Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ రైల్వే రంగంలోకి ఎఫ్‌డీఐలు : సదానంద గౌడ

Webdunia
మంగళవారం, 8 జులై 2014 (12:29 IST)
భారతీయ రైల్వే రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడ వెల్లడించారు. అయితే, రైల్వే ఆపరేషన్‌ విభాగంలో మాత్రం వీటిని అనుమతించబోమని స్పష్టం చేశారు. లోక్‌సభలో 2014-15 సంవత్సరానికి గాను సదానంద గౌడ రైల్వే మంత్రి హోదాలో తొలి రైల్వే బడ్జెట్‌ను సోమవారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన పై విషయాన్ని వెల్లడించారు. 
 
భారత ఆర్థిక వ్యవస్థకు రైల్వే ఆత్మ వంటిదన్నారు. కొత్త రైళ్లు, లైన్ల కోసం ఎంపీల నుంచి ఎన్నో విజ్ఞప్తులు తమకు వచ్చాయని తెలిపారు. రైల్వే ప్రతి రోజు 2.30 కోట్ల మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తుందని తెలిపారు. త్వరలో హై స్పీడ్ నెట్ వర్క్‌ను నెలకొల్పుతామన్నారు. సరకు రవాణాలో ప్రపంచంలో అగ్రగామి కావడమే భారత రైల్వే లక్ష్యమని పేర్కొన్నారు. అంతకుముందు ఆయన తన ప్రసంగాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రారంభించారు. 
 
గత కొన్నేళ్లుగా ప్రయాణికుల నిష్పత్తి తగ్గిపోవడంతో రైల్వే శాక 26 వేల కోట్ల రూపాయల నష్టాలను చవిచూస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే రైల్వే చార్జీలను పెంచిందని ఆయన గుర్తు చేశారు. అయితే 2020 నాటికి 20 ట్రిలియన్ రూపాయల పెట్టుబడులు కావాల్సి ఉందన్నారు. ఈ మొత్తంలో చార్జీల రూపేణా కాకుండా ఇతర మార్గాల్లో 14 ట్రిలియన్ రూపాయల ఆదాయాన్ని అర్జించాల్సి వుందన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

లక్కీ భాస్కర్ విన్నరా? కాదా? - లక్కీ భాస్కర్ మూవీ రివ్యూ

డిసెంబర్‌లో నాగచైతన్య - శోభితల వివాహం.. ఎక్కడ జరుగుతుందంటే?

ద్వారకాధీశుడు శ్రీకృష్ణుడిగా ప్రిన్స్ మహేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

ఎముక పుష్టి కోసం ఇవి తినాలి, ఇలా చేయాలి

ప్రియా.... నను క్షమించవా ఈ జన్మకి ఈ ఎడబాటుకి

Show comments