మహాశివరాత్రి ఉపవాసం వుంటే.. ఇవి తినకూడదట..

Webdunia
బుధవారం, 10 మార్చి 2021 (12:04 IST)
మహాశివరాత్రి రోజున ఉపవాసం, జాగారం తప్పనిసరి. శివరాత్రికి ముందు రోజు ఒకవేళ భోజనం చేసి.. సుఖభోగాలకు దూరంగా వుండాలి. శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందు నిద్రలేచి.. శుచిగా స్నానమాచరించి.. సూర్య నమస్కారం చేయాలి. శివపూజ చేయాలి. ఆపై ఆలయాల్లో శివ దర్శనం చేసుకోవాలి. ధ్వజస్తంభం లేని ఆలయంలో సాష్టాంగ నమస్కరించకూడదు.
 
మహాశివరాత్రి రోజున శివకథలు వింటూ జాగరణ చేయాలి. అలాగే రథరాత్రి మూడు, నాలుగో జాములో మరోసారి ఆహుతులను సమర్పించాలి. తెల్లవారున శివ భక్తులకు అన్న వస్త్రాలు, ఛత్రం ధానం చేయాలి. ఇంటి దగ్గరే శివపార్వతులను పుష్పాలు, బిల్వదళాలు, పంచామృతాలతో అభిషేకం చేయాలి. వీలైతే ఆలయాల్లో జరిగే పూజల్లో పాలు పంచుకోవచ్చు.
 
మహా శివరాత్రి రోజున ప్రాతఃకాలాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి శివాలయాన్ని దర్శించుకోవాలి. సూర్యోదయం వరకూ మౌనవ్రతం చేయదలచినవారు ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని మనసులో స్మరిస్తూ ఉండాలి. వ్రతం పాటిస్తే గనక శివరాత్రి రోజున వరి అన్నం, గోధుమలు, పప్పులు వంటివి తినకూడదు. వాటి బదులు పండ్లు, పాలు వాడాలి. చాలా మంది భక్తులు రాత్రంతా పూజ చేస్తారు. ఎంత నిష్టగా చేస్తే అంత మంచి ఫలం దక్కుతుందని ప్రతీతి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామపక్షం అందించారు, ఇక తమిళనాడు సీఎంగా TVK విజయ్

సింహాల గుంపుకు చుక్కలు చూపించిన పాము.. వీడియో వైరల్

ఫాస్టర్ కాదు కిరాతకుడు.. మైనర్ బాలికపై అత్యాచారం.. గర్భనిరోధక మందులిచ్చి...?

వరంగల్ జిల్లాలో పురాతన ఆలయం కూల్చివేత.. ఖండించిన బీజేపీ

ఒంగోలు వర్కర్స్ సైరన్‌కు ఆరు దశాబ్దాలు పూర్తి.. కోడి కూయడం కాస్త ఆలస్యం కావచ్చు.. కానీ?

అన్నీ చూడండి

లేటెస్ట్

05-05-2026 మంగళవారం ఫలితాలు - గిట్టని వ్యక్తులతో జాగ్రత్త

04-05-2026 సోమవారం ఫలితాలు - బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి...

03-05-2026 ఆదివారం ఫలితాలు - వస్త్రప్రాప్తి - ధనలాభం.. ఖర్చులు సామాన్యం....

03-05-2026 నుంచి 09-05-2026 వరకు మీ వార ఫలితాలు

Ghee Adulteration Row: శ్రీవారి లడ్డూలో కల్తీ, భారీ లోపాలను ఎత్తిచూపిన ప్యానెల్

తర్వాతి కథనం
Show comments