కార్తీక మాసంలో ''ఆ'' పదార్థాలు తీసుకోరాదు...

కార్తీక మాసం శివకేశవులకు ప్రీతికరమైన, పవిత్రమైన మాసం. ఈ మాసంలో గంగా, గోదావరి, కృష్ణ వంటి నదలను తలచుకుంటూ స్నానం చేయాలి. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజూ శివాలయానికి వెళ్లి స్వామికి అభిషేకాలు చేయవలసి ఉంటుంది

Webdunia
బుధవారం, 5 సెప్టెంబరు 2018 (11:52 IST)
కార్తీక మాసం శివకేశవులకు ప్రీతికరమైన, పవిత్రమైన మాసం. ఈ మాసంలో గంగా, గోదావరి, కృష్ణ వంటి నదలను తలచుకుంటూ స్నానం చేయాలి. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజూ శివాలయానికి వెళ్లి స్వామికి అభిషేకాలు చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా కార్తీక పురాణం పారాయణం చేయాలి. ఈ మాసంలో తులసి మాలను ధరించుకుని వైష్ణవ ఆలయాలను దర్శించుకోవాలి.
  
 
శివునికి లక్ష బిల్వార్చన, విష్ణుమూర్తికి లక్ష తులసి పూజ, అమ్మవారికి లక్ష పుష్పార్చన చేయించడం వలన మంచి ఫలితం ఉంటుంది. ఈ మాసంలో ఉపవాస దీక్షను చేపట్టి నక్షత్ర దర్శనం తరువాత భగవంతునికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని ఆహారంగా తీసుకోవాలి. పనస ఆకుల్లో భోజనం చేయడం శ్రేష్ణమని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెబుతున్నారు. 
 
ఉసిరికాయ చెట్టు చుట్టూ 9 సార్లు ప్రదక్షణలు చేసి సహపంక్తి భోజనాలు చేయడం వలన, ఆలయాలలో దీపాలు వెలిగించడం వలన, దీపదానాలు చేయడం వలన, దానధర్మాలు చేయడం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చును. ఈ కార్తీక మాసంలో ఉల్లి, నీరుల్లి, చద్ది అన్నం, మాంసం, మద్యం, వంకాయ వంటి పదార్థాలను తీసుకోకూడదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మందుబాబులను నడిరోడ్డుపై నడిపిస్తూ మత్తు వదలగొట్టారు...

తెలంగాణ రాష్ట్రానికి మొదటి విలన్ కాంగ్రెస్ పార్టీ : హరీశ్ రావు ధ్వజం

అంధకారంలో వెనెజువెలా రాజధాని - మొబైల్ చార్జింగ్ కోసం బారులు

చాక్లెట్ ఆశ చూపించి ఏడేళ్ల బాలికపై అత్యాచారం

వెనెజువెలా అధ్యక్షుడి నిర్భంధం.. ఇక మీ వంతేనంటూ ప్రత్యర్థులకు ట్రంప్ హెచ్చరిక

అన్నీ చూడండి

లేటెస్ట్

Srivari Laddus: శ్రీవారి లడ్డూ విక్రయంలో కొత్త రికార్డు.. పెరిగిన నాణ్యత, రుచే కారణం

02-01-2026 శుక్రవారం ఫలితాలు - పనుల్లో ఒత్తిడి అధికం.. కీలకపత్రాలు జాగ్రత్త...

01-01-2026 గురువారం ఫలితాలు - పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు...

01-01-2026 నుంచి 31-01-2026 వరకు జనవరి మాస ఫలితాలు

ముక్కోటి ఏకాదశి: 5 కిలోమీటర్లు సాష్టాంగ నమస్కారం చేస్తూ వెళ్లిన దంపతులు (video)

తర్వాతి కథనం
Show comments