Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుక్రవారం నాడు ఇలా నోములు చేస్తే?

నోములన్నింటిలోకి శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంటుంది. ఈ నోము నోచుకునే వారు ఉదయాన్నే స్నానంచేసి తులసి కోట దగ్గర దీపారాధన చేసి 20 ప్రదక్షణలు చేయాలి. ఈ రోజున ఎవరింటికి గాని, ఏ ఊరికి గాన

Webdunia
గురువారం, 12 జులై 2018 (11:04 IST)
నోములన్నింటిలోకి శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంటుంది. ఈ నోము నోచుకునే వారు ఉదయాన్నే స్నానంచేసి తులసి కోట దగ్గర దీపారాధన చేసి 20 ప్రదక్షణలు చేయాలి. ఈ రోజున ఎవరింటికి గాని, ఏ ఊరికి గాని వెళ్లకూడదు. ప్రతి శుక్రవారం కథ చెప్పుకుని అక్షింతలు వేసుకుంటూ 20 వారాల పాటు ఈ నోమును కొనసాగించాలి.
 
ఆ తరువాత 'లక్ష్మీ తులసి' దగ్గర 20 దీపాలు పెట్టి 20 మంది ముత్తయిదువులకు బొబ్బర్లు దానమివ్వాలి. అలాగే ఒక బ్రాహ్మణుడికి నూతన వస్త్రాలను దక్షిణ తాంబూలాలతో సహా దానమిల్వాలి. ఇక ఈ నోము నోచుకోవడానికి కారణమైన కథ ఒకటి ప్రచారంలో ఉంది. పెళ్లయిన కొత్తలో ఓ యువతి పుట్టింటికి వెళ్లింది. ఆమెను తీసుకు వెళ్లడానికి వచ్చిన భర్త ఉన్న పళంగా బయలుదేరుదా మంటూ తొందర పెట్టాడు.
 
ఆ రోజున శుక్రవారం కావడం వలన అమ్మాయిని పంపించడం ఆనవాయతీ కాదంటూ అత్తామామలు అడ్డుపడ్డారు. అయినా అతను వినిపించుకోకుండా తన భార్యను తీసుకుని ఎద్దుల బండిలో వెళ్లిపోయాడు.ఈ విషయంగా ఆ దంపతులిద్దరూ బండిలో గొడవపడుతూనే ఉన్నారు. అప్పటికే బాగా పొద్దుపోవడంతో ఒక ఊళ్లో ఆగిపోయి ఓ పెద్ద మనిషి ఇంట్లో ఆశ్రయం పొందారు. 
 
వచ్చిన దగ్గర నుండి వాళ్ల ధోరణిని ఆ పెద్దమనిషి గమనిస్తూనే ఉన్నాడు. మరునాడు ఉదయం వాళ్లిద్దరూ బయలుదేరుతుండగా ఆ పెద్దమనిషి బండి దగ్గరిగి వచ్చాడు. ఆడపిల్ల లక్ష్మీదేవితో సమానమని అందువలన వాళ్లు కంట తడి పెట్టకుండా చూసుకోవాలని ఆ యువతి భర్తతో చెప్పాడు. ఆడపిల్ల పుట్టింటిని వదిలి పెట్టేటప్పుడు సహజంగానే కన్నీళ్లు పెట్టుకుంటుందని అందువల్లనే ఆమెను శుక్రవారం తీసుకెళ్లకూడదని అన్నాడు.
 
ఈ విధంగా చేయడం ఇటు పుట్టింటి వారికి అటు అత్తింటి వారికి మంచిది కాదని చెప్పాడు. పెద్దలమాట కాదన్నందువలన కలహాలు ఏర్పడతాయని శుక్రవారం బయలుదేరడం వల్లనే వారి మధ్య మనస్పర్థలు తలెత్తాయని చెప్పాడు.

ఇంటికి వెళ్లిన తరువాత శుక్రవారపు నోము నోచుకోమని ఫలితంగా సమస్యలన్నీ పరిష్కారమవుతాయని అన్నాడు. అంతలో ఆయన భార్య కూడా వచ్చి ఆ నోము విధి విధానాలను గురించి చెప్పింది. దాంతో ఆ యువతి ఇటు పుట్టింటి వారి కోసం అటు అత్తింటి వారి కోసం శుక్రవారాల నోము నోచి ఉత్తమమైన ఫలితాలను పొందింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ambati Rayudu: పవన్‌కు ఇష్టం లేకున్నా.. ఏపీకి సీఎంను చేస్తా: అంబటి రాయుడు

పొరుగు రాష్ట్రాల మహిళలకు ఇప్పటికీ విద్యా హక్కు లేదు: మంత్రి దురైమురుగన్

ఉద్యోగం పేరుతో నయా మోసం... ఫేక్ కంపెలీ పేరుతో ఆఫర్ లెటర్... రూ.2.25 లక్షలు వసూలు

Vijayashanthi: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయశాంతి.. విజయం ఖాయమేనా?

అంతర్జాతీయ మహిళా దినోత్సవం: ISACA Hyderabad Chapter నిర్వహించిన SheLeadsTech ఈవెంట్

అన్నీ చూడండి

లేటెస్ట్

07-03-2025 శుక్రవారం దినఫలితాలు- సంతోషకరమైన వింటారు. మీ కష్టం ఫలిస్తుంది..

తితిదే అన్నప్రసాదంలో అవి గారెలా? వడలా?: తితిదే ఛైర్మన్‌కి ప్రశ్నల వర్షం

ఈ రంజాన్ మాసంలో దుబాయ్‌లో ఐదు ముఖ్యమైన ఇఫ్తార్ ప్రదేశాలు

శని - రాహువు కలయిక.. అశుభ యోగం.. కన్య, ధనుస్సు రాశి వారు జాగ్రత్త!

వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా..? ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే.. సూపర్ ఫలితాలు

తర్వాతి కథనం
Show comments