Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరామనవమి రోజున వ్రతమాచరిస్తే.. మహాపాపాలు తొలగిపోతాయట!

Webdunia
గురువారం, 14 ఏప్రియల్ 2016 (12:02 IST)
శ్రీరామనవమి రోజున వ్రతం ఆచరిస్తే మహాపాపాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా జన్మజన్మాల పాపాలు జ్ఞానాగ్ని వల్ల నాశనమవుతాయని వారు చెప్తున్నారు. వ్రతం ఎలా ఆచరించాలంటే..? శివభక్తుడైన అగస్త్యమహర్షి సుతేష్ణ మహర్షితో ఇలా చెప్పాడు 'ఓ సుతేష్ణ మునీ! నీకు నేను ఒక రహస్యము చెపుతాను' అని ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు.
 
చైత్రమాసంలో శుక్లపక్షమి రోజున సచ్చిదానంద స్వరూపియైన రామచంద్రుడు అవతరించెను. కాబట్టి ఆ రోజున ఉపవాసం ఉండి ఆ రాత్రి శ్రీరాముని షోడశోపచారాలతో ఆరాధించి పురాణానాన్ని చదివి, జాగారణ చేసి మరుసటి రోజు ఉదయాన్నే శుచిగా స్నానమాచరించి తన శక్తికి తగినట్లుగా, భక్తియుక్తులతో శ్రీ తన శక్తికి తగినట్లుగా భక్తియుక్తులతో శ్రీరామచంద్రుని పూజించి.. అన్నదానం చేసి.. గోవు, భూమి, నువ్వులు, బంగారం, వస్త్రాలు, ఆభరణాలు ఇచ్చి కౌసల్య పుత్రుడైన శ్రీరామచంద్రుని ఆనందింపచేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెప్తున్నారు. ఇలా శ్రీరామనవమి వ్రతం భక్తిగా ఆచరించు వారి జన్మాంతరముల పాపాలు అన్నీ నశించిపోతాయి. ఇంకా సర్వోత్తమమైన విష్ణు పదము లభిస్తుంది. ఈ ధర్మం అందరికీ ఇహపరలోకాలలో భోగాన్ని మోక్షాన్ని కలిగిస్తుంది. 
 
అంతేగాకుండా నవమి రోజున శ్రీరామ ప్రతిమకు పూజను పూజావిధానంగా చేసినట్లయితే ముక్తులవుతారు. శ్రీరాముడి ప్రతిమను తమ శక్తికి తగ్గట్టు.. రజత, స్వర్ణంతో చేయించి పై వ్రతం చేసినట్లయితే ఆ వ్యక్తి సర్వపాపాలు తొలగిపోతాయి. రామమంత్రం తెలియనివాడు ఈ వ్రతం రోజున ఉపవాసం ఉండి, శ్రీరామ స్మరణ చేసినట్లయితే అన్ని పాపాలు నశించినవాడు అవుతాడని పురాణాలు చెప్తున్నాయి. 

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

Show comments