Webdunia - Bharat's app for daily news and videos

Install App

24-07-2021 గురు పూర్ణిమ, ఏం చేయాలి?

Webdunia
శనివారం, 24 జులై 2021 (09:30 IST)
భారతీయ సంప్రదాయం ప్రకారం తల్లిదండ్రుల తర్వాత మళ్లీ అంతటి గొప్పస్థానం గురువుకే దక్కుతుంది. అందుకే 'ఆచార్య దేవో భవ' అన్నారు. అంతేకాకుండా త్రిమూర్తులు ఒక్కటై గురువుగా అవతరిస్తారని విశ్వాసం. అందుచేత ఆషాఢ శుద్ధ పూర్ణిమ (జూలై 24) రోజున విష్ణుమూర్తి, దత్తాత్రేయ, సాయిబాబా పూజతో పాటు ఆదిశంకరాచార్యుల వారిని కూడా పూజించడం మంచిది.
 
వ్యాసపూర్ణిమ పర్వదినాన్ని ఆదిశంకరాచార్యుల వారు ఏర్పాటు చేసినట్లు పెద్దలు చెబుతారు. ఈ పర్వదినాన కొన్ని ఆలయాల్లో ఓ పూజ జరుగుతుంది. కొత్త అంగవస్త్రాన్ని పరిచి దాని మీద బియ్యం పోసి, ఆ బియ్యం మీద చుట్టూ నిమ్మకాయలుంచారు. ఆదిశంకరులు, ఆయన నలుగురు శిష్యులు వచ్చి వాటిని అందుకుంటారని విశ్వాసం. 
 
పూజ అయిన తర్వాత తలా ఓ పిడికెడు బియ్యం తీసుకుని తమ ఇళ్ళలోని బియ్యంలో కలుపుకుంటారు. బియ్యం, కొత్తవస్త్రం అనేవి లక్ష్మీదేవి చిహ్నాలని, నిమ్మపళ్ళు కార్యసిద్ధికి సూచకాలని పురోహితులు అంటున్నారు. అందుచేత గురుపౌర్ణమి రోజున పూజ చేసేటప్పుడు కుంకుమ మరియు విభూతి నుదుటన బెట్టి దేవతా స్తుతి చేయాలి.
 
గురుపౌర్ణమి రోజున నుదుట బొట్టు పెట్టకుండా దేవతా స్తుతి చేయకూడదని పురోహితులు సూచిస్తున్నారు. ఇంకా ఆ రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఆలయాల్లో ఆవునేతితో దీపమెలిగించే వారికి సుఖసంతోషాలు చేకూరుతాయని విశ్వాసం. అలాగే ఆలయాల్లో జరిగే పూజలను కళ్లారా వీక్షించేవారికి లేదా పూజలు జరిపేంచేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

టీడీపీ నక్రాలు చేస్తే 10 మంది ఎంపీలను బీజేపీ లాగేస్తుంది : ప్రొఫెసర్ నాగేశ్వర్ (Video)

ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పివేశాక బయటపడిన నోట్ల కట్టలు!!

Two headed snake: శివాలయంలో రెండు తలల పాము.. వీడియో వైరల్

దేశ, ప్రపంచ నగరాల్లో శ్రీవారి ఆలయాలు.. బాబు వుండగానే క్యూలైన్‌లో కొట్టుకున్న భక్తులు.. (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

19-03-2025 బుధవారం దినఫలితాలు : రుణసమస్య తొలగి తాకట్టు విడిపించుకుంటారు

భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి : తితిదే

TTD : జూన్ మాసపు శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల.. వివరాలివే

18-03-2025 మంగళవారం దినఫలితాలు : ఆపన్నులకు సాయం అందిస్తారు...

17-03-2025 సోమవారం దినఫలితాలు -

తర్వాతి కథనం
Show comments