భ్రాంతిని తొలగించేదే సాధన... స్వామి వివేకానంద

కారణమే కార్యమవుతుంది. కారణం వేరు దాని ఫలితంగా జరిగే కార్యం వేరు కాదు. క్రియగా పరిణమించిన కారణమే కార్యం. సర్వత్రా ఇదే జరుగుతూ ఉంటుంది. సర్వదా కారణమే కార్యమవుతూ ఉంటుంది. కార్యంకన్నా కారణం భిన్నమై వేరుగా ఉంటుందని, కారణం పని చేయడం వల్ల సిద్ధిస్తుందని సామ

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2017 (20:56 IST)
కారణమే కార్యమవుతుంది. కారణం వేరు దాని ఫలితంగా జరిగే కార్యం వేరు కాదు. క్రియగా పరిణమించిన కారణమే కార్యం. సర్వత్రా ఇదే జరుగుతూ ఉంటుంది. సర్వదా కారణమే కార్యమవుతూ ఉంటుంది. కార్యంకన్నా కారణం భిన్నమై వేరుగా ఉంటుందని, కారణం పని చేయడం వల్ల సిద్ధిస్తుందని సామాన్యంగా వ్యాపించివున్న అభిప్రాయం. ఇది యథార్థం కాదు. 
 
సర్వదా, కారణం మరొక స్థితిలో పనిచేయటం వల్లనే ఫలితం కలుగుతూ వుంటుంది. విశ్వం నిజంగా ఏక జాతీయమైనది. వైవిధ్యం స్థూలదృష్టికి కనిపించేది మాత్రమే. ప్రకృతిలో అంతటా, విభిన్నశక్తులు మెుదలైనవి ఉన్నట్లు కనిపిస్తాయి. రెండు వేరువేరు వస్తువులను తీసుకుందాం. గాజు ముక్కను, చెక్క ముక్కను తీసుకోండి. రెండిటిని పొడి చేయండి. సాద్యమైనంతా మెత్తగా పొడిచేయండి. అపుడు ఆ పదార్థలు రెండు ఏక జాతీయమైనవిగా కనిపిస్తాయి.
 
పదార్థాలన్నీ తమ అంతిమ దశలో ఏకజాతీయమైనవే. ఏక జాతీయత అసలు సత్యం. సారం, వివిధ పదార్థలుగా కనిపించే దృశ్యం వైవిధ్యం. వినుట - కనుట - రుచి చూచుట - ఇవన్నీ ఒకే మనసు వివిధావస్థలు. గదిలోని వాతవరణాన్ని మనోశక్తి వల్ల మార్చివేసి, గదిలో ప్రవేశించే ప్రతివ్యక్తీ వివిధ వైచిత్రాలను చూచేలా మనుషులు, వస్తువులూ, గాలిలో ఎగురుతున్నట్లు చూచెలా భ్రాంతి కలగవచ్చు. ప్రతి మనిషీ ఇదివరకే భ్రాంతిలో తగుల్కొని వుంటాడు. ఈ భ్రాంతిని తొలిగించుటే సాధన స్వరూప సాక్షాత్కారప్రాప్తి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తమిళ నటుడు విజయ్ టీవీకే పార్టీ గుర్తు విజిల్, ఖుషీలో ఫ్యాన్స్

ఆ జీతాలపై ఆధారపడటానికి వైకాపా ఎమ్మెల్యేలు అంత పేదవాళ్లు కాదు

సోషల్ మీడియాకు 16 ఏళ్లలోపు పిల్లలను దూరంగా వుంచనున్న ఏపీ సర్కారు

వైద్య పరీక్షల్లో కాపీయింగ్ - మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా చేస్తాం : మంత్రి సత్యకుమార్

ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న కేబీఆర్ ఫ్లై ఓవర్

అన్నీ చూడండి

లేటెస్ట్

18-01-2026 నుంచి 24-01-2026 వరకు వార రాశి ఫలితాలు

17-01-2026 శనివారం ఫలితాలు - లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం...

Shukra Pradosh Vrat 2026: శుక్ర ప్రదోషం.. శ్రీ మహాలక్ష్మి కటాక్షాల కోసం..

16-01-2026 శుక్రవారం ఫలితాలు - పందాలు, బెట్టింగుల జోలికి పోవద్దు...

15-01-2026 గురువారం ఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

తర్వాతి కథనం
Show comments