Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుక్రవారం పూట దుర్గమ్మను నిష్ఠతో పూజించండి

Webdunia
FILE
శుక్రవారం నాడు దుర్గ నామంతో ముగురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మను పూజించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ధర్మానికి, లోకక్షేమానికి విఘాతాన్ని కలిగించే అసుర శక్తుల్ని అంతమొందించిన ఆ శక్తిని శుక్రవారం పూట పూజించే మహిళలకు దీర్ఘ సుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని పురోహితులు చెబుతున్నారు.

శుక్రవారం నాడు సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి, ఇంటిని, పూజగదిని శుభ్రం చేసుకుని, పువ్వులు, ముగ్గులు, పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ఆ రోజు సాయంత్రం దుర్గమ్మ తల్లికి నేతితో నింపిన ఎర్రటి ప్రమిదలతో దీపమెలిగించుకోవాలి. అనంతరం దుర్గమ్మకు అర్చన చేసి, అదే ఆలయంలోని పరమేశ్వరుణ్ణి దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం చేకూరుతుందని పురోహితులు అంటున్నారు.

తదనంతరం ఆలయంలో పూజను పూర్తి చేసుకుని గృహంలోనూ పంచహారతులతో తమకు వీలైన నైవేద్యాన్ని సమర్పించుకుని దుర్గమ్మను పూజించే వారికి ధనాదాయము, అనుకున్న కార్యములు దిగ్విజయంగా పూర్తి కావడం వంటి శుభ ఫలితాలుంటాయి. అలాగే ఈతిబాధలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని పురోహితులు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Draupadi Murmu: కన్నీళ్లు పెట్టుకున్న రాష్ట్రపతి ద్రౌపది.. టిష్యూ పేపర్ అందించిన భద్రతా సిబ్బంది (video)

వందేభారత్ రైలులో విండో సీటు ఇవ్వలేదని పిచ్చకొట్టుడు కొట్టిన ఎమ్మెల్యే మనుషులు, రక్తం కారింది

అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్.. ఇజ్రాయెల్‌కు మద్దతిస్తే అంతు చూస్తాం...

Rain forecast- నైరుతి రుతుపవనాల ప్రభావం- తెలంగాణ అంతటా వర్షాలు

బీజేపీ అంటేనే ఓ లంగా పార్టీ : బీజేపీ ఎంపీ సోదరుడు ధర్మపురి సంజయ్ (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD: సెప్టెంబర్ నెలకు ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టిక్కెట్లు విడుదల

17-06-2025 మంగళవారం దినఫలితాలు : సన్నిహితులతో సంభాషిస్తారు...

16-06-2025 సోమవారం దినఫలితాలు - అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

15-06-2025 ఆదివారం దినఫలాలు - ఖర్చులు విపరీతం...

15-06-2025 నుంచి 21-06-2025 వరకు ఫలితాలు

Show comments