Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారికి జీడిపప్పు దెబ్బ... లడ్డూలో కనిపించడం కష్టమేనా?

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2016 (11:54 IST)
ఒక్కోసారి ప్రకృతి వైపరీత్యాల నుంచి, ప్రభుత్వాల పన్నుపోటు నుంచి దేవుళ్లూ తప్పించుకోలేరేమో...! లేకపోతే ఎక్కడో ఆఫ్రికాలో సంభవించిన పరిణామాలతో ఇక్కడ ఏడుకొండల్లో ఉన్న మన శ్రీనివాసుడిపై కోట్ల రూపాయల భారం పడటం ఏమిటి? ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం విధించిన పన్నుభారం తిరుమలలోని మన వడ్డీకాసులవాడి మీద పడడం ఏమిటీ? ఇంతకీ విషయం ఏమిటంటే...? దేశంలో ముంతమామిడి పప్పుకు ఏర్పడిన కొరత, డిమాండ్‌తో తితిదేపై కోట్ల రూపాయల భారం పడింది. అనూహ్యంగా పెరిగిన ధరతో 13 కోట్ల రూపాయల అదనపు భారం మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలు, అన్నప్రసాదాల తయారీకి ఏటా దాదాపు 7.50 లక్షల కిలోలకుపైగా ముంతమామిడి పప్పు వినియోగిస్తోంది. 2015-16 సంవత్సరంలో 7,77,000 కిలోలు వాడింది. 2016-17సంవత్సరానికి గాను 7 లక్షల 50వేల కిలోల జీడిపప్పు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు టెండర్లు పిలిచింది. కేరళలోని కొల్లంకు చెందిన టక్కర్‌ సేల్స్ కార్పొరేషన్‌ అనే సంస్థకు ఈ టెండర్‌ దక్కించుకుంది. 
 
ఈ సంస్థ కిలో 668.79 ధరతో కోట్‌ చేసింది. మొత్తం నాలుగు సంస్థలు టెండర్లలో పాల్గొనగా ఇదే అతి తక్కువ ధర, మిగిలిన మూడు సంస్థలు రూ.668.69 ధరలతో కోట్‌ చేసింది. మొత్తం నాలుగు సంస్థలు టెండర్లలో పాల్గొనగా ఇదే అతి తక్కువ ధర. మిగిలిన మూడు సంస్థలు రూ.738, రూ.743, రూ.745 కోట్‌ చేశాయి. దీంతో 668.79 కోట్‌ చేసిన సంస్థకు టెండర్‌ ఖరారైంది.
 
గత ఏడాదితో పోల్చితే ఈసారి జీడిపప్పు ధర అమాంతం పెరిగిపోయింది. గత యేడాది మొత్తం కిలో రూ.489 వంతున రాజమండ్రికి చెందిన ఓ సంస్థ నుంచి కొనుగోలు చేశారు. ఈసారి రూ.668.79 చెల్లించాల్సి వస్తోంది. అంటే కిలోపైన రూ.179-79 పెరిగింది. గత ఏడాదికి ఇప్పటి ధర రూ.36.76శాతం పెరిగింది. ఈ ఏడాది కొనుగోలు చేయాలనుకుంటున్న 7.50 లక్షల కేజీలకు రూ.50.15 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. గత యేడాది ధరతో కొనుగోలు చేసి ఉంటే రూ.36 కోట్లు మాత్రమే అయ్యేది. జీడిపప్పు ధర యేటా రూ.20 దాకా పెరుగుతుంటుంది. అయితే గత యేడాది రూ.60 పెరిగితే ఈ యేడాది ఏకంగా రూ.179 పెరిగిపోయింది. 
 
2014-15తో పోల్చితే ఈ యేడాది ధర కిలోకు రూ.268పెరిగింది. 2014-15లో కిలో రూ.406కు కొనుగోలు చేశారు. వచ్చే యేడాది కిలో రూ.1000కు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. జీడిపప్పు ధరలు ఇంతగా పెరిగిపోవడానికి కారణం ఆఫ్రికా దేశాల్లో జీడిగింజల ఉత్పత్తి తగ్గిపోవడమేనని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. మన దేశంలో ఏటా 5 లక్షల టన్నుల దాకా జీడిగింజలు ఉత్పత్తి అవుతుంటే.. ఆఫ్రికా దేశాల నుంచి ఏటా 10 లక్షల టన్నుల దాకా దిగుమతి చేసుకుంటున్నారు. 
 
ఇక్కడి పరిశ్రమల్లో గింజ నుంచి పప్పు వేరు చేసి మళ్ళీ విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దేశీయంగాను జీడిపప్పు వినియోగం బాగా పెరుగుతోంది. గత కొన్నేళ్లుగా ఆఫ్రికా దేశాల్లో జీడిగింజల ఉత్పత్తి తగ్గిపోతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఈ యేడాది పంట చేతికి రావడం బాగా ఆలస్యమైందని, ఆ ప్రభావం వల్లే డిమాండ్‌ అమాంతం పెరిగిపోయిందని అంటున్నారు. ఇదేసమయంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీడిగింజల దిగుమతులపై 9.36 శాతం పన్ను విధించింది. గతంలో అసలు పన్ను ఉండేది కాదు. 
 
దీంతో జీడిగింజలను ప్రాసెస్‌ చేసే పరిశ్రమలు, గింజలను దిగుమతి చేసుకోవాడానికే ప్రాధాన్యత ఇచ్చాయి. దేశీయంగా ఉత్పత్తి అయ్యే గింజలనూ ఈ పరిశ్రమలే నియంత్రించే పరిస్థితి ఏర్పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని జీడిపిక్కల దిగుమతులపై 9.36 శాతం పన్ను విధించింది. ఆఫ్రికా దేశాలలో పంట దిగుబడులు తగ్గడం, సకాలంలో చేతికి అందకపోవడం కేంద్ర దిగుమతి సుంకం విధించడం, దీంతో వ్యాపారుల దిగుమతి తగ్గించడం, దేశీయంగా జీడిపప్పు వినియోగం బాగా పెరగడం ఈ కారణాల వల్ల జీడిపప్పు ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఆ దెబ్బే ఇప్పుడు తితిదేని తాకింది.
 
భారీగా పెరిగిన ధరతో ఆలోచనలో పడిన తితిదే ప్రస్తుతానికి ఆరునెలలకు సరిపడా పప్పు మాత్రమే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇది సరైన నిర్ణయమే. అయితే ఒకవేళ భవిష్యత్తులో ధర తగ్గితే మళ్లీ టెండర్లు ఆహ్వానించి అవవసరమైన మేర ముంతమామిడి పప్పు కొనుగోలు చేయవచ్చు. ఈ అనుభవం చెబుతున్నది ఏమంటే.. భారీ పరిణామంలో కొనుగోలు చేసే జీడిపప్పు, నెయ్యి, చక్కెర, పచ్చిశెనగపప్పు, కందిపప్పు, యాలకులు, ఎండు ద్రాక్ష వంటి సరుకుల మార్కెట్‌లో వచ్చే ఒడుదుడుకులను ఎప్పటికప్పడు అధ్యయనం చేయడానికి, ఎప్పుడు కొనుగోలు చేస్తే తక్కువ ధరకు లభిస్తాయో తెలుసుకోవడానికి ప్రత్యేక వ్యవస్థను, నిపుణులను తితిదే ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. లేకుంటే కోట్ల రూపాయల్లో నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

09-05-2024 గురువారం దినఫలాలు - విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి...

అక్షయ తృతీయ 2024.. తులసి మొక్కను ఇంట్లో నాటిపెడితే?

08-05-202 బుధవారం దినఫలాలు - మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది...

07-05-202 మంగళవారం దినఫలాలు - దైవకార్యాలపై ఆసక్తి నెలకొంటుంది...

ఆ దిశల్లో బల్లి అరుపు వినిపిస్తే.. ఇక డబ్బే డబ్బు..!

తర్వాతి కథనం
Show comments