Webdunia - Bharat's app for daily news and videos

Install App

మౌని అమావాస్య నేడే... ఇలా చేయండి

మాఘ మాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారు. ఈ అమావాస్య మంగళవారం నాడు వస్తుంది. ఈ అమావాస్య రోజున మౌనవ్రతం పాటిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. రోజంతా మౌనంగా వుండకపోయినా.. సూర్యోదయం తర్వాత మౌన అ

Webdunia
మంగళవారం, 16 జనవరి 2018 (12:51 IST)
మాఘ మాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారు. ఈ అమావాస్య మంగళవారం నాడు వస్తుంది. ఈ అమావాస్య రోజున మౌనవ్రతం పాటిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. రోజంతా మౌనంగా వుండకపోయినా.. సూర్యోదయం తర్వాత మౌన అమావాస్య కోసం కాసేపు అలా మాట్లాడకుండా వుండటం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ అమావాస్య పాప గ్రహాల శాంతి కోసం వస్తుంది. 
 
ఈ రోజున రోజంతా మౌనవ్రతం చేయలేని వారు తెల్లని కాగితం తీసుకుని.. దానిపై తులసీ లేదా పసుపు కొమ్మతో మీ కోరికను రాయండి. దానిని మీ అరచేతుల్లో పెట్టుకుని.. దానినే కళ్లార్పకుండా చూడండి. ఎంతసేపు చూడగలిగితే అప్పటిదాకా చూడాలి. 
 
కళ్లార్పే సమయం వచ్చినప్పుడు ఓ ప్రకృతి మాతా.. నా ఈ కోరిక తీర్చు అని కోరాలి. మౌనంగా వుండి ఇలా కోరి.. ఆ కాగితంపై వూది మడిచేసి.. పూజా మందిరంలో ఏ దేవుని పటం వెనుకనైనా వుంచాలి. అంతే మీ కోరిక నెరవేరుతుందని పండితులు చెప్తున్నారు. తప్పకుండా అద్భుతం జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
 
మరోవైపు మౌని అమావాస్య సందర్భంగా అహ్మదాబాద్‌లో ప్రజలు పుణ్యస్నానాలు చేశారు. తెల్లవారుజామునే నదీ తీరానికి చేరుకున్న ప్రజలు.. పుణ్యస్నానాలు చేశారు. మాఘమాసంలో వచ్చే అమావాస్యకు చాలా ప్రత్యేకత ఉంటుంది. ఈ రోజు గంగాస్నానం, మౌనవ్రతంలో ఉండటంతోపాటు.. ఈ రోజు ధానధర్మాలు చేస్తే చాలా ఫలితం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బండరాళ్లు మీదపడి ఆరుగురు కూలీలు దుర్మరణం - సీఎం బాబు దిగ్భ్రాంతి

లిక్కర్ స్కామ్ : వెలుగు చూస్తున్న నోట్ల కట్టల వీడియోలు

ప్రియురాలితో భార్య చేతికి చిక్కిన భర్త ... ఎక్కడ?

బీమా సొమ్ము కోసం కన్నతండ్రినే కారుతో ఢీకొట్టించిన కుమారుడు...

నైట్ రైడర్స్ బార్‌ను ధ్వంసం చేసిన రాజ్ థాక్రే అనుచరులు

అన్నీ చూడండి

లేటెస్ట్

01-08-2025 శుక్రవారం దినఫలితాలు - ఊహించని ఖర్చులు చికాకుపరుస్తాయి....

సముద్రపు తెల్ల గవ్వలు ఇంట్లో పెట్టుకోవచ్చా?

Sravana Masam Fridays 2025: శ్రావణ శుక్రవారం-అష్టమి తిథి-లక్ష్మీదేవితో పాటు దుర్గకు పూజ చేస్తే?

01-08-2025 నుంచి 31-08-2025 వరకు మీ మాస ఫలితాలు

TTD: తిరుమల ఆలయ ప్రాంగణంలో రీల్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: టీటీడీ

తర్వాతి కథనం
Show comments