అమావాస్య రోజున ఈ నియమాలు పాటిస్తే..?

Webdunia
సోమవారం, 27 జూన్ 2022 (22:17 IST)
మన సనాతన ధర్మ ప్రకారం మృతిచెందిన పూర్వీకులు, బంధువులు పితృపక్షం రోజుల్లో అమావాస్య రోజున భూమి పైకి వస్తారని విశ్వాసం. ఆరోజున వారికి శ్రద్ధ, తర్పణం చేయడం ఆచారం.  
 
అమావాస్య (28-06-22) రోజు చనిపోయిన వారికి శ్రాద్ధం నిర్వహిస్తే.. వారి ఆత్మ లకు మోక్షం దక్కుతుందని నమ్మకం. దీంతో వారు వారి కుటుంబాలకు దీవెనలు అందిస్తారని అంటారు. అమావాస్య రోజున కట్టింగ్, షేవింగ్‌ చేసుకోకూడదు.  
 
సూర్యచంద్రులు అమావాస్య రోజు చేరువై ఒకే చోట నివసిస్తారు. అదే రోజునే అమావాస్య అనే పేరు సార్థకం అయ్యింది. ఈ రోజున సూర్య చంద్రులను పూజించడం చేయొచ్చు. అలాగే అమావాస్య రోజున పూజ శుభఫలితాలనే ఇస్తుంది. జీవితంలో సుఖసంతోషాలను ప్రసాదిస్తుంది. 
 
పితృదేవతలు మన శ్రేయస్సును కోరుకుంటారు. కాబట్టి.. అమావాస్య రోజున వారికి పిండ ప్రదానం చేయాలి. లేకుంటే కనీసం నీరైనా వదలాలి. పూజగదిని శుభ్రం చేసుకుని పితృదేవతలకు భోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ అన్నంలో కాస్త కాకులకు వుంచాలి. 
 
ఇలా వుంచడం ద్వారా అమావాస్య రోజున కాకుల రూపంలో పితృదేవతలు మనం వుంచిన ఆహారాన్ని తీసుకుంటారని విశ్వాసం. ఇలా ప్రతి అమావాస్యకు పితృదేవతలు పిండ ప్రదానం చేస్తే ఆ ఇంట శుభం జరుగుతుంది. 
 
పితృదేవతలు దేవతాగణంలో ఏడు విభాగాలుగా వుంటారట. పితృదేవతలను సుఖంగా వుంచుకుంటే.. తప్పకుండా అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అందుకే అమావాస్య రోజున మధ్యాహ్నం 12 గంటల్లో పితృదేవతలను పూజించి వారికి శ్రాద్ధం ఇవ్వాలని పండితులు సెలవిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ధర్ భోజ్‌శాల హిందువులదే - సరస్వతి పూజకు అనుమతి : మధ్యప్రదేశ్ హైకోర్టు

రాయలసీమను రతనాలసీమగా చేస్తాం : సీఎం చంద్రబాబు నాయుడు

డ్రోన్ హబ్‌గా కర్నూలు... యుద్ధ రంగంలో డ్రోన్ టెక్నాలజీ ఒక గేమ్ ఛేంజర్ : రాజ్‌నాథ్ సింగ్

విజయవాడ వాసులకు బుడమేరుతో వెన్నులో వణుకు, పనులు నత్త నడకన...

ఉన్నావ్ అత్యాచారం కేసు : ముద్దాయి కుల్దీప్ సింగ్‌కు షాకిచ్చిన సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

లేటెస్ట్

15-05-2026 శుక్రవారం ఫలితాలు- మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది

14-05-2016 గురువారం ఫలితాలు- మీపై వచ్చిన అభియోగాలు సమసిపోగలవు

13-05-2026 బుధవారం ఫలితాలు - ఆర్థిక సమస్య పరిష్కారమవుతుంది

ఇంట్లో పిల్లిని పెంచడం మంచిదేనా? వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుంది?

భక్తుల చిరకాల కోరికను నెరవేర్చిన పవన్: తిరుపతి నుంచి పళనికి బస్సు సేవలు

తర్వాతి కథనం
Show comments