Webdunia - Bharat's app for daily news and videos

Install App

దైవానుగ్రహం ఎప్పుడూ మీమీద ఉన్నట్లు గమనించకపోవడానికిదే కారణం....

మీరు హోటలు లాబీలో కూర్చోని ఉన్నప్పుడు, వెనకాల వచ్చే సంగీతం వినిపిస్తూ ఉండడం మీరు గమనించారా? కాసేపటి తర్వాత అది ఉన్నట్లు కూడా మీరు గమనించరు. మీరు ఎవరితోనైనా మాట్లాడదలచుకున్నప్పుడే అది మీకు అడ్డంకిగా కనిపిస్తుంది – లేకపోతే నిరంతరంగా నడుస్తూ ఉన్న ఆ సంగీ

Webdunia
మంగళవారం, 10 జనవరి 2017 (16:32 IST)
మీరు హోటలు లాబీలో కూర్చోని ఉన్నప్పుడు, వెనకాల వచ్చే సంగీతం వినిపిస్తూ ఉండడం మీరు గమనించారా? కాసేపటి తర్వాత అది ఉన్నట్లు కూడా మీరు గమనించరు. మీరు ఎవరితోనైనా మాట్లాడదలచుకున్నప్పుడే అది మీకు అడ్డంకిగా కనిపిస్తుంది – లేకపోతే నిరంతరంగా నడుస్తూ ఉన్న ఆ సంగీతాన్ని మీరు గమనించరు కూడా. మీ ఇంట్లో  ఏదో యంత్రం నడుస్తూ ఉంటుంది, కాని మీరు ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడే అది గమనిస్తారు. మీరు శ్వాసిస్తున్నట్లు కూడా గమనించరు; అది ఒక్క నిమిషం ఆగిపోతే అప్పుడు మాత్రం దాన్ని గమనిస్తారు. దైవానుగ్రహం ఎప్పుడూ మీమీద ఉన్నట్లు గమనించకపోవడానికిదే కారణం.
 
మీరు ప్రతిసారీ ఉందా లేదా అని ప్రశ్నించుకోవలసిన విషయం కాదు. అదెల్లప్పుడూ ఉంటుంది. ఎల్లప్పుడూ ఉండేదాన్ని ఉన్నట్లు గుర్తించకపోవడం వల్ల సమస్య ఏముంది? జీవితం సాగుతూనే ఉంటుంది కదా! కాని దివ్యానుగ్రహంలో ఉన్నామన్న సంతోషాన్ని కోల్పోతాం. ఈ దివ్యానుగ్రహం ఒకప్పుడుండి, మరోకప్పుడు పోయేది కాదు. మీరు ప్రతిసారీ ఉందా లేదా అని ప్రశ్నించుకోవలసిన విషయం కాదు. అదెల్లప్పుడూ ఉంటుంది. మీరు దాన్ని ఆనందించాలంటే మీరు దాని పట్ల స్పృహ కలిగి ఉండాలి.
 
దివ్యానుగ్రహంలోని ఆనందం అని నేనన్నప్పుడు దాన్ని మీరిలా అర్థం చేసుకోవాలి – నేను దీన్ని ఎన్నో విధాలుగా చెప్పాను, కాని మీలో చాలామంది దీన్ని నిర్లక్ష్యం చేశారు. మీరు నాతో కూర్చున్నప్పుడు, అది క్షణకాలమే అయినప్పటికీ, ఇక మీకు జీవితంలో గోప్యమనేది ఉండదు. మీరు నాతో కూర్చున్నప్పుడు, ముఖ్యంగా నేను దీక్ష ఇచ్చినప్పుడు, అనుగ్రహం మీమీద ఉందా, లేదా అన్న ప్రశ్నే ఉండదు – అది నిరంతరం ఉంటుంది. మీరు ఈ కృపను మీ పథకాలు పూర్తి నెరవేర్చాలని కోరుకుంటున్నారు. ఇది మీరు గుడికో, చర్చికో వెళ్లి దేవుడా నా కోసం ఇది చేయి అని అడిగే పాత అలవాటు. ఆ దేవుడు పని చేయకపోతే మీరు దేవుణ్ణి మారుస్తారు.
 
గురుకృప మీ  ప్రణాళికలను నెరవేర్చడం కోసం కాదు; అది మీ జీవిత ప్రణాళికను సఫలం చేయడం కోసం ఉద్దేశించింది. అనుగ్రహం అన్నది మీ చిన్నచిన్న కోరికలను తీర్చడానికి కాదు. ఏది ఏమైనా మీ ప్రణాళికలు, కోరికలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. మీ జీవితంలో విభిన్న దశల్లో ‘అవును ఇదే’ అనుకుంటారు, మరుక్షణంలో మీ నిర్ణయం మార్చుకుంటారు. మీరేదో విహారయాత్రకు పోదలచుకుంటారు, ‘‘సద్గురూ, మీరు నాకు సహాయం చేయరా?’’ అని అడుగుతారు. ‘‘దివ్య కృప నాపైన ఉందా? లేదా?’’ అని రోజూ ప్రశ్నించుకోకండి. గురుకృప మీ  ప్రణాళికలను నెరవేర్చడం కోసం కాదు; అది మీ జీవిత ప్రణాళికను సఫలం చేయడం కోసం ఉద్దేశించింది. మీరు జీవన  సాఫల్యం పొందడం కోసం ఉద్దేశించిందది.
 
- సద్గురు

పండ్లు ఇస్తున్నట్లు నటిస్తూ చీర పిన్ తీసేవాడు: హెచ్‌డి ప్రజ్వాల్ రేవన్నపై బాధితురాలు ఫిర్యాదు

ఏపీ గురించి పూనమ్ కౌర్ కామెంట్స్.. వైరల్

చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి సెక్యూరిటీ కల్పించాలి : హైకోర్టు

దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ పెన్ డ్రైవ్‌ల్లో వేలాది మహిళల శృంగార వీడియోలు!!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : 30న టీడీపీ - బీజేపీ - జనసేన ఉమ్మడి మేనిఫెస్టో!!

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

నరదృష్టిని తరిమికొట్టే కంటి దృష్టి గణపతి.. ఉత్తరం వైపు?

24-04-202 బుధవారం దినఫలాలు - విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వల్ల...

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

తర్వాతి కథనం
Show comments