Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారికి శక్తినిచ్చే భోగ శ్రీనివాసుడు.. ఈయన ఎక్కడుంటారో తెలుసా?

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2023 (11:08 IST)
కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఆలయంలోని మూలవిరాట్టును దర్శనం చేసుకునేందుకు భక్తులు దండోపదండాలుగా విచ్చేస్తారు. రద్దీ కారణంగా రెండు నిమిషాల పాటు స్వామిని దర్శించుకుని గోవిందా గోవిందా అంటూ వెళ్లిపోతుంటారు. 
 
అయితే మూలవిరాట్టు పాదాల చెంత చిన్న విగ్రహంగా భోగ శ్రీనివాసుడిని దర్శించుకోరు. ఈ భోగ శ్రీనివాసునికి ఏడాదికి ఒకసారి మాత్రమే ప్రత్యేక అభిషేక ఉత్సవం జరుగుతుంది. తిరుమలలో సహస్ర కలశాభిషేకం బ్రహ్మాండంగా జరుగుతుంది. తగిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. భోగ శ్రీనివాసునికి కింద ఓ పీఠం వుంది. ఇందులో శ్రీ యంత్రం వుంది. భోగ శ్రీనివాసుకుని శ్రీదేవి-భూదేవి సమేత మలయప్ప స్వామికి సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. ఆరంభంలో వారానికి ఓసారి జరిగే ఈ అభిషేకం ప్రస్తుతం ఏడాదికి ఒకసారి జరుగుతోంది. 
 
ఈ భోగ శ్రీనివాస విగ్రహం 1400 సంవత్సరాల నాటి ప్రాచీనమైనది. ప్రతిరోజూ శయన మండపంలో ఊంజల్ సేవలో వుండేలా చేస్తారు. ఈ భోగ శ్రీనివాసుడు భక్తుల కోరికలను నెరవేరుస్తాడు. తోమాల సేవలో, ఏకాంత సేవలో భోగ శ్రీనివాస విగ్రహాన్ని ఉపయోగిస్తారు. 
 
ఈయనే మూలవిరాట్టుకు శక్తినిస్తాడని.. ఆ శక్తితోనే మలయప్ప స్వామి భక్తుల కోరికలను నెరవేరుస్తాడని విశ్వాసం. ఈయన మూలవిరాట్టుకు ప్రతినిధిగా వ్యవహరిస్తాడని భక్తుల నమ్మకం. 

సంబంధిత వార్తలు

ఏపీలో 81.86 శాతం.. పిఠాపురంలో 86.36 శాతం పోలింగ్ : ముకేశ్ కుమార్ మీనా

బోరబండ వద్ద మేకప్ ఆర్టిస్టును హత్య చేసిన దుండగులు

భర్తతో కలిసి వుండటం ఇష్టం లేదు.. ప్రియుడితో రెండు నెలల గర్భిణి పరార్

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

కర్నూలు జిల్లా తుగ్గలిలో బంగారు గని... దేశంలో తొలి ప్రైవేట్ మైన్!!

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

11-05-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి...

10-05-2024 శుక్రవారం దినఫలాలు - సంఘంలో మీ గౌరవప్రతిష్టలు ఇనుమడిస్తాయి...

అక్షయ తృతీయ.. లక్ష్మీదేవిని పెళ్లిచేసుకున్న రోజు ఇదే..

09-05-2024 గురువారం దినఫలాలు - విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి...

తర్వాతి కథనం
Show comments