శిరస్సు మీద శఠగోపం ఎందుకు పెడతారు?

Webdunia
సోమవారం, 24 ఫిబ్రవరి 2014 (14:39 IST)
FILE
శఠగోపం శిరస్సు మీద పెడతారు. దీనిపైన భగవంతుని పాదుకలు ఉంటాయి. దేవుని పాదాలను శిరసున ధరించాలి. భగవంతుని స్పర్శ శిరస్సుకు తగలడం అంటే భక్తులను అనుగ్రహించడం అని అర్థం. శఠగోపం పాదాల ఆకృతిలో ఉంటే మన తలను అవి పూర్తిగా తాకడానికి అనుకూలంగా ఉండవనే ఉద్దేశంతో వాటిని వలయాకారంగా తయారుచేసి పైన పాదాలు ఉండేలా తయారుచేశారని చెబుతారు.

శఠత్వం అంటే మూర్ఖత్వం అని, గోపం అంటే దాచిపెట్టడం అని కూడా ఉంది. భగవంతుడు మనిషిలో గోప్యంగా ఉన్న మూర్ఖత్వాన్ని, అహంకారాన్ని తొలగించి జ్ఞానిగా చేస్తాడనేది ఆధ్యాత్మికుల భావన. నేను, నాది అనే భ్రమను తొలగించడానికి శఠగోపం పెడతారు.

శాస్త్రపరంగా చూస్తే శఠగోపం పంచలోహాలతో కాని, ఇత్తడి, వెండి, రాగి, బంగారం, కంచులతో విడివిడిగా గాని తయారు చేస్తారు. వీటన్నిటికీ వేడిని సంగ్రహించే శక్తి ఉంది. అందుకే తలమీద పెట్టగానే తలలో వేడిని ఇది సులువుగా లాగేస్తుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

డీప్‌ఫేక్ చిత్రాలను నిషేధించేలా లోక్‌సభలో బిల్లు

కేరళ తరహాలో ఏపీలో విద్యావిధానం అవసరం.. పవన్ కల్యాణ్

NABARD: ఏపీ రాజధాని అభివృద్ధికి నాబార్డ్ రూ.169 కోట్లు ఆమోదం

అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు : విమానయాన సంస్థకు కేంద్రం హెచ్చరిక

Drone In Tirumala : తిరుమల శిలాతోరణం సమీపంలో డ్రోన్ చక్కర్లు

అన్నీ చూడండి

లేటెస్ట్

04-12-2025 గురువారం ఫలితాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

జై గురుదత్త

03-12-2025 బుధవారం దిన ఫలితాలు - అనుకోని ఖర్చు ఎదురవుతుంది...

Tirupati Central Zone: తిరుపతిని సెంట్రల్ జోన్‌గా వుంచి.. ఆధ్యాత్మికత అభివృద్ధి చేస్తాం.. అనగాని

Bhauma Pradosh Vrat 2025: భౌమ ప్రదోషం.. శివపూజ చేస్తే అప్పులు మటాష్.. ఉపవాసం వుంటే?

Show comments