Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురు సాక్షాత్ పరబ్రహ్మ (రేపు గురుపౌర్ణమి)

గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజును గురుపూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అని పిలుస్తారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు. ఆ రోజున గురుపూజోత్సవం జరిపి గ

Webdunia
సోమవారం, 18 జులై 2016 (16:29 IST)
గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజును గురుపూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అని పిలుస్తారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు. ఆ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు, బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపునకు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు. గురువుల పట్ల ఇదే గౌరవం అన్నివేళలా పాటిస్తున్నప్పటికీ ఆ రోజు వ్యాసమహాముని పుట్టిన రోజు కాబట్టి దీనికంత ప్రాధాన్యత ఉంది. 
 
ఈ రోజున చాలామంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి, చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు. గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరుచుకుని ఉంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు. తరతరాలకూ కొనసాగవచ్చు. హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధానకర్తగా భావిస్తుంటారు. 
 
వేదవ్యాసుని మానవజాతికంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు కాబట్టి ఆయన్ను మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు. షిరిడీ సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
 
భారతీయ సంప్రదాయం ప్రకారం తల్లిదండ్రుల తర్వాత మళ్లీ అంతటి గొప్పస్థానం గురువుకే దక్కుతుంది. అందుకే `ఆచార్య దేవో భవ' అన్నారు. అంతేకాకుండా త్రిమూర్తులు ఒక్కటై గురువుగా అవతరిస్తారని విశ్వాసం. అందుచేత ఆషాఢ శుద్ధ పూర్ణిమ రోజున విష్ణుమూర్తి, దత్తాత్రేయ, సాయిబాబా పూజతో పాటు ఆదిశంకరాచార్యుల వారిని కూడా పూజించడం మంచిదని పురోహితులు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Three Monkey Flexes: చెడు చూడవద్దు, చెడు వినవద్దు, చెడు మాట్లాడవద్దు.. ఆ ఫ్లెక్సీలు ఎందుకు?

Liquor Lovers: మద్యం ప్రియులకు శుభవార్త.. నో స్టాక్ అనే బోర్డు పెట్టరట

Yadagirigutta: యాదగిరిగుట్ట.. దర్శనం క్యూలైన్ గ్రిల్‌లో ఇరుక్కున్న బాలుడి తల (video)

South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదం.. 179మంది సజీవదహనం

రుణం తీర్చలేదు.. బ్యాంక్ అధికారుల ఒత్తిడి.. వ్యక్తి ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

Tirumala: తిరుమలలో అద్భుతం.. మంచు కొండల్లా మారిన ఏడు కొండలు (video)

27-12-2024 శుక్రవారం దినఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం...

26-12-2024 గురువారం దినఫలితాలు : విలాసాలకు వ్యయం చేస్తారు...

టీటీడీకి రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఈఓ భారీ విరాళం రూ.1.11 కోట్లు

25-12-2024 బుధవారం దినఫలితాలు : అనుకున్న లక్ష్యం సాధిస్తారు...

తర్వాతి కథనం
Show comments