Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీనివాసమంగాపురంలో తులసి దళం...? ఏమండోయ్ మీకు అందిందా...?

తిరుమల శ్రీవారి ఆలయం, తిరుచానూరు పద్మావతి ఆలయం తరువాత శ్రీనివాసమంగాపురం కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించే భక్తుల సంఖ్య పెరుగుతోంది. రోజూ 10 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కళ్యాణ వేంకటేశ్వరుని హుండీ ఆదాయం

Webdunia
శనివారం, 10 సెప్టెంబరు 2016 (15:01 IST)
తిరుమల శ్రీవారి ఆలయం, తిరుచానూరు పద్మావతి ఆలయం తరువాత శ్రీనివాసమంగాపురం కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించే భక్తుల సంఖ్య పెరుగుతోంది. రోజూ 10 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కళ్యాణ వేంకటేశ్వరుని హుండీ ఆదాయం ఏమోగానీ ఇక్కడ పనిచేసే కొందరు అధికారులు, అర్చకుల అక్రమార్జన మాత్రం రానురాను పెరుగుతోందట. అక్కడి ఉద్యోగులే ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పుకుంటున్నారు. అంతే కాదు అక్రమార్జనకు తులసి అనే పేరు కూడా పెట్టేశారు. ఏమండోయ్‌ మీకు ఈ రోజు తులసి అందిందా.. అంటే ధానర్థం మీ వాటా మీకు ముట్టిందా అని అట. అంతేగానీ భక్తులు కళ్ళకు అడ్డుకుని స్వీకరించే, స్వామివారి తీర్థించే కనిపించే తులసి ఆకులు కావు. ఇంతకీ ఈ తులసీ కథేంటి.
 
ఆలయానికి చెందిన కొందరు అధికారులు, కొందరు అర్చకులు కలిసి భక్తుల నుంచి ఎన్ని విధాలా తులసి రాబట్టుకోవాలో అన్ని విధాలా రాబట్టుకుంటున్నారట. స్వామివారి సన్నిధిలో హారతి పళ్ళెంలో పడే కానుకలు ఎటూ పడుతూనే ఉంటాయి. ఇవే రోజూ వేల రూపాయలు ఉంటాయట. ఇది కాకుండా రోజూ కళ్యాణోత్సవం తరువాత వసూలు చేసే డబ్బులు అన్నీ కలిపి రోజూ వాటాలు పంచుకుంటారట. ఇక్కడ పనిచేస్తున్న ఒక ఉన్నతాధికారికీ ఇందులో వాటా ఉందట. ఆయనకు నెలనెలా 30వేల తులసి అందుతుందట. అంటే రోజువారీ తీసుకోవడం నామూషిగా ఉంటుంది కాబట్టి నెలాఖరులో ఒకేసారి పెద్ద మొత్తంలో తులసి స్వీకరించి తరిస్తున్నారట ఆయనగారు. 
 
అలాగే ఇంకో అధికారి ఉన్నారు. ఆయన నెలా వాటా తులసి 12 వేల రూపాయలు అని చెబుతున్నారు. ఇది కాకుండా కళ్యాణోత్సవంలో దంపతులను ముందు వరుసలో కూర్చోబెట్టడానికి ప్రత్యేకంగా డబ్బులు వసూలు చేస్తారట. దీని ద్వారా ఆయన గారికి రోజూ 500 రూపాయలు ముట్టుతుందట. ముఖ్యమైన అధికారులకు రోజూ రెండు అప్పాలు, రెండు వడలు, అన్నప్రసాదాలు కవర్‌లో పెట్టి అర్చకకులు గౌరవంగా అందజేస్తారట. ఈ ప్రసాదాలనూ కొంతమంది ఉద్యోగులూ అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్న వారు ఉన్నారు. వారికి అర్చకులు, పరిచారకులు రోజుకు కనీసం 300 రూపాయలు సమర్పించుకోవాలట. అంటే నెలకు ఆయన తులసి దాదాపు 9 వేల రూపాయలు అలా ఇవ్వకుంటే తన బాస్‌కి లేనిపోని చాడీలు చెప్పి ఇబ్బంది పెడుతారట.
 
ఇదిలా ఉంటే గతంలో శ్రీనివాసమంగాపురంలో జిలేబీల వ్యవహారం కలకలం రేపింది. శ్రీవారి జిలేబీలు బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోతున్నాయని గతంలోనే ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శ్రీనివాసమంగాపురం ఆలయంపై విజిలెన్స్ నిఘా బాగా పెరిగింది. ఇప్పుడు తరచూ విజిలెన్స్ అధికారులు ఆలయాన్ని సందర్శిస్తున్నారు. తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయినా తులసి పంపిణీ మాత్రం యథేచ్ఛగా సాగుతోంది. 
 
ఇంకా ఇక్కడి ఉద్యోగులు కొందరు దళారులతో సంబంధాలు పెట్టుకుని తిరుమలలో దర్శనాలు చేయిస్తున్నారని, మహిళా కార్మికులతో అనైతికంగా ప్రవర్తిస్తున్నారని, ఉద్యోగులను వేధిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. తులసిపై కూడా టిటిడి విజిలెన్స్ విభాగం శ్రీనివాసమంగాపురంలో జరుగుతున్న వ్యవహారాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తే అక్కడ చేతులు మారుతున్న తులసి విలువ ఎంతో తేలుతుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికాలో రోడ్డు ప్రమాదం... కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ నేత మృతి

త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశా... పాపాలన్నీ పోయాయి : పూనమ్ పాండే

బీజేపీని ప్రశంసించిన అంబటి రాయుడు.. ఏం చేస్తాడో.. తెలుసా?

విజయలక్ష్మి విల్లాలు, కాస్త చూసి కొనండయ్యా, లేదంటే కోట్లు కొట్టుకుపోతాయ్

భార్య వేరొకరితో కన్న బిడ్డకూ భర్తే తండ్రి : సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

లేటెస్ట్

Shab e Meraj విశ్వ సృష్టికర్త అల్లాహ్‌ను కలిసే గౌరవం పొందిన పవిత్ర రాత్రి

28-01-2025 మంగళవారం దినఫలితాలు : దంపతుల మధ్య సఖ్యత లోపం...

Pradosh Vrat : సోమ ప్రదోష వ్రతం: శివాలయంలో అన్నదానం చేస్తే..?

27-01-2025 సోమవారం దినఫలితాలు : కొత్త వ్యక్తులతో సంభాషించవద్దు...

26-01-2025 ఆదివారం దినఫలితాలు : ఆప్తుల కలయిక వీలుపడదు...

తర్వాతి కథనం
Show comments