Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాణిపాకంలో సిబ్బంది చేతివాటం - ప్రతిరోజు వేలల్లో అక్రమ సంపాదన

Webdunia
సోమవారం, 27 జూన్ 2016 (11:58 IST)
చిత్తూరు జిల్లాలోనే ప్రసిద్థి చెందిన వరసిద్ధ వినాయకస్వామి ఆలయంలో పనిచేస్తున్న సిబ్బంది చేతి వాటం అంతా ఇంతా కాదు. ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందిలో కొందరు ప్రతిరోజు రెండు వేల రూపాయలుపైగా అక్రమంగా డబ్బులను సంపాదిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. పర్మినెంట్ ఉద్యోగులుగా ఉన్న సిబ్బందే అక్రమ సంపాదన కోసం వెంపర్లాడుతున్నారన్న విమర్శలు లేకపోలేదు. కాణిపాకంలో సిబ్బంది చేతివాటంపై ప్రత్యేక కథనం..
 
కాణిపాకం. బహుశా ఈ పేరంటే తెలియని వారుండరు. ఎంతో ప్రాముఖ్యత కలిగింది ఈ ఆలయం. వినాయకుడు స్వయంభుగా ఈ ప్రాంతంలో వెలిశాడని ప్రసిద్ధి. ఎన్నో యేళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని దేవదాయశాఖ తన ఆధీనంలోకి తీసుకుంది. ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది సగానికిపైగా పర్మినెంట్‌ ఉద్యోగులు ఉండగా మిగిలిన వారు కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్నారు. ఒక్కో పర్మినెంట్‌ ఉద్యోగికి వేలరూపాయల్లోనే జీతాలు వస్తుంటాయి. అయినా వీరికి ఆ డబ్బులు సరిపోవు. అక్రమ సంపాదనే వీరి ధ్యేయంగా ఉంది. 
 
ఎందుకు అలా అంటున్నారు.. అనుకుంటున్నారా... నిజమేనండి.. ఆలయంలో పనిచేసే వారిలో కొంతమంది పర్మినెంట్‌ ఉద్యోగులు ప్రతిరోజు 2 వేల రూపాయలుపైగా అక్రమంగా సంపాదిస్తే గానీ ఇక్కడి నుంచి వెళ్ళరు. ప్రపంచ నలుమూలల నుంచి భక్తులను నేరుగా తమ వారని చెప్పుకుని లోపలికి తీసుకెళ్ళి సపర్యలు చేస్తారు. అన్నీ అయి పోయిన తర్వాత ఆమ్యామ్యాలు మామూలే. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచే అధికంగా కాణిపాకం ఆలయానికి తరలివస్తుంటారు. వీరిలో పారిశ్రామికవేత్తలు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు ఎవరైనా వస్తే ఇక వారి నుంచి వేలల్లోనే వసూలు చేస్తారన్న ఆరోపణలు లేకపోలేదు.
 
ప్రతిరోజు కాణిపాకం ఆలయంలో అభిషేక సేవలు జరుగుతుంటాయి. ఈ సేవలలో ముందు టికెట్టు తీసుకుంటే ముందు కూర్చోవచ్చు.. వెనుక తీసుకుంటే వెనుకనే కూర్చోవాలి. ఇది ప్రతి ఆలయంలో ఉండేదే. కానీ ఈ ఆలయంలో అలా కాదు ఎప్పుడు టికెట్‌ తీసుకున్నా.. అక్కడి సిబ్బంది తెలిస్తే చాలు ముందే కూర్చోబెడతారు. ఎంతమంది కూర్చున్నా వారిని పక్కన పంపి టాప్‌‌మోస్ట్ ప్రోటోకాల్‌ అంటూ సామాన్య భక్తులను బెదిరించే ప్రయత్నం చేస్తారు. ఎవరైనా భక్తుడు తిరగబడితే అతనిపై మూకుమ్మడిగా దాడికి దిగుతారు కాణిపాకం సిబ్బంది.
 
దర్శన విషయాని కొస్తే ఎంత రద్దీ ఉన్నా సరే విఐపి గేట్‌ నుంచి నేరుగా తీసుకెళ్ళి దర్సనం చేయిస్తారు ఇక్కడి సిబ్బంది. ఒక్కో గేటుకు ఇక్కడ ఒక్కో రేటుంది. ఆలయానికి కుడివైపున ఉన్న గేటు నుంచి తీసుకెళితే అది టాప్‌ మోస్ట్ విఐపిల గేటు, ఎడమవైపు నుంచి తీసుకెళితే మామూలు విఐపి.. ఇలా ఒక్కో దానికి ఒక్కో రేటు ఉంటుంది. కాణిపాక సిబ్బంది చేతివాటంపై ఎన్నోసార్లు దేవదాయశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా సరే పట్టించుకున్న పాపాన పోలేదు.
 
తిలాపాపం తలాపిడికెడు అన్నట్లు... ఎవరు అక్రమంగా సంపాదించుకున్న డబ్బు వారికే. ఎవరు విఐపి (పార్టీ)ని తీసుకువచ్చినా ఎవరూ ప్రశ్నించరు. ఎందుకంటే వారు చేసేది కూడా అదే కాబట్టి. అలా సాగుతోంది వీరి దందా. ఇప్పటికైనా కాణిపాక సిబ్బంది చేతివాటంపై దేవదాయశాఖ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫెంజల్ తుపాను: కడపలో ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక, తిరుపతి నుంచి వెళ్లాల్సిన 4 విమానాలు రద్దు

అదానీ కంపెనీలో ఒప్పందాలు జగన్‌కు తెలియవా? పురంధేశ్వరి ప్రశ్న

కొనసాగుతున్న ఉత్కంఠత : 24 గంటల్లో కీలక ప్రకటన..?

రాంగోపాల్ వర్మ ఎక్కడున్నారు? పోలీసులు ఎందుకు ఆయన కోసం వెతుకుతున్నారు

ఏక్‌నాథ్ షిండేను తప్పించే వ్యూహాల్లో కమలనాథులు : శివసేన నేత ఆరోపణలు

అన్నీ చూడండి

లేటెస్ట్

29-11-2024 శుక్రవారం ఫలితాలు - సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది...

అదృష్టం ఈ రాశుల వారికే.. 2025 శుక్ర గ్రహ అనుకూలంతో..?

మేష రాశిఫలం 2025 - ప్రేమ జీవితం ఎలా వుంటుంది?

2025: వృశ్చిక రాశి కుటుంబ జీవితం ఎలా వుంటుంది? ఆకుపచ్చ మొక్కలను?

28-11-2024 గురువారం ఫలితాలు - దైవదీక్షలు స్వీకరిస్తారు...

తర్వాతి కథనం
Show comments