Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుణ్యంగాని, పాపంగాని- ఏ గుణం కలుగుతుందో?

Webdunia
గురువారం, 29 జనవరి 2015 (16:40 IST)
భూమిలో మంచీ, చెడు విత్తనాల వలె మానవ హృదయాలలో పుణ్యపాప సంబంధ సంస్కార బీజాలు ఉంటాయి. బ్రహ్మజ్ఞాన పరిశోధన వల్లనే కోట్లాదిజీవులు తరించాలి. వేరే మార్గం లేదు.  అంటే ఎండాకాలమున భూమిలో తృణబీజములు కనిపించకపోయినా, వానపడేటప్పుడు ఎలా అంకురిస్తాయో, ఏఏ బీజములుంటాయో, అవి అలాగే మొలకెత్తి వృక్షాలై కాయలుకాచి పండ్లనిస్తాయి. 
 
భూమిలో లేని బీజమొక్కటీ మొలవదు. అలాగే హృదయం నుంచి పుణ్యంగాని, పాపంగాని- ఏ గుణం కలుగుతుందో, తదనుగుణమైన సంస్కారం తనలో ఉన్నట్లు తెలుసుకోవాలి. విత్తనం లేని భూమిలో ఏ చెట్లుగాని, తృణముగాని పుట్టినట్లు సంస్కారం నశించిన హృదయంలో ఏ గుణమూ కలుగదు ఇదే దాని గుర్తు. 
 
నిప్పులో వేయించిన విత్తనాలు ఏవిధంగా అంకురించవో, అలాగే జ్ఞానాగ్నిలో దగ్ధమైన సంస్కారము కలుగనప్పుడు ప్రాకృత గుణములేవీ ఉద్భవించవు. ఇదే దీనిలో గల రహస్యం. అటువంటి స్థితి బ్రహ్మ జ్ఞానం వలనే కలుగుతుంది. ఎందుకంటే బ్రహ్మము ప్రకృతి రహితమైనది. శుద్ధమైనది. జ్ఞానమైనది. దాని నుంచి ప్రాకృత గుణాలు జనింపవు.

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోపు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

టీవీ యాంకర్‌కు నిద్రమాత్రలు కలిపి... లైంగికదాడికి పాల్పడిన పూజారి!!

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

11-05-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి...

Show comments