ప్రకటన

అన్నీ చూడండి

లేటెస్ట్

15-05-2026 శుక్రవారం ఫలితాలు- మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది

14-05-2016 గురువారం ఫలితాలు- మీపై వచ్చిన అభియోగాలు సమసిపోగలవు

13-05-2026 బుధవారం ఫలితాలు - ఆర్థిక సమస్య పరిష్కారమవుతుంది

ఇంట్లో పిల్లిని పెంచడం మంచిదేనా? వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుంది?

భక్తుల చిరకాల కోరికను నెరవేర్చిన పవన్: తిరుపతి నుంచి పళనికి బస్సు సేవలు

తర్వాతి కథనం
Show comments