Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగవ శ్రావణ శుక్రవారం, శ్రీమహాలక్ష్మిని పూజిస్తే...

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (23:39 IST)
నాలుగో శ్రావణ శుక్రవారం. ఈ రోజు మహాలక్ష్మిని పూజించడం ద్వారా దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది. శ్రావణ మాసంలో వచ్చే ఈ శుక్రవారం రోజున లేదా ప్రతి శుక్రవారం నాడు మహిళలు నిష్ఠతో మహాలక్ష్మిని పూజిస్తే సిరిసంపదలు వెల్లివిరుస్తాయని విశ్వాసం.
 
శ్రావణ మాసంలో గోవులు, తామరపుష్పాలు, పాడిపంటలు, ఏనుగులు, అద్దాలు, శంఖనాదం, ఘంటారావం, హరిహరార్చన, పూజామందిరం, సర్వదేవతలనూ అర్చించే వారి స్వరం, తులసి ఉన్న ప్రదేశం, పువ్వులు, పండ్లతోటలు, మంగళకరమైన వస్తువులు, మంగళవాద్యాలు, దీపకాంతులు, కర్పూర హారతి, చెట్లలోని హరిత వర్ణం, స్నేహం, ఆరోగ్యం, ధర్మబుద్ధి, న్యాయస్థానాలు, శుచి, శుభ్రత, సదాచార పరాయణత, సౌమ్యగుణం, స్త్రీలు ఎటువంటి చీకూచింతా లేకుండా హాయిగా ఉండే ఇళ్లు, బ్రాహ్మణులు, విద్వాంసులు, పెద్దలు, పండితులకు సన్మాన సత్కారాలు జరిగే ప్రదేశాలు, వేదఘోష, సత్వగుణ సంపదలు, క్రమశిక్షణ, కార్యశూరత్వం, సమయపాలనలోనూ మహాలక్ష్మీ దేవి నివసిస్తుందని పురోహితులు చెబుతున్నారు.
 
అందుచేత శ్రావణ శుక్రవారం పూట తులసీపూజ, ఆలయాల్లో పాలు, తేనెతో అభిషేకాలు చేయించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు సూచిస్తున్నారు. శ్రావణ శుక్రవారం పూట సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, ఇంటిని, పూజగది శుభ్రం చేసుకోవాలి.
 
గడప, పూజగదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. అనంతరం అమ్మవారి ప్రతిమ లేదా పటానికి కర్పూర హారతులు సమర్పించి, చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టాలి. పూజా సమయంలో దుర్గాష్టకం లేదా ఏదేని అమ్మవారి శ్లోకములతో స్తుతించాలి. శ్రావణ మాసంలోని ఈ ఆఖరి శుక్రవారం రోజున అమ్మవారిని ప్రార్థించే వారికి దీర్ఘసుమంగళీ ప్రాప్తంతో పాటు ఆ గృహంలో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని విశ్వాసం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రముఖ కోలీవుడ్ హాస్య నటుడు రోబో శంకర్ కన్నుమూత

Chandra babu: త్వరలో సంజీవని ఆరోగ్య పథకాన్ని ప్రారంభించనున్న ఏపీ సర్కారు

Amaravati: అమరావతి తొమ్మిది లేన్ల సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం.. తుది దశలో పనులు

Air India: విమానం రెక్కల్ని ఢీకొన్న పక్షి- 103మంది ప్రయాణీకులను కాపాడిన పైలట్

Jayalalitha: జయలలిత నెచ్చెలి శశికళ ఆఫీసుల్లో ఈడీ సోదాలు

అన్నీ చూడండి

లేటెస్ట్

15-09-2025 సోమవారం ఫలితాలు - రుణ ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి....

14-09-2025 ఆదివారం దినఫలితాలు : దంపతుల మధ్య అకారణ కలహం

Weekly Horoscope: 14-09-2025 నుంచి 20-09-2025 వరకు ఫలితాలు

Shardiya Navratri 2025: దసరా నవరాత్రులు.. ఈసారి పది రోజులు.. ఐరావతంపై వస్తున్న దుర్గమ్మ..

Daily Astrology: 13-09-2025 రాశి ఫలాలు.. రుణ ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి..

తర్వాతి కథనం
Show comments