Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజు ఇంటి ముందు దీపం పెట్టేముందు ఇలా చేయాలి...!

దీపం తేజస్ తత్వానికి ప్రతీక. రోజు రెండు సార్లు, ఉదయం సూర్యోదయానికి ముందు సంధ్యాకాలంలో, సాయంత్రం సూర్యాస్తమయం సంధ్యాకాలంలో తప్పకుండా దీపారాధన చేయాలి. దీపప్రజ్వలన అనకుండా దీపారాధన అనడంలోనే ఒక ప్రత్యేకత

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2017 (13:11 IST)
దీపం తేజస్ తత్వానికి ప్రతీక. రోజు రెండు సార్లు, ఉదయం సూర్యోదయానికి ముందు సంధ్యాకాలంలో, సాయంత్రం సూర్యాస్తమయం సంధ్యాకాలంలో తప్పకుండా దీపారాధన చేయాలి. దీపప్రజ్వలన అనకుండా దీపారాధన అనడంలోనే ఒక ప్రత్యేకత ఉంది. దీపాన్ని వెలిగించండని చెప్పలేదు, దీపాన్నీ పూజించండి అన్నారు పెద్దలు. ఎందుకంటే దీపం పరబ్రహ్మస్వరూపం, ఆత్మస్వరూపం. మనలోనూ నిత్యం ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది కనుకనే మనం జీవించి ఉన్నాం. దీపంలోనే దేవతలందరూ ఉంటారు. 
 
దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవీశక్తులతో నిండిపోతుంది. దీపం పెడితే చాలు దేవతలు వస్తారు. అటువంటి దీపారాధనకు ప్రత్యేక నియమాలు ఏమీలేవు. ఉదయం స్నానం చేసిన తర్వాత వెలిగించినట్టే, సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించాలి. సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం ముఖమూ, కాళ్ళూ, చేతులు, నోరు కడుక్కుని దీపారాధన చేయాలి. మాంసాహారం తినేవారు కూడా ప్రతిసారీ తలంటుస్నానం చేయనవసరంలేదు. మామూలు స్నానం సరిపోతుంది. ఇక దీపం వెలిగించి ప్రమిద బంగారం కానీ, వెండిది కానీ, ఇత్తడిది, మట్టిదైనా అయి ఉండాలి. స్టీలు, ఇనుప ప్రమిదలో ఎప్పుడు దీపం వెలిగించకూడదు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యత ఇవ్వాలి: కొండా సురేఖ

కుమార్తె వచ్చాకే డాక్టర్ మన్మోహన్ అంత్యక్రియలు...

కుమార్తెకు అత్తింటి వేధింపులు... చూడలేక తండ్రి ఆత్మహత్య

పార్శిల్ మృతదేహం మిస్టరీ : నిందితురాలిగా పదేళ్ల కుమార్తె!

అన్నీ చూడండి

లేటెస్ట్

24-12-2024 మంగళవారం దినఫలితాలు : ఆప్తుల సలహా పాటిస్తారు...

23-12-2024 సోమవారం దినఫలితాలు-పొగిడే వ్యక్తులతో జాగ్రత్త

22-12-2024 ఆదివారం దినఫలితాలు - రుణ సమస్యలు తొలగిపోతాయి..

Weekly Horoscope: 22-12-2024 నుంచి 28-12-2024 వరకు ఫలితాలు- మీ మాటలు చేరవేసే వ్యక్తులు?

21-12-2024 శనివారం దినఫలితాలు : ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి...

తర్వాతి కథనం
Show comments