Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక ఆదివారం సైతక లింగాన్ని పూజిస్తే?

కార్తీక మాసం.. ఆదివారం పూట సైతక లింగాన్ని పూజిస్తే సకల సంపదలు, సుఖశాంతులు వెల్లివిరుస్తాయని పురాణాలు చెప్తున్నాయి. కార్తీక ఆదివారం పూట సన్ సితార (సైతక లింగం)ను పూజించినట్లైతే గౌరవమర్యాదలు, అధికారం లభి

Webdunia
శనివారం, 11 నవంబరు 2017 (13:43 IST)
కార్తీక మాసం.. ఆదివారం పూట సైతక లింగాన్ని పూజిస్తే సకల సంపదలు, సుఖశాంతులు వెల్లివిరుస్తాయని పురాణాలు చెప్తున్నాయి. కార్తీక ఆదివారం పూట సన్ సితార (సైతక లింగం)ను పూజించినట్లైతే గౌరవమర్యాదలు, అధికారం లభిస్తుంది. ఆదివారం సూర్యభగవానుడికి ప్రీతికరమైన రోజు. ఆదినారాయణుడు ఆ రోజుకు ఆది దైవం. ఆ రోజున పరమేశ్వరుని పూజించినట్లైతే.. ఆ ఆదిదేవుడి అనుగ్రహం లభిస్తుంది. 
 
సన్ సితార లింగానికి ఆదివారం పూట ఆలయాల్లో గానీ, ఇంట కానీ ఏకాదశారుద్రాభిషేకం చేయించడం ద్వారా పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే త్రిదళాలు, మారేడు దళాలతో ఆ లింగాన్ని అర్చించినట్లైతే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అలాగే తెల్లజిల్లేడు పువ్వులతో ఓం నమశ్శివాయ అంటూ అర్చిస్తే.. పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. అలాగే జిల్లేడు పువ్వులతో మాలతో సన్ సితార లింగానికి ఆదివారం అలంకరించినట్లైతే సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. 
 
అలాగే తెల్లజిల్లేడు పువ్వులు సూర్యనారాయణునికి, శివునికి, గణపతికి, శివ అంశంతో జన్మించిన ఆంజనేయునికి ప్రీతికరం. రవిగ్రహ ప్రభావం సరిగ్గా లేనప్పుడు.. రవి గ్రహ బలం కోసం జిల్లేడు పువ్వులతో సూర్యగ్రహానికి అర్చన చేస్తే దోష ప్రభావం తగ్గుతుంది. గౌరవం, అధికారం వంటి అనేక రకాల శుభఫలితాలు చేకూరుతాయి. అలాగే ఆదివారం పూట సన్ సితార లింగాన్ని సంపాదించి పూజలు చేస్తే చక్కని ఫలితాలను పొందవచ్చునని పండితులు చెప్తున్నారు.

బిల్లులు చెల్లించని జగన్ సర్కారు.. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత!!?

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

18-05-202 శనివారం దినఫలాలు - దంపతుల మధ్య పరస్పర అవగాహన సంతృప్తి...

17-05-2024 శుక్రవారం దినఫలాలు - అభివృద్ధికై చేయు ప్రయత్నాలు నెమ్మదిగా...

రాగి ఆభరణాలు ధరిస్తే.. సూర్య గ్రహ, వాస్తు దోషాలు పరార్

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

తర్వాతి కథనం
Show comments