అయ్యప్ప స్వామి అష్టకంలో మార్పు..

కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి భక్తులు స్వామి దర్శనార్థం కేరళకు వెళ్తుంటారు. పవిత్ర మాలలు ధరించి.. అయ్యప్ప స్వామిని దర్శించుకునే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోందని దేవస్థానం వెల్లడించింది. ఈ నేపథ్యం

Webdunia
సోమవారం, 20 నవంబరు 2017 (12:35 IST)
కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి భక్తులు స్వామి దర్శనార్థం కేరళకు వెళ్తుంటారు. పవిత్ర మాలలు ధరించి.. అయ్యప్ప స్వామిని దర్శించుకునే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోందని దేవస్థానం వెల్లడించింది. ఈ నేపథ్యంలో పంబానది తీరాన, శబరిగిరుల్లో వెలసి కోట్లాది మంది కొంగుబంగారమైన అయ్యప్ప స్వామిని నిద్రపుచ్చుతూ పాడే జోలపాట 'హరివరాసనం నిత్యమోహనం' అష్టకంలోలోని చిన్న తప్పును సరిదిద్దాలని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు (టీబీడీ) నిర్ణయించింది. 
 
ఈ శ్లోకాల్లోని కొన్ని సంస్కృత పదాలు రూపాంతరం చెందాయని.. మరికొన్ని అసలుకే లేవని టీబీడీ తెలిపింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న కేజే ఏసుదాస్ రాగానే, సరిదిద్దిన ''హరివరాసనం'' రికార్డు చేస్తామని టీబీడీ వెల్లడించింది. ఈ అష్టకంలోని 'అరివిమర్దనం... నిత్యనర్తనం' అన్న వాక్యంలో 'అరి' అంటే శత్రువని, 'మర్దనం' అంటే నాశనం చేయడమన్న అర్థం వస్తుంది. ప్రస్తుతం ఈ రెండు పదాలనూ కలిపి పలుకుతుండగా, మారిన శ్లోకంలో రెండు విడివిడి పదాలుగా ఉంటాయని తెలిపింది.
 
1975 మలయాళ సినిమా స్వామి అయ్యప్పన్ కోసం ఈ పాట రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఈ పాటలోని హరివరాసనం అష్టకాన్ని మార్చేందుకుగాను జేసుదాస్‌తో చర్చించినట్లు టీబీడీ తెలిపింది. ఇక శబరిమల ఆలయం నవంబర్ 15 నుంచి ప్రారంభమైంది. ఈ ఆలయం మూడు నెలల పాటు మకర జ్యోతి కోసం తెరిచే వుంటుంది. 41 రోజుల పాటు జరిగే మండల పూజ డిసెంబర్ 26తో ముగియనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడు గదికి కుమార్తెను బలవంతంగా పంపిన తల్లి... ఎక్కడ?

చంద్రునిపై అన్వేషణ మిషన్లకు మద్దతుగా రోబోటిక్ ల్యాండర్లు, రోవర్లు, డ్రోన్‌లు

అక్రమ సంబంధం.. రూ.2 కోట్ల బీమా సొమ్ము కోసం భర్తను హత్య చేయించిన భార్య

ఉగాండా నుండి వచ్చిన మహిళకు ఎబోలా.. బెంగళూరులో ఐసోలేషన్

ఇన్‍‌స్టాలో పరియమైన మహిళ దూరం పెట్టిందనీ చంపేసిన ప్రియుడు.. ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

25-05-2026 సోమవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు.. ముఖ్యుల కలయిక వీలుపడదు...

తర్వాతి కథనం
Show comments