Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక సోమవారం: దీపాలు వెలిగించి పుణ్యఫలం కావాలని పరమేశ్వరుడిని వేడుకుందాం

Webdunia
ఆదివారం, 28 నవంబరు 2021 (22:31 IST)
ప్రస్తుతం ఏ శివాలయం చూసినా భక్తజనంతో కళకళలాడుతోంది. దీపాల వెలుగుతో శోభిల్లుతోంది. పరమేశ్వరానుగ్రహం పొందడానికి దక్షిణాయన పుణ్యకాలం ఎంతో మంచిది. ఇది ఉపాసనా కాలం. పరమేశ్వరుని ఆరాధనకు యోగ్యమైన కాలం. ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి, శ్రావణ మాసంలో వరలక్ష్మీవ్రతం, ఇలా ప్రఖ్యాత తిథులన్నీ దక్షిణాయనంలోనే ఉన్నాయి. దక్షిణాయనంలో కార్తీకమాసం చాలా విశేషమైంది.

 
కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కూడిన రోజుతో ప్రారంభం అవుతున్నందున దీనికి కార్తీక మాసమని పేరొచ్చింది. కార్తీకంలో ఎటుచూసినా దీపమే కనబడుతుంది. కార్తీక మాసంలో శివాలయంలో, విష్ణాలయంలో, అంబికాలయంలో, మఠప్రాంగణంలో ఇలా నాలుగు చోట్లా దీపాన్ని పెడతారు. ఒక్క కార్తీక మాసంలో పెట్టే దీపానికి మాత్రమే కార్తీక దీపం అని పేరు ఉంది.

 
పూజలో ఒక ప్రారంభంగా దీపం వెలిగిస్తాం. దీనికి ఒక పరమార్థముంది. పరమేశ్వరుడు అయిదు జ్ఞానేంద్రియాలనిచ్చాడు. కళ్లు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. సమస్త సుఖాలు ఈ అయిదింటిపైనే ఆధారపడ్డాయి. బ్రహ్మాండంలో ఉన్న ఏ భోగస్థానమూ సుఖస్థానం కాదు. కార్తీక మాసంలో సూర్యుడు భూమండలానికి దూరంగా వెళతాడు.

 
రాత్రులు బాగా ఎక్కువవుతాయి. పగళ్ళు తక్కువవుతాయి. అందుకే దక్షిణాయనం ఉపాసకులకు ఇష్టమైన కాలం. అందుకే కార్తీక మాసంలో పూజలు భక్తి శ్రద్ధలతో సాగుతాయి. దీపాలు వెలిగించి పుణ్యఫలం కావాలని పరమేశ్వరుడిని వేడుకుంటారు. కార్తీక సోమవారం మరీ ముఖ్యమైనది. అందుకే ఆరోజుల్లో ఆలయాలు కిక్కిరిసిపోతాయి. అంతా భక్తి కార్తీకం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Maharastra exit poll: పవన్ తుఫాన్‌ కాంగ్రెస్ కూటమి ఆశలు గల్లంతు చేశారా?

13 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం.. తండ్రి వెళ్లగా..?

అయ్యప్ప భక్తులకు అండగా నిలిచిన నారా లోకేష్.. పనితీరు భేష్

యూఎస్ వీసా అప్లికేషన్ సెంటర్‌గా మారనున్న రుషికొండ ప్యాలెస్‌?

విషం తాగింది.. ఆపై ఆస్పత్రి భవనం నుంచి దూకేసింది.. ఏమైందంటే?

అన్నీ చూడండి

లేటెస్ట్

17-11-2024 ఆదివారం ఫలితాలు - ఆ రాశివారు అప్రమత్తంగా ఉండాలి...

17-11-2024 నుంచి 23-11-2024 వరకు మీ వార రాశి ఫలితాలు

16-11-2024 శనివారం ఫలితాలు - మనోధైర్యంతో యత్నాలు సాగించండి...

హనుమంతుడి వడమాలకు.. రాహువుకు, శనికి ఏంటి సంబంధం?.. జిలేబి?

15-11-2024 శుక్రవారం ఫలితాలు - ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలేసుకుంటారు...

తర్వాతి కథనం
Show comments