Webdunia - Bharat's app for daily news and videos

Install App

"సంకటహర చతుర్థి" రోజున వినాయకుణ్ని అర్చిస్తే..?

Webdunia
FILE
బహుళ చతుర్ధశిని "సంకటహర చతుర్ధి" అని అంటారు. ఈ పర్వదినాన వినాయకుడిని అర్చిస్తే సకల కష్టాలు దూరమవుతాయని పురోహితులు చెబుతున్నారు. ప్రతినెలలో వచ్చే సంకటహర చతుర్ధి కంటే మాఘమాసంలో వచ్చే సంకటహర చతుర్థి నాడు విఘ్వేశ్వరునికి ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేయిస్తే పుణ్యఫలములు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు సూచిస్తున్నారు.

అలాగే ప్రతి మాసంలో వచ్చే సంకటహర చతుర్థి రోజున వినాయకునికి నిష్టతో పూజించి ఉండ్రాళ్లు నైవేద్యముగా సమర్పించే వారికి ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. ఇంకా సంకటహర చతుర్ధి నాడు సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, ఇంటిని, పూజగదిని శుభ్రం చేసుకోవాలి.

పసుపు, కుంకుమలు, పుష్పాలతో పూజామందిరమును దివ్య సుందరముగా అలంకరించుకుని పూజకు సిద్ధం చేసుకోవాలి. అదే రోజున వినాయకుని ఆలయాల్లో జరిగే అభిషేకాలు, ప్రత్యేక పూజలు పూర్తయ్యాక విఘ్నేశ్వరుని దర్శించుకోవాలి.

ఇంకా సంకట హర చతుర్ధినాడు ఆలయాల్లో జరిగే అభిషేకాలకు సుగంధ ద్రవ్యాలు, పుష్పాలు, గరిక మాల వంటివి సమర్పించుకుంటే సకల సంపదలు, సుఖసంతోషాలు చేకూరుతాయి.

అదే రోజు ఆరు గంటలకు ఇంట్లో దీపమెలిగించి వినాయక ప్రతిమ లేదా ఫోటోను గరికమాలను అలంకరించుకుని, పంచహారతినిచ్చి నైవేద్యం సమర్పించుకునే వారికి ఆర్థిక వృద్ధి, వ్యాపారాభివృద్ధి, ఉన్నత పదవులు వంటి శుభ ఫలితాలుంటాయని పురోహితులు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Draupadi Murmu: కన్నీళ్లు పెట్టుకున్న రాష్ట్రపతి ద్రౌపది.. టిష్యూ పేపర్ అందించిన భద్రతా సిబ్బంది (video)

వందేభారత్ రైలులో విండో సీటు ఇవ్వలేదని పిచ్చకొట్టుడు కొట్టిన ఎమ్మెల్యే మనుషులు, రక్తం కారింది

అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్.. ఇజ్రాయెల్‌కు మద్దతిస్తే అంతు చూస్తాం...

Rain forecast- నైరుతి రుతుపవనాల ప్రభావం- తెలంగాణ అంతటా వర్షాలు

బీజేపీ అంటేనే ఓ లంగా పార్టీ : బీజేపీ ఎంపీ సోదరుడు ధర్మపురి సంజయ్ (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD: సెప్టెంబర్ నెలకు ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టిక్కెట్లు విడుదల

17-06-2025 మంగళవారం దినఫలితాలు : సన్నిహితులతో సంభాషిస్తారు...

16-06-2025 సోమవారం దినఫలితాలు - అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

15-06-2025 ఆదివారం దినఫలాలు - ఖర్చులు విపరీతం...

15-06-2025 నుంచి 21-06-2025 వరకు ఫలితాలు

Show comments