Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణుడు ధర్మం పక్షాన నిలచేవాడైతే అధర్మపరులకు సైన్య సహాయం ఎందుకు?

కృష్ణుడు న్యాయాధికారి కాదు. నీతి, అవినీతులను విచారించి తప్పు, ఒప్పుల గురించి తీర్పునిచ్చేందుకు (న్యాయానికి, ధర్మానికి మధ్య అతి సన్నని రేఖ ఉంది. ధర్మం శాశ్వతమైనది, స్థిరమైనది. నీతి, న్యాయం అనేవి పరిస్థితులపైన, సాక్ష్యాలపైన ఆధారపడి నిర్ణయించబడేవి) అత

Webdunia
బుధవారం, 30 నవంబరు 2016 (18:58 IST)
కృష్ణుడు న్యాయాధికారి కాదు. నీతి, అవినీతులను విచారించి తప్పు, ఒప్పుల గురించి తీర్పునిచ్చేందుకు (న్యాయానికి, ధర్మానికి మధ్య అతి సన్నని రేఖ ఉంది. ధర్మం శాశ్వతమైనది, స్థిరమైనది. నీతి, న్యాయం అనేవి పరిస్థితులపైన, సాక్ష్యాలపైన ఆధారపడి నిర్ణయించబడేవి) అతడు పాండవులు సంపూర్ణమైన స్వచ్ఛమైన నడవడి గలవారనిగాని, కౌరవులు పరమ దుర్మార్గులని కాని ఎన్నడూ భావించలేదు. కృష్ణుడు మావన జీవితాన్ని దర్శించిన విధానం ఇదే. 
 
(ప్రతివారిలో మంచి చెడు రెండు ఉంటాయి. పరిస్థితులను వారి మనస్థితిని అనుసరించి  ఒకటి బైటపడుతుంది) అతడు కౌరవ పాండవులతో ఒకేవిధంగా బంధుత్వాన్ని  నిర్వహించాడు. దుర్యోధనుని భార్య భానుమతి కృష్ణుని భక్తురాలు. అతడు కౌరవులను కేవలం  దుష్టులుగానే చూడలేదు, కానీ వారి కారణంగా ఆ సమయంలో సంభవిస్తున్న దుర్మార్గాలను మాత్రం అంతం చెయ్యాలని ప్రయత్నించాడు. అంతేతప్ప అతడికి వారిపట్ల ఎటువంటి కోపంగాని, శత్రుత్వం గాని ఉన్నాయని భావించకూడదు. కౌరవులను దుర్మార్గులుగా కృష్ణుడు తీర్పునివ్వలేదు. మానవులందరు మంచిచెడుల కలయిక అనే అతడు గ్రహించాడు.
 
ఈ విధంగానే ధర్మాన్ని మనలో నిలుపుకునే ప్రయత్నం కొనసాగించాలి. ఇలా కాకపోతే మీరు అధర్మవర్తనులు కాగలరు. ఏ మనిషైనా తన జీవితంలో ఏ సందర్భంలోనైనా అధర్మ పరుడయ్యేందుకు సమర్థుడే. ఒక మనిషి ఎప్పటికీ అధర్మమార్గం ఎన్నుకోడని నిశ్చయంగా చెప్పేందుకు వీలుకాదు. కనుకనే మీరెల్లవేళలా జాగ్రత్త వహించాలి, ఎప్పుడూ ధర్మమార్గాన్ని అనుసరించేందుకు  ప్రయత్నం చేస్తూ ఉండాలి, లేదంటే, ఎప్పుడో అతి సులభంగా అధర్మ మార్గంలోనికి జారిపోతారు. మీరు ఏ విధంగాను, ఏ కారణంగాను అధర్మం వైపు లొంగిపోని స్థిర చిత్తుల స్థాయికి చేరుకున్న వారైతే తప్ప ఇది ప్రతివ్యక్తికీ అనుభవమే.
 
కృష్ణుడు అనేక విధాలుగా దుర్యోధనుని ధర్మమార్గం వైపు ప్రోత్సహించాడు, అతడు సైన్యానికి, తనకు మధ్య ఎన్నుకునే అవకాశం కల్పించిన సందర్భంలో కూడా యుద్ధాన్ని నివారించాలనే ప్రయత్నం చేసాడు. సైన్యాన్ని దుర్యోధనునికి పంచటం ఒక విధంగా తెలివైన పని. సైన్యాన్ని పొంది, ఆనందించిన దుర్యోధనుడు, అక్షౌహిణి సైన్యాన్ని తనవెంట పంపుతున్న కృష్ణునికి తనంటేనే ఇష్టమని, అతడు తన పక్షమే వహించాడని పొంగిపోయాడు పైగా పాండవులు మూర్ఖులు, ఒక్క మనిషిని, ఆయుధం పట్టి యుద్ధం చేయనన్న వానిని కోరుకున్నాడని కూడా తలపోసాడు. ఈ సందర్భంలో దుర్యోధనునికి అధర్మమార్గాన్ని శాశ్వతంగా మూసివేయగల అవకాశం కృష్ణుడు కల్పించాడు. కాని, అలా జరగలేదు.

-సద్గురు
అన్నీ చూడండి

తాజా వార్తలు

భూ వివాదం పరిష్కరించమని అడిగితే ప్రైవేట్ గదికి తీసుకెళ్లి మహిళపై అనుచితంగా పోలీసు అధికారి

Madhavi Latha: మాధవి లత వేస్ట్ క్యాండిడేట్.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్

రైలు పట్టాలపై కూర్చొని పబ్ జీ ఆడిన ముగ్గురు మృతి.. ఎక్కడంటే?

చాలా చాలా చిన్న కారణం, తనకు విషెస్ చెప్పలేదని ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థిని

Amaravati: అమరావతి కోసం ప్రపంచ బ్యాంకు, HUDCO సాయం.. ఏపీ సర్కారు

అన్నీ చూడండి

లేటెస్ట్

31-12-2024 మంగళవారం రాశిఫలాలు : రుణ సమస్యలు తొలగిపోతాయి..

Bird Flies Into Your House? ఇంట్లోకి కాకి, పావురం వస్తే మంచిదేనా?

30-12-2024 సోమవారం దినఫలితాలు : పిల్లల దూకుడు అదుపు చేయండి...

డిసెంబరు 29 నుంచి జనవరి 04 వరకు మీ వార ఫలితాలు

Somvati Amavasya 2024 సోమాతి అమావాస్య.. చెట్లను నాటండి.. ఈశాన్య దిక్కులో నేతి దీపం..

తర్వాతి కథనం
Show comments