నలదమయంతి : జూదం ఆడినా పతికి సేవచేసిన..

Webdunia
బుధవారం, 24 డిశెంబరు 2014 (19:07 IST)
నలమహారాజు దాయాదితో జూదం ఆడుతున్నాడని దమయంతికి తెలుస్తుంది. తన రాజ్యంలో ఎవరూ జూదం ఆడకూడదని నిషేధం విధించిన భర్త జూదం ఆడుతున్నాడని తెలిసి ఆందోళన చెందుతుంది. సరదాగా మొదలైన జూదం పందాల వరకూ వెళ్లడంతో అప్పటికే నలమహారాజు తన రాజ్యంలోని కొన్ని భాగాలను కోల్పోతాడు. 
 
జూదం ఆడటం వలన చెడే తప్ప మంచి జరిగిన దాఖలాలు చరిత్రలో ఎక్కడా లేవని నలమహారాజుతో దమయంతి చెబుతుంది. సిరిసంపదలను తుడిచి పెట్టడమే కాకుండా, పరువు ప్రతిష్ఠలను వీధిన పడేసే శక్తి జూదానికి వుందని అంటుంది.
 
కుటుంబ సభ్యులు ... దేశ ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని వెంటనే జూదాన్ని ఆపమని దమయంతి కోరుతుంది. అయినా ఆమె మాటలు వినకుండా నలమహారాజు జూదం ఆడతాడు .. పందెంగా రాజ్యాన్ని కోల్పోతాడు. ఓడినవారు రాజ్యాన్ని విడిచి వెళ్లాలనే నియమం కూడా ఉండటంతో కట్టుబట్టలతో అక్కడి నుంచి కదులుతాడు. విధి కారణంగా ఓడిన భర్తను నిందిచడం వలన ఆయన మనసు మరింత గాయపడుతుందని దమయంతి భర్తను ఒక్కమాట కూడా అనదు.
 
అమ్మవారిపై భారంవేసి భర్తతో పాటు కష్టాలను అనుభవించడానికి ఆమె సిద్ధపడుతుంది. అడవిలోనైనా ఆయన సేవ చేసుకునే భాగ్యం దొరికితే తనకదే చాలని అనుకుంటుంది. ఆయన సేవ చేసుకోవడంలోనే తనకి నిజమైన ఆనందం కలుగుతుందని భావిస్తుంది. ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా తన పిల్లలను పుట్టింటికి పంపించి వేసి ఆనందంగా భర్తను అనుసరిస్తుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్యార్థినికి 60 మార్కులు వస్తే 5 మార్కులుగా చూపించిన లెక్చరర్, డిబార్ చేసిన అధికారులు

అమ్మా క్యాంటీన్లలో రుచికరమైన ఆహారం అందించండి.. సీఎం విజయ్ ఆదేశాలు

నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ - ఎన్టీఏ అధికారులకు సమన్లు

రోడ్లపై నమాజ్ చేస్తే ఊరుకోం : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

స్కార్పియో, పది లక్షలు, బంగారం, 16 ఉంగరాలు ఇచ్చినా సరిపోలేదు.. వివాహితను ఏం చేశారు?

అన్నీ చూడండి

లేటెస్ట్

19-05-2026 మంగళవారం ఫలితాలు- అందరినీ కలుపుకుపోయేందుకు యత్నించండి

Mantra for tuesday: మంగళవారం ఏ మంత్రం జపించాలి.. మంగళ గాయత్రీ పఠనంతో..?

శేషాచలం కొండల్లో 89.4 శాతం పచ్చదనం.. టీటీడీని అభినందించిన సీఎం బాబు

సోమవారం శివ నామ స్మరణతో కలిగే లాభాలేంటో తెలిస్తే?

18-05-2026 సోమవారం ఫలితాలు - విలాసాలకు ఖర్చుచేస్తారు.. చెల్లింపుల్లో జాగ్రత్త...

Show comments