Webdunia - Bharat's app for daily news and videos

Install App

తథాస్తు దేవతలంటే ఎవరు..?

ఇప్పటికీ చాలామంది పెద్దలు తథాస్తు దేవతలుంటారు జాగ్రత్త అని మనల్ని హెచ్చరిస్తుంటారు. అసలు తథాస్తు దేవతులెవరు.

Webdunia
మంగళవారం, 9 మే 2017 (13:59 IST)
ఇప్పటికీ చాలామంది పెద్దలు తథాస్తు దేవతలుంటారు జాగ్రత్త అని మనల్ని హెచ్చరిస్తుంటారు. అసలు తథాస్తు దేవతులెవరు. 
 
తథాస్తు దేవతలు సాయం సంధ్యవేళల్లో సంచరిస్తుంటారని ప్రతీతి. చెడుమాటలు లేదా చెడు ఆలోచనలను తరచూ పునరుక్తం చేస్తూంటే ఆ మాటే జరిగిపోతుందట. ఈ తథాస్తు అనేది స్వవిషయంలోనే వర్తిస్తుంది. మనిషి తన ధర్మానికి విరుద్ధంగా అనకూడని మాట పదేపదే అనుకుంటూ ఉంటే దేవతలు వెంటనే తథాస్తు అంటూ ఉంటారు. వీరినే తథాస్తు దేవతలు అంటారు.
 
ఆలాంటి సమయాలలో స్వసంబంధమైన విషయాలను పలుమార్లు అంటే ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు తథాస్తు అంటూ ఉంటారు. ధనం ఉండి కూడా తరచూ డబ్బు లేదులేదు అని పలుమార్లు నటిస్తూ ఉంటే నిజంగా లేకుండానే పోతుంది. ఆరోగ్యం బాగుండి కూడా అనారోగ్యంతో ఉన్నామని తరచూ అంటూ ఉంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది. అందువలన తనకున్న స్థితిగతుల గురించి అసత్యాలు, చెడుమాటలు పలుకుట మంచిది కాదు.
 
ముఖ్యంగా ఇక్కడ మనం ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి. చాలా సందర్భాల్లో మనం వైద్యుల దగ్గరికి వెళుతుంటాం. ఫలానా వైద్యుడి హస్తవాసి బాగుంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి అందరు వైద్యులూ చదువుకున్నది ఒకే శాస్త్రం. వైద్యుడు హస్తవాసి అంటుంటారు.. ఈ హస్తవాసి బాగుంటుందనే వైద్యుడు తన వద్దకు వచ్చే రోగులకు స్వస్థత చేకూరాలని పదే పదే అనుకుంటూ ఉండటం, తథాస్తు దేవతలు ఆశీర్వదించడం జరుగుతుంటూంది. దాని ప్రకారమే అతని వద్దకు వచ్చే రోగులకు రోగాలు నయం కావడం, తద్వారా మంచి పేరు రావడం వంటివి చోటు చేసుకుంటుంటాయి.
 
ఇదే విషయం చెడుకూ వర్తిస్తుంది. ఒకరికి చెడు జరగాలని అనుకోవడం లేదా మనకు చెడు జరుగుతుందేమోనని భయపడటం వల్ల తథాస్తు దేవతల ప్రభావంతో అవి ఫలించడం జరుగుతుంది. తద్వారా మరికొన్ని దుష్పలితాలు చోటుచేసుకోవడంతో ఇక్కట్లు పెరుగుతుంటాయి. అందుకే మంచినే తల్చుకుంటే మనందరికీ మంచివే జరుగుతాయి. 

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

09-05-2024 గురువారం దినఫలాలు - విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి...

అక్షయ తృతీయ 2024.. తులసి మొక్కను ఇంట్లో నాటిపెడితే?

08-05-202 బుధవారం దినఫలాలు - మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది...

07-05-202 మంగళవారం దినఫలాలు - దైవకార్యాలపై ఆసక్తి నెలకొంటుంది...

ఆ దిశల్లో బల్లి అరుపు వినిపిస్తే.. ఇక డబ్బే డబ్బు..!

తర్వాతి కథనం
Show comments