Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్రౌపది ఐదుగురు భర్తలను ఎందుకు వివాహమాడింది?

Webdunia
మంగళవారం, 9 జులై 2019 (21:45 IST)
ద్రౌపది క్రితం జన్మలో మేధావి అనే బ్రాహ్మణుడి కుమార్తె. ఆమె చిన్నతనంలోనే తల్లి చనిపోవడం చేత తండ్రి ఆమెను పెంచాడు. కానీ ఆమె తండ్రి యుక్త వయస్కురాలైన ఆమెకు పెళ్లి చేయాలని ఆలోచించేవాడు కాదు. కొద్ది కాలం తరువాత ఆమె తండ్రి కూడా మరణించాడు. తండ్రి మరణం ఆమెకు మరింత దుఃఖం కలిగించింది. 
 
అప్పుడు దుర్వాస మహర్షి ఆమె ఆశ్రమానికి వచ్చాడు. ఆయనకు ప్రణామాలర్పించి, పూజించి, పూలు, పండ్లు సమర్పించింది. మహర్షి ఆమె యొక్క అతిధి మర్యాదలకు సంతోషించాడు. అప్పుడు ఆమె మహర్షి.... మీకు సర్వమూ తెలుసుకదా... నాకు ప్రపంచంలో ఎవరూ లేరు. నేను అవివాహితను కాబట్టి రక్షించడానికి భర్త లేడు.
 
కాబట్టి నా సమస్యలకు పరిష్కారమేమిటో తెల్పండి అని ప్రార్దించింది. అది విన్న మహర్షి పురుషోత్తమ మాసం శ్రీకృష్ణునికి ప్రీతికరమైనది. ఈ మాసంలో పవిత్ర నదీ స్నానం చేస్తే పాపం పోతుంది. కాబట్టి ఈ పురుషోత్తమ మాసాన్ని పాటించు అన్నాడు.
 
అది విని ఆ యువతి ఓ.. మహర్షి మీరు అబద్దమాడుతున్నారు. ఏ విధంగానూ ఈ అధికమాసం పుణ్యకార్యాలకు పనికి రాదు అన్నది. ఆ విధంగా అన్న బ్రాహ్మణ యువతిపై ఆ దుర్వాస మహర్షికి కోపమొచ్చి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఎప్పుడైతే ఆ మహర్షి ఆ స్థలాన్ని వదిలి వెళ్లిపోయాడో ఆ  బ్రాహ్మణ యువతి వైభవం అంతా ఆ క్షణంలోనే కోల్పోయింది. పురుషోత్తమ మాసం పట్ల అపరాధం చేసినందు వల్ల ఆమె శరీరం కురూప్గా తయారయ్యింది. అప్పుడు ఆమె భక్తితో పరమశివుణ్ణి ప్రార్దించింది.
 
అప్పుడు శంకరుడు ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ యువతి... ఓ పరమేశ్వరా.... నాకు భర్తను ప్రసాదించు అని ఐదు సార్లు అడిగింది. అప్పుడు పరమ శివుడు అలాగే కానీ..... నీవు భర్త కావాలని ఐదు మార్లు అడిగావు. కావున నీకు ఐదుగురు భర్తలు లభిస్తారు..... అన్నాడు.
 
ఆ తరువాత కాలంలో ద్రుపదమహారాజు గొప్ప యజ్ఞం చేస్తుండగా ఆ బ్రాహ్మణ యువతి యజ్ఞ కుండంలో ద్రుపదుడి కుమార్తెగా ఆవిర్బవించి ద్రౌపదిగా ప్రసిద్ది చెంది పంచ పాండవులను వివాహమాడి పాంచాలి అయ్యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టేస్ట్ అట్లాస్‌లో భాగ్యనగరికి చోటు

Odisha Boy: రీల్స్ కోసం రైలు వస్తుంటే రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు.. వీడియో వైరల్

కుటుంబ తగాదాలే చిన్నారి హితీక్ష దారుణ హత్య

బ్రిక్స్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోడీ : ఎందుకు?

Jyoti Malhotra: కేరళ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్న జ్యోతి మల్హోత్రా.. వీడియో వైరల్

అన్నీ చూడండి

లేటెస్ట్

05-07-2025 శనివారం దినఫలితాలు - ప్రముఖుల సందర్శనం వీలుపడదు...

04-07-2025 శుక్రవారం దినఫలితాలు : జూదాలు, బెట్టింగులకు జోలికి పోవద్దు

TTD Cultural Scam: టీటీడీ, హెచ్డీపీపీ పేరిట కళాకారులకు టోపీ: రూ. 35లక్షల మోసం.. వ్యక్తి అరెస్ట్

03-07-2025 గురువారం దినఫలితాలు - పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం...

Mustard Oil Lamp: ఆదివారం పూట ఈ దీపాన్ని వెలిగిస్తే.. వాస్తు దోషాలు పరార్

తర్వాతి కథనం
Show comments