Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.168.84 కోట్ల ఆదాయంతో శబరిమల అయ్యప్ప స్వామి కొత్త రికార్డు

శబరిమల అయ్యప్ప స్వామి కొత్త రికార్డు సృష్టించారు. భక్తులు అందించే కానుకల విషయంలో పాత రికార్డులను అయ్యప్ప స్వామి ఆలయం బ్రేక్ చేసింది. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 26వరకు ఆలయంలో జరిగిన మండల పూజలతో అయ్యప్ప ఆ

Webdunia
గురువారం, 28 డిశెంబరు 2017 (10:57 IST)
శబరిమల అయ్యప్ప స్వామి కొత్త రికార్డు సృష్టించారు. భక్తులు అందించే కానుకల విషయంలో పాత రికార్డులను అయ్యప్ప స్వామి ఆలయం బ్రేక్ చేసింది. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 26వరకు ఆలయంలో జరిగిన మండల పూజలతో అయ్యప్ప ఆలయానికి మొత్తం రూ.168.84కోట్ల ఆదాయం లభించింది. ఇది ఆల్ టైమ్ రికార్డు అని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డ్ అధికారులు ప్రకటించారు. 
 
అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య ప్రతియేటా పెరుగుతోందని, ఇంకా మకరజ్యోతి ఉత్సవాలు జరుగున్న తరుణంలో భక్తులు అయ్యప్పకు సమర్పించే కానుకల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని దేవస్థానం అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. హుండీ, టిక్కెట్లు, ప్రసాదాల లెక్కల్లో నవంబర్ 15 నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు గత ఏడాది కంటే ఈ ఏడాది.. రూ.20కోట్ల మేర ఆదాయం పెరిగిందని కేరళ దేవస్థానం-పర్యాటక మంత్రి  కొడకంపల్లి సురేందర్ తెలిపారు.
 
మకర జ్యోతి ఉత్సవాల కోసం డిసెంబర్ 30 నుంచి జనవరి 14వరకు ఆలయం తెరిచి వుంటుందని.. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామిని దర్శించుకునే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. పంబా నదీ ప్రాంతంలో, నడకదారిన భక్తుల కోసం కుర్చీలు ఏర్పాటు చేస్తామని.. ఇతరత్రా సౌకర్యాలను కల్పించే దిశగా సమీక్ష నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విజయసాయి, వైవీగారు మీడియాలో అవాస్తవాలు మాట్లాడారు: విజయమ్మ లేఖ

టెక్కీ హత్య కేసు : హంతకుడి ఆచూకీ చెబితే రూ.5.7 కోట్ల రివార్డు

ఫోన్ చేయడానికి డబ్బులు లేవు... అప్పు తీసుకోవచ్చా... అమితాబ్‌కు టాటా వినతి

అతీంద్రియ శక్తులున్నాయని 4వ అంతస్తు నుంచి దూకేసిన బీటెక్ విద్యార్థి, ఏమైంది? (video)

దీపావళి కానుకగా ఇళ్లను బహుమతిగా ఇస్తున్నాం: మంత్రి

అన్నీ చూడండి

లేటెస్ట్

27-10-2024 ఆదివారం దినఫలితాలు - దంపతుల మధ్య అకారణ కలహం...

27-10- 2024 నుంచి 02-11-2024 వరకు ఫలితాలు-ఆర్థికంగా బాగుంటుంది

రామ ఏకాదశి పూజా విధానం.. ఆర్థిక సమస్యల నుండి విముక్తి

26-10-2024 శనివారం దినఫలితాలు - మీ శ్రీమతిని కష్టపెట్టవద్దు...

శనివారం.. ఆవనూనెతో దీపం.. అందులో నువ్వులు వేస్తే..?

తర్వాతి కథనం
Show comments