Webdunia - Bharat's app for daily news and videos

Install App

కపిల తీర్థంలో పుణ్య స్నానం చేస్తే ప్రపంచంలోని తీర్థాలన్నిటిలోనూ... (Video)

Webdunia
సోమవారం, 6 జులై 2020 (22:36 IST)
పూర్వం ఒకప్పుడు ఓ బ్రాహ్మణుడు క్షేత్రాలను దర్శిస్తూ, తీర్థాల్లో మునకలిడుతూ దేశ సంచారం చేస్తుండేవాడు. అసలు ప్రపంచంలో ఎన్ని తీర్థాలు వున్నాయో వాటి అన్నింట్లోనూ స్నానం చేసి తరలించాలని భావించి తిరుగుతుండేవాడు. అలా విశ్రాంతి లేకుండా తిరుగుతున్నందువల్ల చాలా బలహీనుడై శుష్కించిన శరీరంతో, నీరసించి, శోషించి, మగతనిద్రకు లోనయ్యాడు.
 
ఆ నిద్రలో వేంకటేశ్వర స్వామి కనిపించి... ఓ బ్రాహ్మణోత్తమా... నీ ప్రయత్నం అసాధ్యమైంది. నీకే కాదు ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు. ఎప్పటికీ నెరవేరదు కూడా. కానీ వేంకటాచల క్షేత్రంలో కపిలతీర్థం మొదలుగా అత్యంత ప్రధానమైన హదిహేడు పుణ్యతీర్థాలున్నాయి. వాటిల్లో శాస్త్రోక్తంగా నియమంగా స్నానం చేస్తే చాలు, ప్రపంచంలోని తీర్థాలన్నింటిలోనూ స్నానం చేసిన ఫలితం వస్తుంది.
 
అందులో ఏమాత్రం సందేహం లేదు. అందువల్ల నీవు ఆ పదిహేడు తీర్థాల్లో స్నానం చెయ్యి. నీ కోరిక నెరవేరినట్లవుతుంది అన్నాడు. ఆ స్వప్నం మేరకు బ్రాహ్మణుడు మేల్కొని తన తీర్థాటనను విరమించుకుని వేంకటాచల క్షేత్రానికి వెళ్లి అక్కడ వున్న పదిహేడు తీర్థాలను సేవించి ముక్తి పొందాడు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఈ నెల 24 నుంచి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

అత్యాచారం చేసి స్క్రూడ్రైవర్‌తో ప్రియురాలిని హత్య చేశాడు.. నిందితుడికి జీవిత ఖైదు

కల్వకుంట్ల ఫ్యామిలీలో ఆసక్తికర పరిణామం : కుమార్తె కవిత ఇంటికి వెళ్లిన తల్లి శోభ

AP Ration Cards: ఏటీఎం కార్డులను పోలిన స్మార్ట్ రేషన్ కార్డులు

మెగా డీఎస్సీకి మెలిక పెట్టిన విద్యాశాఖ.. భర్త పేరుపైనే ఈడబ్ల్యూఎస్ ధృవపత్రాలు ఉండాలి...

అన్నీ చూడండి

లేటెస్ట్

Naimisharanya: బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ సమక్షంలో నైమిశారణ్యంలో పూర్తయిన భాగవత సప్తాహం

TTD: అన్నప్రసాద సేవ కోసం కూరగాయల విరాళాలు.. డైనమిక్ వ్యవస్థ సిద్ధం

Sankatahara Chaturthi 2025: బుధవారం సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే?

10-09-2025 బుధవారం ఫలితాలు - కీలక పత్రాలు.. నగదు జాగ్రత్త...

09-09-2025 మంగళవారం ఫలితాలు - దంపతుల మధ్య అకారణ కలహం....

తర్వాతి కథనం
Show comments