సోమరితనం మాత్రమే అదృష్టం కోసం ఎదురుచూస్తుంది

అనువుగాని చోట, మనదికాని చోట, మన గురించి తెలియని మనుష్యుల మధ్య వుండి, సుఖశాంతులు, విశ్రాంతి పొందగలమనుకోవడం దూరపు కొండలు నునుపు అనిపించడమే. సోమరితనం మాత్రమే అదృష్టం కోసం ఎదురుచూస్తుంది. స్వయంకృషి చేతనే యోగ్యతను పొందగలం. ఒకటి పొందాలి అంటే మరొకటి వదులు

Webdunia
గురువారం, 30 మార్చి 2017 (22:14 IST)
అనువుగాని చోట, మనదికాని చోట, మన గురించి తెలియని మనుష్యుల మధ్య వుండి, సుఖశాంతులు, విశ్రాంతి పొందగలమనుకోవడం దూరపు కొండలు నునుపు అనిపించడమే.
 
సోమరితనం మాత్రమే అదృష్టం కోసం ఎదురుచూస్తుంది.
 
స్వయంకృషి చేతనే యోగ్యతను పొందగలం. ఒకటి పొందాలి అంటే మరొకటి వదులుకోవాలి.
 
స్వేచ్ఛగా, స్వచ్ఛంగా, దాపరికం లేకుండా మాట్లాడు.
 
రోగం వున్నా ఆరోగ్యంగానే తిరుగుతుంటారు కొందరు. రోగం లేకున్నా ఎప్పుడూ ఏదో అనారోగ్యంతో బాధపడుతుంటారు మరికొందరు. ఇందుకు మూలం మన శరీర మానసిక తత్వం.
 
అయినవాడ్ని ఎందుకు దూరం చేసుకుంటావ్?
 
కష్టజీవి ఇంట ప్రతినిత్యం ధనలక్ష్మి కొలువుంటుంది
 
ఇప్పటి నీ మంచితనం, ఇప్పుడు నీవు చేసే మంచి పనులే చివరికి నీకు ఆసరాగా నిలుస్తాయి.
 
ఏమీ తినకుండా పరగడపున ఆకలి బాధతో దర్శనం చేసుకుంటేనేనా పుణ్యం?
 
ఏవేవో అనవసరపు ఆలోచనలు చేయడం కంటే నీ గురించి నీవు ఆలోచించుకో. నీ గురించి నీవు తెలుసుకో. 
 
అలవికాని కోరికలు, అక్కరకు రాని ఆలోచనలు అశాంతిని, వేదనను కలిగిస్తాయి. 
 
దాహం వేసినప్పుడు మంచినీళ్లు ఇచ్చి దప్పిక తీర్చిన మహానుభావుడికి అతనికి అవసరమైనప్పుడు పాలిచ్చి మాత్రమే నీ రుణం తీర్చుకో.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇద్దరు కుమార్తెలను బావిలోకి విసిరేసి ఆత్మహత్య చేసుకున్న మహిళ

Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు- కవితకు సీబీఐ నోటీసులు

చెన్నైలో వంట గ్యాస్ సిలిండర్ల కొరత.. హాస్టల్స్ మూసివేత.. నో ఆమ్లెట్.. ఒకే చట్నీ.. ఆ పొయ్యిలతో..?

కష్టకాలంలో బంగ్లాదేశ్‌కు భారత్ చేయూత.. షేక్ హసీనా పైప్‌లైన్ నుంచి 5,000 టన్నుల డీజిల్‌ సరఫరా

ఇరాన్ నుంచి భారత్‌కు విద్యార్థులు.. ఖతార్ నుండి ఢిల్లీకి 177 మంది భారతీయులు

అన్నీ చూడండి

లేటెస్ట్

ఈ దొంగ సన్యాసిని బయటకు గెంటండి: సాయిబాబా

ఆదాయం పెరగాలంటే.. ధనవంతులు కావాలంటే.. చాణక్య నీతిని..?

09-03-2026 సోమవారం ఫలితాలు : దంపతుల మధ్య అకారణ కలహం...

08-03-2026 ఆదివారం ఫలితాలు- మీ కృషికి అదృష్టం తోడవుతుంది

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయంలో కుంభాభిషేకం, గోపురం చూసినా చాలు...

తర్వాతి కథనం
Show comments