ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శివలింగం... ఎత్తు ఎంతో తెలుసా?

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (14:10 IST)
కేరళ రాష్ట్రంలోని చెన్కల్‌లో ఉన్న మహేశ్వరం శివపార్వతి ఆలయంలో అత్యంత ఎత్తయిన శివలింగాన్ని నిర్మిస్తున్నారు. 111.2 అడుగుల ఎత్తు గల శివలింగం నిర్మాణం 2012 సంవత్సరం మోలో మొదలైంది. అంతేకాకుండా ఈ శివలింగం లోపలికి కూడా భక్తులు ప్రవేశించవచ్చు. ఇందులో ఎనిమిది అంతస్తులు ఉంటాయి. మనిషి శరీరంలో ఉండే ఆరు శక్తి కేంద్రాలైన ములధార, స్వదిస్థాన, మణిపుర, అన్హా, విషుద్ధ, అజ్నలను ఒక్కో అంతస్తు సూచిస్తుండగా మొదటి అంతస్తులో 108 శివలింగాలను ప్రతిష్టిస్తున్నారు.
 
ఇందులో ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే శివలింగం ఎగువభాగంలో కైలాసం వలె నిర్మించి, హిమాలయాలతో పాటుగా శివపార్వతుల విగ్రహాలను కూడా ఏర్పాటు చేసారు. అంతేకాకుండా ఇక్కడ భక్తులు 12 జ్యోతిర్లింగాలు, విఘ్ననాథుని 32 రూపాలను ఒకేచోట దర్శించుకోవచ్చు. మఠాధిపతులు మహేశ్వరానంద స్వామి తదితరులు దేశంలోని పలు పుణ్యక్షేత్రాల నుండి మట్టిని సేకరించి ఈ నిర్మాణంలో ఉపయోగించారు.
 
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు ఈ శివలింగం ఎత్తును కొలిచి, భారతదేశంలోనే అత్యంత ఎత్తయిన శివలింగంగా నమోదు చేసి, గురువారం నాడు అధికారికంగా ప్రకటించారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా చోటు లభిస్తుందని ఆశిస్తున్నారు ఆలయ అధికారులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

లేటెస్ట్

25-11-2025 మంగళవారం ఫలితాలు - ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు...

సుబ్రహ్మణ్య షష్టి: ఓం శరవణభవ నమః

నవంబర్ 25 ధ్వజారోహణ.. రామభూమి అయోధ్యలో 100 టన్నుల పుష్పాలతో అలంకరణ

24-11-2025 సోమవారం ఫలితాలు - గ్రహస్థితి అనుకూలం.. కార్యసిద్ధిస్తుంది...

23-11-2025 ఆదివారం ఫలితాలు - ఆచితూచి అడుగేయండి.. భేషజాలకు పోవద్దు...

తర్వాతి కథనం
Show comments