బాలాపూర్ గణపతి లడ్డూ ధర ఎంతో తెలుసా?

ఠాగూర్
శనివారం, 6 సెప్టెంబరు 2025 (13:57 IST)
వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ప్రతి యేటా ఎంతో ఆసక్తిని రేకెత్తించే గణపతి లడ్డూ వేలం పాట ఈ సారి కూడా సరికొత్త రికార్డును నెలకొల్పింది. తన పాత రికార్డును తానే బద్ధలు కొడుతూ ఈ యేడాది ఏకంగా రూ.35 లక్షల భారీ ధర పలికింది. వినాయక చవితి ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ లడ్డూ వేలం పాట ఉత్కంఠభరితంగా సాగింది. 
 
హైదరాబాద్ నగరంలోని కర్మన్ ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ ఈ ప్రతిష్టాత్మకమైన లడ్డూను దక్కించుకున్నారు. ఈ యేడాది జరిగిన వేలం పాటలో మొత్తం 38 మంది పోటీపడ్డారు. ఈ వేలం పాటలు హోరాహోరీగా సాగాయి. చివరకు లింగాల దరశరథ్ ఈ లడ్డూను దక్కించుకున్నారు. గత యేడాది ఈ లడ్డూ రూ.30.01 లక్షలకు అమ్ముడుపోగా, ఆ రికార్డను ఈ యేడాది సునాయాసంగా అధికమించింది. గత యేడాది కొలను శంకర్ రెడ్డి గణపతి లడ్డూను సొంతం చేసుకున్నారు. 
 
కాగా, బాలాపూర్ లడ్డూ వేలం సంప్రదాయం 1994లో ప్రారంభమైంది. అప్పట్లో కేవలం రూ.450తో మొదలైన ఈ లడ్డూ వేలం పాట... దశాబ్దాలు గడిచేకొద్దీ లక్షల్లోకి చేరి సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. ఈ లడ్డూను దక్కించుకుంటే శుభం కలుగుతుందని వ్యాపారంలో వృద్ధి వుంటుందని భక్తులు బలంగా విశ్వసిస్తారు. అందుకే ప్రతి సంవత్సరం పోటీ తీవ్రంగా ఉంటుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments