Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి లడ్డూలో బొగ్గు ముక్కలు... అవాక్కైన భక్తురాలు.. లైట్‌గా తీసుకున్న తితిదే

ప్రచంచంలో అత్యంత పవిత్రంగా భావించే ప్రసాదాల్లో శ్రీవారి లడ్డూ ఒకటి. ఈ లడ్డూను ఇష్టపడని భక్తుడే కాదు.. సాధారణ ప్రజలు కూడా ఉండరు. అలాంటి లడ్డూలో బొగ్గులు, బొద్దింకలు, చీమలు, జెర్రెలు వంటివి కనిపించడం ఇట

Webdunia
ఆదివారం, 30 ఏప్రియల్ 2017 (07:09 IST)
ప్రచంచంలో అత్యంత పవిత్రంగా భావించే ప్రసాదాల్లో శ్రీవారి లడ్డూ ఒకటి. ఈ లడ్డూను ఇష్టపడని భక్తుడే కాదు.. సాధారణ ప్రజలు కూడా ఉండరు. అలాంటి లడ్డూలో బొగ్గులు, బొద్దింకలు, చీమలు, జెర్రెలు వంటివి కనిపించడం ఇటీవలికాలంలో పరిపాటిగా మారింది. తాజాగా శ్రీవారి లడ్డూలో బొగ్గు ముక్కలు కనిపించడంతో ఓ భక్తురాలు అవాక్కయ్యింది. దీనిపై తితిదే అధికారులకు ఫిర్యాదు చేయగా, అవి బొగ్గు ముక్కలు కాదనీ, మాడిపోయిన ఎండుద్రాక్ష అంటూ దొర్లిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కృష్ణా జిల్లాకు చెందిన యామిని శుక్రవారం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. సాయంత్రం వసంతోత్సవసేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆ టికెట్‌పై లడ్డూలను తీసుకున్నారు. వీటిలో ఓ లడ్డూని తుంచగా రెండు నల్లటి బొగ్గు ముక్కలు కనిపించాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె రాతపూర్వకంగా టీటీడీ భద్రతా విభాగానికి ఫిర్యాదు చేశారు. సిబ్బంది వెంటనే పోటు పేష్కార్‌ అశోక్‌కుమార్‌కు సమాచారమిచ్చారు. ఆయన లడ్డూ వితరణశాలకు చేరుకుని భక్తురాలి వద్ద ఉన్న లడ్డూలు, అందులోని నల్లటి ముక్కలను పరిశీలించారు. 
 
ఇవి బొగ్గుముక్కలు కావని.. మాడిన ఎండు ద్రాక్ష అంటూ సెలవిచ్చారు. పోటు కేంద్రంల కట్టెల పొయ్యిలు లేవని.. బూందీ నేతిలో ఎక్కువగా మరిగి ఇలా ముక్కలుగా తయారైందన్నారు. వాటిని తమ సిబ్బంది పొరపాటున లడ్డూల్లో కలిపి ఉండవచ్చని చెప్పారు. ఆ భక్తురాలు మాత్రం ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు.
 
సమాచారం అందుకున్న టీటీడీ ఆరోగ్యశాఖాధికారి శర్మిష్ట భక్తురాలిని కలిశారు. ఆమె చెప్పిన వివరాలను నమోదు చేసుకుని ఈవో సాంబశివరావుకు అందజేశారు. అలాగే శర్మిష్ట ఆలయం వెలుపల ఉన్న బూందీ తయారీశాలను తనిఖీ చేసి పోటు కార్మికులతో మాట్లాడారు. నేతిలో బూందీ మరుగుతుండగా కొన్ని అడుగుభాగాన పేరుకుపోయి నల్లగా అవుతాయని.. అవే బూందీతోపాటు కలిసి ఉండవచ్చన్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments