Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ రోజు పురుషులు తలంటు స్నానం చేస్తే అనుకోని ఆపదలు... స్త్రీలకు ఐశ్వర్యం ఎప్పుడు?

సాధారణంగా ఆడవాళ్ళు అందరు శుక్రవారం నాడు తలస్నానం చేయటం అనేది జరుగుతుంది. ఆడపిల్ల లక్ష్మి దేవితో సమానం కాబట్టి మన పెద్దవాళ్ళు మనకు శుక్రవారం అలవాటు చేసారు. కానీ ధర్మశాస్త్రాల ప్రకారం ఆడవాళ్ళు శుక్రవారం

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2016 (20:09 IST)
సాధారణంగా ఆడవాళ్ళు అందరు శుక్రవారం నాడు తలస్నానం చేయటం అనేది జరుగుతుంది. ఆడపిల్ల లక్ష్మి దేవితో సమానం కాబట్టి మన పెద్దవాళ్ళు మనకు శుక్రవారం అలవాటు చేసారు. కానీ ధర్మశాస్త్రాల ప్రకారం ఆడవాళ్ళు శుక్రవారం లేదా మంగళవారం తలస్నానం చేయకూడదు. ఎంతో తప్పనిపరిస్థితి అయితేనే చేయాలి. ఆడవాళ్ళు ముఖ్యంగా తమ జీవితంలో పసుపు కుంకాలకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తారు. సౌభాగ్యం కలకాలం చల్లగా ఉండాలంటే తలస్నానం చేసే విధానం, ఎప్పుడు చేయాలి అనేది తెలిసి ఉండాలి. 
 
స్త్రీలు శనివారం తలంటు స్నానం చేస్తే ఐశ్వర్యం లభిస్తుంది. బుధవారం చేస్తే  భార్యభర్తల మధ్య ఐక్యత బాగుంటుంది. సోమవారం తలంటు చేస్తే సౌభాగ్యవంతులుగా ఉంటారు. తప్పనిసరిగా భోజనానికి ముందే తలంటు స్నానం చేయాలి. ప్రతి స్త్రీ తలంటు స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా ఒంటికి నూనె రాసుకుని, ముఖానికి పసుపు రాసుకుని, నలుగు పెట్టుకుని చేయాలి. ఆ రోజు ఇంటికి ఎవరైనా ముత్తైదువ వస్తే ఆమెకు నుదుటిన కుంకుమ పెట్టి కొంచెం పసుపు, కుంకుమ, 2 మట్టి గాజులు ఇస్తే మంచిదని అంటారు.
 
పురుషులు ఆయా వారాలలో చేసే తలంటు స్నానాలు ఆయా ఫలితాలను ఇస్తాయి. శనివారం తలంటు స్నానం చేస్తే మహా భోగం కలుగుతుంది. ఆదివారము తలంటు స్నానం చేస్తే తాపాన్ని, కోర్కెలని పెంచుతుంది. సోమవారము తలంటు స్నానం అందాన్ని మరింతగా పెంచుతుంది. మంగళవారము తలంటు స్నానము విపరీత దుఃఖాలకి కారణమవుతుంది. బుధవారం తలంటు స్నానం లక్ష్మి దీవెనలు తప్పక లభిస్తాయి. గురువారం నాడు తలంటు స్నానము చెయ్యటం ద్వారా ఆర్ధిక నష్టములు విపరీతముగా ఉండుట జరుగును. శుక్రవారం తలంటు అనుకోని ఆపదలు సంభవిస్తాయి. ఈ అంశాలకు అనుగుణంగా స్త్రీ – పురుషులు తలంటు స్నానాన్ని ఆచరించాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ - ఉప్పందించిన స్థానికులు.. టెక్కీల అరెస్టు

ఏపీలో వచ్చే మూడు రోజులపాటు వర్షాలు

అర్థంకాని చదువు చదవలేక చావే దిక్కైంది.. సూసైడ్ లేఖలోని ప్రతి అక్షరం ఓ కన్నీటి చుక్క..

యెమెన్‌లో ఘోర విషాదం.. 68 మంది అక్రమ వలసదారుల జలసమాధి

భార్య కాపురానికి రాలేదని నిప్పంటించుకున్న భర్త....

అన్నీ చూడండి

లేటెస్ట్

Pindi Deepam: శ్రావణ శనివారం శ్రీవారిని పూజిస్తే.. పిండి దీపం వెలిగిస్తే?

భయాన్ని పోగొట్టే భగవంతుని శ్లోకాలు

తోరాన్ని కట్టుకున్నవారు ఎన్ని రోజులు ఉంచుకోవాలి?

01-08-2025 శుక్రవారం దినఫలితాలు - ఊహించని ఖర్చులు చికాకుపరుస్తాయి....

సముద్రపు తెల్ల గవ్వలు ఇంట్లో పెట్టుకోవచ్చా?

తర్వాతి కథనం
Show comments