Webdunia - Bharat's app for daily news and videos

Install App

లేపాక్షిలోని సీతమ్మ పాదాలను స్పర్శిస్తే..?

Webdunia
శనివారం, 22 నవంబరు 2014 (17:11 IST)
సీతమ్మ పాదాలు కనిపించే దివ్య క్షేత్రమే అనంతపురం జిల్లాకి చెందిన 'లేపాక్షి'. అనేక విశేషాలను ఆవిష్కరించే ఆధ్యాత్మిక కేంద్రంగా లేపాక్షి అలరారుతోంది. అలాంటి లేపాక్షి క్షేత్రంలో ఒకచోట సీతమ్మవారిదిగా చెప్పబడుతోన్న పాదముద్ర కనిపిస్తుంది. 
 
ఇలాంటి పాదముద్రలు చాలా క్షేత్రాల్లో కనిపిస్తుంటాయి. అయితే ఈ పాదముద్ర యొక్క బొటనవ్రేలు భాగం నుంచి నిరంతరం సన్నని నీటిధార వస్తుండటం విశేషం. మండువేసవిలో సైతం ఈ నీటిధార ఆగకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించకమానదు.
 
సీతమ్మవారి పాదముద్రను తాకితే ఆ తల్లి ఆశీస్సులు లభించినట్లు భక్తులు భావిస్తుంటారు. ఆ నీటిని స్పర్శించినా, తలపై చల్లుకున్నా, తీర్థంగా స్వీకరించినా పాపాలు హరించిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. 
 
రాముడి వెంట వనవాసానికి బయలుదేరిన సీతమ్మ ఎన్నో ప్రాంతలమీదుగా ప్రయాణాన్ని కొనసాగించడం జరిగింది. ఆ తల్లి పాదస్పర్శచే ఈ నేల పునీతమైంది. అలాంటి సీతమ్మవారి పాదముద్రను పదిలంగా తన గుండెల్లో దాచుకుని, దర్శించిన భక్తులను ధన్యులను చేస్తోన్న ఈ మహిమాన్వితమైన క్షేత్రాన్ని చూసితీరవలసిందే.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

Show comments