Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజకు అనువైన సమయాలు ఏవో తెలుసా..!?

Webdunia
FILE
దేవతా పూజలు ఎప్పుడంటే అప్పుడు చేయకూడదు. ప్రభాతకాలం, మధ్యాహ్న, సాయంకాలాలలో ప్రశాంత మనస్కులమై, శుచిగా పరమాత్మను పూజించాలి. దీన్ని బాహ్యపూజగా పరిగణిస్తారు. ఇది లోనికి మళ్లితే మానసిక పూజగా మారుతుంది. దానికి సమయాలుండవు.

చివరకు "యద్యత్ కర్మకరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్" అన్నట్లు ఏ పని చేసినా పూజయన్న భావం స్థిరపడాలి. అట్లే జపం కూడా. ప్రారంభంలో ఈ జపం మూలకూర్చుని, మూలపట్టుకుని జపంచేస్తూ చేస్తూ చివరకు మూల, మాలలు వదిలి మనలో నిరంతరమూ జపం కొనసాగే స్థితికి చేరుకోవాలి. దానికే "అజపాజపస్థితి" అని పిలుస్తారు.

అలాగే భగవంతునికి మనము అర్పించవలసినవి పదార్థాలు కావు. మనలోని ఆహంకారాలు, కామనలు వంటివే. అలాగే హారతులంటే కేవలం కర్పూరం వెలిగించడమే కాదు.

మనలోని అహంకారాన్ని కర్పూరంలా వెలిగించి, పరమాత్మకు సమర్పించడం, పుష్పం సమర్పయామి అని పువ్వులకు మనలోని దుర్వాసనలను పట్టించి స్వామి పాదాల మీద సమర్పిస్తే ఆ పాదాలు ఆ దుర్వాసనలను శుద్ధం చేసి మళ్లీ మనకిస్తే వాటిని శిరస్సున ధరిస్తామని పురోహితులు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

లేటెస్ట్

17-06-2025 మంగళవారం దినఫలితాలు : సన్నిహితులతో సంభాషిస్తారు...

16-06-2025 సోమవారం దినఫలితాలు - అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

15-06-2025 ఆదివారం దినఫలాలు - ఖర్చులు విపరీతం...

15-06-2025 నుంచి 21-06-2025 వరకు ఫలితాలు

శంఖములు ఎన్ని రకాలు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయా?

Show comments