Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్ష్మీదేవి నామాన్ని నిత్యం స్మరిస్తూ వుంటే..?

Webdunia
శనివారం, 17 జనవరి 2015 (15:34 IST)
లక్ష్మీదేవి నామాన్ని నిరంతరం స్మరిస్తూ వుండటం ద్వారా ఆ దేవదేవి అనుగ్రహం లభిస్తుంది. నిత్యం లక్ష్మీదేవి నామస్మరణ చేసే వారింట ఆ తల్లి స్థిరనివాసం చేస్తుంది. సాధారణంగా లక్ష్మీదేవి చంచలమైన మనసును కలిగి ఉంటుందనీ, అందువలన ఒకచోట కుదురుగా ఉండకుండా వెళ్లిపోతూ ఉంటుందని అనుకుంటూ వుంటారు. నిజానికి లక్ష్మీదేవి స్వభావం అది కానేకాదు.
 
ధర్మబద్ధమైన ... పవిత్రమైన జీవన విధానాన్ని చూసి, సంప్రదాయబద్ధమైన పద్ధతులను చూసి లక్ష్మీదేవి రావడం జరుగుతుంది. ఏవైతే మంచి లక్షణాలను చూసి అమ్మవారు అక్కడ ఉందామని అడుగుపెడుతుందో, ఆ తరువాత ఆ ఇంట్లోని వ్యక్తులు అమ్మవారికి ఇబ్బంది కలిగించేలా ఆ లక్షణాలను మార్చుకున్నప్పుడు సహజంగానే ఆమె ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్లిపోతుంది.
 
లక్ష్మీదేవి రావడం, తిరిగి వెళ్లిపోవడనేది పూర్తిగా ఆ ఇంట్లోవాళ్లు నడచుకునే విధానంపై మాత్రమే ఆధారపడి వుంటుంది. లక్ష్మీదేవి స్థిరనివాసం చేయాలంటే పవిత్రమైన జీవనవిధానానికి భంగం కలగకుండా చూసుకోవాలి. లక్ష్మీదేవిని అనునిత్యం పూజిస్తూ, సేవిస్తూ, ఆమె నామాన్ని స్మరిస్తూ ఉంటే సంపదలకు ఎలాంటి లోటు ఉండదని పండితులు సెలివిస్తున్నారు. 

ఆగస్టు 15లోగా రైతుల 2 లక్షల పంట రుణాల మాఫీ.. ఏర్పాట్లు ఆరంభం

41 రోజుల రాజశ్యామల సహస్ర చండీయాగంలో జగన్

పాఠ్యపుస్తకాల మందం తగ్గింది.. ఈసారి ఆ ఇబ్బంది వుండదు..

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

11-05-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి...

10-05-2024 శుక్రవారం దినఫలాలు - సంఘంలో మీ గౌరవప్రతిష్టలు ఇనుమడిస్తాయి...

అక్షయ తృతీయ.. లక్ష్మీదేవిని పెళ్లిచేసుకున్న రోజు ఇదే..

Show comments