Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య సాయంత్రం ఇలా చేస్తే దేవుడు కూడా కాపాడలేడట...

మనం చేసే పనే మనలో ఆర్థిక కష్టాలను తెచ్చిపెడుతుందట. ఇంట్లో ఆడవారు చేసే పనులో కష్టాలను తెచ్చిపెడతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇంట్లో భార్య కొన్ని చేయకూడని పనులు చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో రావడానికి నిరాకరిస్తుంది. సాయంత్రంలో ఇంటిలోని పక్కింటి వారు పా

Webdunia
మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (16:35 IST)
మనం చేసే పనే మనలో ఆర్థిక కష్టాలను తెచ్చిపెడుతుందట. ఇంట్లో ఆడవారు చేసే పనులో కష్టాలను తెచ్చిపెడతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇంట్లో భార్య కొన్ని చేయకూడని పనులు చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో రావడానికి నిరాకరిస్తుంది. సాయంత్రంలో ఇంటిలోని పక్కింటి వారు పాలు, పెరుగు అడిగితే ఇస్తూ ఉంటారు. పాలు లక్ష్మీదేవితో సమానం... అలాంటి పాలు.. పెరుగును వేరే వారికి ఇస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని బయటకు పంపినట్లే. ఇలా చేసేవారి ఇంట ఎట్టి పరిస్థితుల్లోను లక్ష్మీదేవి ఉండదు. వెంటనే అలిగి వెళ్ళిపోతుందట.
 
వంటింట్లో ఆహారాన్ని వండుతారు. అంటే వంటింట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి సాయంత్రం నిద్రపోయే ముందు వంటపాత్రలు, వంటగది, స్టౌను ఖచ్చితంగా శుభ్రం చేయాలి. అలా చేసిన తరువాతే నిద్రపోవాలి. ఇలా చేయకుంటే లక్ష్మీదేవి అలుగుతుంది. అలాగే ఇంట్లో మహిళలు జుట్టును విరబోసుకుని నిద్రపోతారు. సౌకర్యంగా ఉంటుందని. కానీ ఇలా అస్సలు చేయకూడదు. జుట్టు విరబోసుకుని పడుకోవడం మనషులు చేసే పనికాదు రాక్షసులు చేసే పని.
 
రాక్షస కృత్యాలు చేసే వారి ఇంట లక్ష్మీదేవి ఎక్కువకాలం నిలవదు. ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అందుకే ఉప్పును రాత్రి వేళల్లో చిన్న పొట్లాలుగా కట్టి అన్ని గదుల్లోను ఉంచాలి. తెల్లవారిన తరువాత ఇంట్లో గృహిణి ఎవరితోను మాట్లాడకుండా ఉప్పును తీసి పారెయ్యాలి. ఇలా చేస్తే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోయి లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. 
 
అలాగే చీపురును దక్షిణ దిక్కున మాత్రమే పెట్టాలి. వేరే ఏ దిక్కున ఉండకూడదు. అలా ఉంచితే ధనలక్ష్మి మీ ఇంటికి వస్తుంది. నిద్రపోయేటప్పుడు కొంతమంది తల దగ్గర నీటిని పెట్టుకుంటారు. నిద్ర లేచి తాగుదామని.. కానీ అలా చేయకూడదు. నీళ్ళ దప్పిక వస్తే పైకి లేచి వెళ్ళి తాగాలి. ఇలా చేస్తే ధనప్రాప్తి ఖచ్చితంగా లభిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రకృతిలో అమరావతిగా ఏపీ రాజధాని మోడల్ గ్రీన్ సిటీగా మార్చాలి: చంద్రబాబు

24 క్యారెట్ల బంగారం- ఆపరేషన్ సింధూర్.. అగ్గిపెట్టెలో సరిపోయేలా శాలువా.. మోదీకి గిఫ్ట్

దేవెగౌడ ఫ్యామిలీకి షాక్ : అత్యాచార కేసులో దోషిగా తేలిన రేవణ్ణ

ఆ పిల్లవాడు నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేసాడా?

IMD: ఆగస్టు 1 నుంచి 7 వరకు ఏడు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు

అన్నీ చూడండి

లేటెస్ట్

Bangles: శ్రావణమాసంలో గోరింటాకు, గాజులు ధరిస్తే?

TTD: శ్రీవాణి దర్శనం టిక్కెట్లు.. దర్శనం సమయం సాయంత్రం 5 గంటలకు మార్పు

Soul Photo: పితృదేవతల పటాలు ఇంట్లో వుంచవచ్చా? వుంచితే ఏంటి ఫలితం?

31-07-2025 గురువారం ఫలితాలు - పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం....

Thursday Fast: గురువారం బృహస్పతిని పూజిస్తే ఏంటి ఫలితం?

తర్వాతి కథనం
Show comments