Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణయాన పుణ్యకాలంలో దానధర్మాలు చేస్తే..!?

Webdunia
శనివారం, 16 జులై 2011 (16:15 IST)
FILE
దానధర్మాలతో పుణ్యఫలం లభిస్తుంది. కానీ ఎప్పుడు పడితే అప్పుడు దాన ధర్మాలు చేయడం కంటే పెద్దలు చేసిన సమయంలో చెయ్యడం వల్ల అధిక పుణ్య ఫలాన్ని సంపాదించుకోవచ్చు. దానం అనే ఇష్టము, పూర్తము అనే రెండు రకాలుగా ఉంటుంది. ఈ దానాలను చేసే వారు గొప్ప పుణ్యాన్ని పొందేందుకు అర్హులవుతారు.

దిగుడుబావి, చెరువు, దేవాలయం, అన్నసత్రం, ఉద్యానవనం లాంటి ఏర్పాటు చేయడానికి దానం చేస్తే పూర్తము అని పేరు. ఈ తరహా దానం ముక్తి ప్రదం. అగ్నిహోత్రం, సత్యభాషణం, అతిథి సత్కారం, అనే వాటిని చేయడం ఇష్టము అని అంటారు. ఈ తరహా దానాలు స్వర్గ ప్రాప్తికి అర్హతను కలిగిస్తాయి. గ్రహణ సమయాలలోనూ, సూర్య సంక్రాతులతోనూ, ద్వాదశాదిత్యాది తిథుల్లో చేసే దానం కూడా పూర్తము కిందకే వస్తుంది. ఇదికూడా స్వర్గ ప్రదమే.

ఇక అసలు విషయానికొస్తే.. సూర్యుడి ఉత్తరాయణ, దక్షిణాయన ప్రవేశకాలాల్లోనూ, పవిత్రమైన విషువ కాలాల్లోనూ, సంక్రాంతి, చతుర్దశి, అష్టమి, పూర్ణిమ, ద్వాదశి, అష్టకాశ్రాద్ధ, యజ్ఞ, ఉత్సవ, వివాహ, ధనప్రాప్తి కాలాల్లో దానం చేయాలి. ఇక దానం చేయడానికి ఉత్తరాయణ, దక్షిణాయన సంక్రాతులలో అతీత, అనాగత ఘడియలు పవిత్రమైనవి.

కర్క సంక్రాతి సమయంలో ఇరవై ఘడియల కాలం దానం చేయడానికి ఉత్తమం. తుల, మేష సంక్రాతులలో సంక్రమణ సమయానికి ముందు పది ఘడియలు, వెనుక పది ఘడియలు ఉత్తమమని పురోహితులు చెబుతున్నారు.

ప్రత్యేకంగా జూలై 17 (ఆదివారం) నుంచి ప్రారంభమయ్యే దక్షిణాయన పుణ్యకాలంలో దానం చేయడం వల్ల అధిక పుణ్యాన్ని సంపాదించుకోవచ్చునని అగ్నిదేవుడే అగ్నిపురాణంలో వివరించాడు. అందుచేత దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమయ్యే రోజున తమ శక్తికి తగిన వస్తువులు, ఆహారం వంటివాటిని ఇతరులకు దానం చేస్తే పుణ్యఫలం చేకూరుతుందని విశ్వాసం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

లేటెస్ట్

17-06-2025 మంగళవారం దినఫలితాలు : సన్నిహితులతో సంభాషిస్తారు...

16-06-2025 సోమవారం దినఫలితాలు - అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

15-06-2025 ఆదివారం దినఫలాలు - ఖర్చులు విపరీతం...

15-06-2025 నుంచి 21-06-2025 వరకు ఫలితాలు

శంఖములు ఎన్ని రకాలు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయా?

Show comments