హనుమంతుడు అక్కడే వుంటాడు

జయ
గురువారం, 4 జూన్ 2026 (22:52 IST)
యత్ర యత్ర రఘునాథ కీర్తనం - తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్. అంటే, ఎక్కడెక్కడ రామ నామ సంకీర్తనం జరుగుతుందో, అక్కడ హనుమంతుడు రెండు చేతులు జోడించి, ఆనంద బాష్పాలతో మైమరిచి కూర్చుని ఉంటాడట. అందుకే ప్రతి రామ భక్తుడి హృదయంలో ఆంజనేయుడు కొలువై ఉంటాడు. 
 
శ్రీరాముడు వైకుంఠానికి వెళ్లే సమయంలో హనుమంతుడిని భూమిపైనే ఉండి ధర్మాన్ని రక్షించమని కోరాడు. అప్పటి నుండి హనుమయ్య హిమాలయాలలోని గంధమాదన పర్వతంపై తపస్సు చేసుకుంటూ నివసిస్తున్నాడని భక్తుల విశ్వాసం. ఇప్పటికీ కొందరు యోగులకు అక్కడ ఆయన దర్శనం కలుగుతుందని చెబుతుంటారు.
 
ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు, హనుమంతుడు అర్జునుడి రథంపై ఉన్న జెండా మీద నివసించాడు. అందుకే ఆ రథాన్ని 'కపిధ్వజం' అంటారు. యుద్ధం మొత్తం పాండవులకు రక్షణ కవచంలా ఉండి విజయంలో కీలక పాత్ర పోషించాడు. రావణ సంహారం తర్వాత విభీషణుడు లంకకు రాజయ్యాడు. పరమ రామ భక్తుడైన విభీషణుడికి తోడుగా ఉంటూ, రామకథను ప్రచారం చేస్తూ కొంతకాలం లంకలో కూడా హనుమంతుడు నివసించారని పురాణాలు చెబుతున్నాయి.
 
ఎక్కడైతే భయం ఉండదో, ఎక్కడైతే నిజాయితీ, నిస్వార్థ సేవ ఉంటాయో అక్కడ హనుమంతుడు ఉంటాడు. మనం "హనుమాన్ చాలీసా" పఠించినప్పుడు మనలో కలిగే ఆ అపారమైన ఆత్మవిశ్వాసమే హనుమంతుడి ఉనికికి నిదర్శనం. ఒక్క మాటలో చెప్పాలంటే.. రాముడు లేని చోట హనుమంతుడు ఉండడు.. హనుమంతుడు లేని చోట విజయం ఉండదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన - పలు జిల్లాలకు హెచ్చరిక

గెలిచినా ఓడినా నేర్చుకోవడం ఆపొద్దు : రష్మిక మందన్నా

రాజ్యసభలో మూడింట రెండొంతుల మెజారిటీకి చేరువలో ఎన్డీయే

విడాకుల కోసం ఐదేళ్ల పోరాటం చేశారు.. హగ్ చేసుకుని ఐదు నిమిషాల్లో కలిసిపోయారు... (వీడియో)

భారత డీఎన్‌ఏలోనే ఇన్నోవేషన్‌ ఉంది: ప్రధాని మోదీ

అన్నీ చూడండి

లేటెస్ట్

సాయిబాబా తన భక్తులు దైనందిన జీవితంలో పాటించాలని బోధించిన 4 ముఖ్య సూత్రాలు ఏవి?

14-06-2016 ఆదివారం ఫలితాలు-పొగిడే వ్యక్తులతో జాగ్రత్త..

14-06-2026 నుంచి 20-06-2026 వరకు వార ఫలితాలు

సెప్టెంబరు నెల శ్రీవారి దర్శన కోటా టిక్కెట్లు - 18న ఆన్‌లైన్‌లో విడుదల

Lord venkateswra : సర్వేశ్వరుడైన వేంకటేశ్వరుని దర్శించుకున్న తర్వాత భక్తునిలో ఎటువంటి మార్పులు కలుగుతాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments