Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ కార్తీక మాసం నాడు ఈ ఒక్క పని చేస్తే చాలు... ఉద్యోగ-వ్యాపార బిజీ అనొద్దు...

Webdunia
సోమవారం, 19 నవంబరు 2018 (20:23 IST)
కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమను కార్తీక పౌర్ణమి అంటారు. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరులకు అత్యంత ప్రీతికరమైన మాసం. అన్ని మాసాల్లోను ఈ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగిన మాసమని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి. శివునికి, విష్ణువునకు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం కావున మానవాళికి వారి శుభ అనుగ్రహం పొందడానికి తగిన మాసమని దీనికి ఎంతో ప్రాశస్త్యం కలిగినది అని పురాణాలుతెలుపుతున్నాయి. 
 
ఈ మాసంలో ప్రతి దినమూ పవిత్రమైనదే. సోమవారాలు, రెండు ఏకాదశులు, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావవంతమైనవి. నెలరోజులూ చేసే పూజల ఫలితం ఒక ఎత్తు, పౌర్ణమి నాటి పూజల ఫలితం ఒక్కటీ మరొక ఎత్తు.... అందువల్ల అనేక వ్రతాలు, పూజలు, కృత్యాలకు, దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలనీ పురాణాలు వివరిస్తున్నాయి.
 
వైజ్ఞానిక పరంగా ఆలోచించి చూడగా ఈ కార్తీక దీపాలను వెలిగించే అనేక దీపాల వల్ల వాటి నుండి వచ్చే వాయువుల వల్ల వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించి, వాతావరణం శుద్ది అవుతుంది. తద్వారా మనకు ఆరోగ్యం చేకూరుతుంది. ఈ పౌర్ణిమకు త్రిపుర పూర్ణిమ అని మరొకపేరు. 
 
తారకాసురుడి ముగ్గురు కుమారులూ బ్రహ్మను మెప్పించి, ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు పురాలను వరంగా పొందారు. ఎవరివల్లా మరణం లేకుండా వరంకోరారు. అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ. అలాగైతే రథం కాని రథం మీద, విల్లుకాని విల్లుతో, నారికాని నారి సారించి, బాణంకాని బాణం సంధించి, మూడు నగరాలూ ఒకే సరళ రేఖలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురినీ ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు. ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు. ఆ వర బలంతో పట్టణాలతో సహా సంచారం చేస్తూ లోకాలన్నింటా కల్లోలం సృష్టిస్తున్నారు. 
 
వివిధ లోకవాసులు బ్రహ్మకు మొర పెట్టుకున్నారు. వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేనన్నాడు. విష్ణువు దగ్గరకెళ్ళమని ఉపాయం చెప్పాడు. విష్ణువు కూడా తనకా శక్తిలేదని, వారిని వెంటపెట్టుకుని శివుడి దగ్గరకు వెళ్లాడు. దేవతలందరూ సహకరిస్తే తానీపని చేయగలనన్నాడు శివుడు. ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది.
 
మేరు పర్వతం విల్లుకాని విల్లుగా, ఆదిశేషువు అల్లెతాడు కాని అల్లెతాడుగా, శ్రీమహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు. వీరందరి సమాహార శక్తితో శివుడు త్రిపురాసురులను (మూడు పట్టణాల యజమానులైన రాక్షసులను) సంహరించాడని, అందువల్ల ఈ పేరు వచ్చిందనీ పురాణ కథనం. ఈరోజు చేసే స్నానం, దీపారాధన, ఉపవాసం లాంటి అన్నింటిలోనూ ఆరోగ్య, ఆధ్యాత్మిక భావనలు అంతర్లీనంగా ఉన్నాయి.
 
ఈ మాసమంతా సూర్యోదయానికి ముందే తలస్నానం చేయడం వలన ఈ కాలపు వాతావరణపరంగా మనకు ఎంతో ఆరోగ్యప్రదం. ప్రస్తుత కాలంలో ఉద్యోగాల బిజిలో కాని ఇతర ఏ కారణం చేతనైనా రోజు దేవుని పూజించి దీపారాధన చేసే సమయం లేనివారు, ఆచరించలేని వారు ఈ పౌర్ణమినాడు ఆచరిస్తే చాలు, నెలంతా చేసిన ఫలితం కలుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Birthday: బర్త్ డే జరుపుకుందామనుకుంటే.. కేకు పేలింది.. (video)

అధ్యక్షా... ఈ పోల్ ఇపుడు అవసరమా? పరువు పోగొట్టుకున్న టి.కాంగ్రెస్, రేవంత్ ఫైర్

Hall Tickets: హాల్ టిక్కెట్లు లేకపోయినా పరీక్షలు రాయడానికి అనుమతి.. ఎక్కడంటే?

అది మా పనోళ్ల కోసం నిర్మించిన సెక్యూర్డ్ భవనం : మాజీ మంత్రి పెద్దిరెడ్డి (Video)

ప్రయాగ్ రాజ్ మోనాలిసా ఇంటికి దర్శకుడు సనోజ్ మిశ్రా, సినీ ఆఫర్ కన్ఫర్మ్ (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Mauni Amavasya: మౌని అమావాస్య, ఏం చేయాలి?

Shab e Meraj విశ్వ సృష్టికర్త అల్లాహ్‌ను కలిసే గౌరవం పొందిన పవిత్ర రాత్రి

28-01-2025 మంగళవారం దినఫలితాలు : దంపతుల మధ్య సఖ్యత లోపం...

Pradosh Vrat : సోమ ప్రదోష వ్రతం: శివాలయంలో అన్నదానం చేస్తే..?

27-01-2025 సోమవారం దినఫలితాలు : కొత్త వ్యక్తులతో సంభాషించవద్దు...

తర్వాతి కథనం
Show comments