Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి కపిలతీర్థంలో 16 తీర్థాలు..... వాటిలో స్నానమాచరిస్తే కలిగే పుణ్యఫలాలేంటి?

ఆపదమొక్కుల వాడు తిరుమల వెంకన్న నెలవై ఉన్న తిరుమలకు వెళ్లే దారిలో ఉన్న తీర్థాలు కూడా ఎంతో ప్రాముఖ్యమైనవే. అందులో కపిలతీర్థం ఒకటి. శేషాచలం కొండలను ఆనుకుని ఉన్న కపిలతీర్థంలో 16 తీర్థాలున్నాయని పురాణాలు చ

Webdunia
గురువారం, 16 జూన్ 2016 (14:25 IST)
ఆపదమొక్కుల వాడు తిరుమల వెంకన్న నెలవై ఉన్న తిరుమలకు వెళ్లే దారిలో ఉన్న తీర్థాలు కూడా ఎంతో ప్రాముఖ్యమైనవే. అందులో కపిలతీర్థం ఒకటి. శేషాచలం కొండలను ఆనుకుని ఉన్న కపిలతీర్థంలో 16 తీర్థాలున్నాయని పురాణాలు చెబుతున్నాయి. తిరుమల గిరులలో పడే వర్షపు నీరు నేరుగా కపిలతీర్థంలోకి జాలు వారుతుంది. వర్షాకాల సమయంలో కపిలతీర్థం అందాలు మాటల్లో చెప్పలేం. తిరుపతి కపిలతీర్థం ప్రాముఖ్యతపై ప్రత్యేక కథనం. 
 
కపిలతీర్థం గురించి....
పూర్వం భగీరథ చక్రవర్తి ప్రయత్నం వల్ల పాతాళలోకం చేరుకున్న పవిత్ర గంగానది భోగవతి అని ప్రసిద్ధిమైన పేరును సంపాందించుకుంది. ఆ పాతాళ లోకంలో భోగావతిగా పేరు పొందిన ఆ గంగానది ఒడ్డున ఒకప్పుడు కపిలుడు అనే మహర్షి ఆశ్రమాన్ని ఏర్పరచుకుని అందులో ఒక శివలింగాన్ని కూడా ప్రతిష్టించుకుని పూజిస్తుండేవాడు.
 
కపిలుడు పూజిస్తున్న ఆ మహాశివలింగం వింతవింత కాంతులతో ప్రకాశిస్తూ ఉండటమే గాక ఆ శివలింగం రోజు రోజుకు అద్భుతావహంగా ఊర్థ్య ముఖంగా పెరుగుతూ భూమిని కూడా చీల్చుకుని చివరకు వేంకటాచల క్షేత్ర మూలంలో స్వయంభువుగా వెలసింది. ఇంకా ఇంకా పెరుగుతున్న అద్భుతమైన ఆ శివలింగాన్ని ఇక మీదట పెరగకుండా చేయాలని సంకల్పించిన మహావిష్ణువు గోపాలుడుగా మారి రక్షిస్తుండగా, బ్రహ్మదేవుడు కపిల ధేనువుగా మారి ఆ శివలింగం మీద అనంతమైన క్షీరధారలను కురిపించి అభిషేకం చేస్తూ ఇరువురూ అనేక విధాల ప్రార్థించారు. 
 
పాతాళ లోకం నుంచి విపరీతంగా పెరుగుతూ ఉన్న ఆ మహాశివలింగం వేంకటాద్రి పర్వత మూలంలో ఏర్పడిన గుహలో స్వయంభువుగా నిలిచింది. పాతాళలోకం నుంచి భూమిని పెకిళించుకుని వచ్చిన ఆ శివలింగంతో పాటు పక్కనే ఉన్న భోగవతి గంగ కూడా పెల్లుబికింది. స్వయంభువుగా ఆవిర్భవించిన ఆ పాతాళ శివలింగాన్ని అక్కడే ఉద్భవించిన భోగవతీ తీర్థ జలాలతో దేవతలందరూ అభిషేకాలు చేసి పూజలు నిర్వహించారు.
 
ఈ శివలింగాన్ని మొదట్లో పాతాళంలో కపిల మహర్షి పూజించినందువల్ల ఈ శివుడికి కపిలేశ్వరుడు అని కపిలేశ్వర మహాశివలింగం అని ప్రసిద్ధిమైన పేర్లు ఏర్పడ్డాయి. అలాగే ఈ కపిలేశ్వరుని సన్నిధిలో పెల్లుబికిన భోగవతి గంగ కపిలతీర్థం అనే పేరుతో పరమ పావన తీర్థ రాజ్యంగా ప్రసిద్ధికెక్కి తనలో స్నానం చేసిన వారి పాపాలను పోగొడుతోంది. ఆ కపిలతీర్థంలో వెలసిన శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వరస్వామివారు భక్తుల పాలిట ఆర్త రక్షకుడై సమస్త దోషాలను పరిహారం చేస్తూ సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తున్నాడు. అంతేకాదు పూర్వం ఒకప్పుడు దుర్వాసన మహర్షి బ్రహ్మదేవునికి ఈ కపిలేశ్వర మహాశివలింగాన్ని చూపిస్తూ ఇలా వివరించాడని పరమేశ్వరుడు పార్వతిదేవికి ఆ వృత్తాంతాన్ని తెలిపాడు. 
 
ఆ మహాశివలింగం మూలంలో రజత వర్షం కలిగి తెల్లగాను, మధ్యభాగంలో సువర్ణ కాంతులతో బంగారు వలె పసుపు రంగులోను, అగ్రభాగాన తామ్రం వలె ఎర్రని రంగతోను ప్రకాశిస్తుంటుంది. కృతయుగంలో ఈ శివలింగాన్ని కపిల మహర్షి పూజించినందువల్ల మహా కపిల శివలింగంగా పిలువబడింది. త్రేతాయుగంలో ఈ లింగం అగ్నిదేవునిచే ఆరాధింపబడి నందువల్ల ఆగ్నేయ లింగం అనే పేరుంది. అలాగే ఆద్యంతాలు లేని ఈ మహాలింగాన్ని ద్వాపరయుగంలో సుదర్శన చక్ర భగవానుడు అర్పించాడు. కలియుగంలో ఈ శివలింగాన్ని కపిలధేనువు తన క్షీరధారలచే అభిషేకించింది. ఇంతటి ప్రాశస్త్యం కపిలతీర్థం.
 
ఇలాంటి కపిలతీర్థంలో నమ్మశక్యంగాని 16 తీర్థాలున్నాయని పురాణాలు చెబుతున్నాయి. శక్రతీర్థం, విష్వక్సేన తీర్థం, పంచాయుధ తీర్థాలు, అనల తీర్థం, బ్రహ్మతీర్థం, సప్తర్షి తీర్థం, పాండవ తీర్థాలున్నాయి. ఒక్కో తీర్థానికి ఒక్కో చరిత్ర ఉంది. 
 
శక్రతీర్థం కపిలతీర్థం పైభాగాన ఉంది. శక్రుడు అనగా ఇంద్రుడు గౌతమమర్షి భార్య అయిన అహల్యతో సంగమించిన దోషాన్ని ఈ తీర్థంలో స్నానం చేసి పోగొట్టుకున్నాడు. అందువల్లే ఈ తీర్థానికి శక్రతీర్థం అనే పేరు వచ్చింది.
 
విష్వక్సేన తీర్థం... ఈ తీర్థం పక్కనే వరుణ దేవుడి పుత్రుడైన విష్వక్సేనుడు తపస్సు చేశాడు. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై శంఖ చక్రాయుధాలను అనుగ్రహించి విష్వక్సేనుణ్ణి తన సేనాధిపతిగా నియమించుకున్నాడు. అందువల్లో దీన్ని విష్వక్సేన తీర్థం అంటారు. 
 
పంచాయుధ తీర్థాలు.. విష్వక్సేన పైభాగంలో వేంకటాచల పర్వత సానువుల్లో ఉన్నాయి. శ్రీనివాసుని పంచాయుధాలైన శంఖం, చక్రం, గద, ఖడ్గం, ధనస్సు. వేర్వేరు స్థలాల్లో శ్రీ మహావిష్ణువును గురించి తపస్సు చేశాయట. శ్రీహరి ప్రత్యక్షమై వాటిని అనుగ్రహించిన దివ్య స్థలాలే ఆ పంచాయుధ తీర్థాలు. అవే చక్రతీర్థం, శంఖ తీర్థం, గదా తీర్థం, నందక తీర్థం, ధనుస్తీర్థాలు. ఈ పంచాయుథ తీర్థాల్లో స్నానం చేసిన వారికి పాపాలు, శత్రు భయం తొలుగుతుందని శ్రీనివాసుడే వరమిచ్చాడు.
 
అనల తీర్థం....పూర్వం అగ్నిదేవుడు ఈ తీర్థంలో స్నానమాడి తనకు వచ్చిన కడుపునొప్పిని పోగొట్టుకున్నాడు. అందువల్లే ఇది అనల తీర్థం అని, అగ్ని తీర్థం అని ప్రసిద్ధి చెందింది. ఇది పంచాయుధ తీర్థాలకు పైభాగంలో ఉంది. 
 
బ్రహ్మతీర్థం... అగ్ని తీర్థంపైన బ్రహ్మతీర్థం ఉంది. ఈ ప్రాంతంలో బ్రహ్మదేవుడు శ్రీహరిని గురించి తపస్సు చేసి సృష్టి కార్యక్రమం సులువుగా కొనసాగుతున్నట్లుగా వరాన్ని పొందాడట. ఇక్కడ బ్రహ్మ హత్యాది దోషాలు తొలగిపోతాయని ప్రసిద్ధి. 
 
సప్తర్షి తీర్థాలు... బ్రహ్మ తీర్థానికి పైభాగాన సప్త ఋషులు వెలయింప చేసిన ఏడు పుణ్యతీర్థాలు ఉన్నాయి. ఇవి అత్యంత మహిమ గలిగిన తీర్థాలుగా పేరు పొందాయి. 
 
ఇలా చెప్పుకుంటే పోతే తీర్థాల మహిమలు అంతా ఇంతా కాదు. ఇవన్నీ కలిసి ఉన్న కపిలతీర్థంలో పుణ్యస్నానమాచరిస్తే ప్రపంచంలోని తీర్థాలన్నింటిలోనూ స్నానం చేసిన దానితో సమానమని పురాణాలు చెబుతున్నాయి. అందుకే తిరుమలకు వచ్చే భక్తులందరు ముందుగా తిరుపతిలోని కపిలతీర్థంలో స్నానాలు చేసి తడిబట్టలతో కపిలేశ్వరుడిని కొలుస్తుంటారు. శ్రీవారు కొలువై ఉన్న గిరుల నుంచి జాలు వారే నీరు మొత్తం కపిలతీర్థంలోకి వస్తుంటుంది. అలా 16 తీర్థాల నీటితో పాటు తిరుమల గిరుల నుంచి వస్తున్న నీటితో స్నానమాచరిస్తే ఆ పుణ్యం జన్మజన్మలా ఉంటుందని స్వయంగా శ్రీనివాసుడే చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. అయితే మనం కూడా కపిలతీర్థంలో పుణ్యస్నానం చేస్తారా... గోవిందా.. గోవిందా...

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

తర్వాతి కథనం
Show comments