Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. అంకురార్పణంతో ప్రారంభం

సెల్వి
గురువారం, 3 అక్టోబరు 2024 (10:29 IST)
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబరు 3వ తేదీ సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అంకురార్పణంతో ప్రారంభం కానున్నాయి. అంకురార్పణం లేదా బీజవాపనం అని పిలువబడే ఈ కీలకమైన వేడుక వైఖానస ఆగమంలో బ్రహ్మోత్సవం ఉత్సవాల విజయవంతానికి దైవానుగ్రహం కోసం నిర్వహించే కీలకమైన సంప్రదాయం. 
 
అంకురార్పణం సందర్భంగా శ్రీవారి దివ్య సేనాధిపతి శ్రీ విశ్వక్సేనుల బ్రహ్మోత్సవం ఉత్సవాల నిర్వహణను అత్యద్భుతంగా పర్యవేక్షిస్తూ ఆలయ పరిసర నాలుగు మాడ వీధుల్లో మహా ఊరేగింపు నిర్వహించనున్నారు. 
 
అనంతరం పుట్టమన్నులో నవ ధాన్యాలు నాటేందుకు ముందు పూజా కార్యక్రమాల్లో అంతర్భాగమైన భూమాతను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 
 
ఈ కార్యక్రమానికి సన్నాహకంగా ఉత్సవాలకు అవసరమైన పవిత్ర సామగ్రిని శ్రీవారి ఆలయానికి తరలించారు. అక్టోబరు 4న జరగనున్న ధ్వజారోహణ మహోత్సవానికి అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
అక్టోబరు 4 నుండి 12 వరకు జరిగే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మంత్రి కొండా సురేఖకు మాజీ మంత్రి కేటీఆర్ డెడ్‌లైన్... సారీ చెప్పకుంటే..

మెట్టు దిగిన మంత్రి కొండా సురేఖ... సమంతపై చేసిన వ్యాఖ్యలను బేషరతుగా..

నేపాల్‌లో భారీ వరదలు-పశుపతినాధ్ ఆలయం వరద.. 240మంది మృతి (video)

కొండా సురేఖ, సీతక్క, రేవంత్ నోరును ఫినాయిల్‌తో కడగాలి- కేటీఆర్

ఈ వీడియో చూస్తే పిల్లల చేతిలో స్మార్ట్‌ఫోన్లు పెట్టరు? (వీడియో)

అన్నీ చూడండి

లేటెస్ట్

సూర్యగ్రహణం.. కన్యారాశి, మీన రాశికి ఇబ్బందులు తప్పవా?

01-10-2024 మంగళవారం దినఫలితాలు : సమస్యలకు పరిష్కారం గోచరిస్తుంది...

Navratri 2024.. వెండి నాణేలు, తులసి మొక్క, లక్ష్మీ ఫోటో ఇంటికి తెచ్చుకుంటే?

బతుకమ్మ పండుగ విశిష్టత.. పసుపు రంగు పూలతో పేర్చి...

30-09-2024 సోమవారం దినఫలితాలు : నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం...

తర్వాతి కథనం
Show comments