రోజంతా ఫీల్ గుడ్‌గా ఉండాలంటే.. ఈ టిప్స్ పాటించండి!

Webdunia
శుక్రవారం, 4 జులై 2014 (16:47 IST)
ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే... నిరంతరం ఆనందంగా వుండే స్థితినే ఫీల్‌ గుడ్‌ అంటున్నారు. అయితే నిరంతరం ఆనందంగా ఉండటం అంత తేలిక కాదు. అందుకు ఈ కింది అంశాలలో సాధన ఎంతైనా అవసరం.
 
* ప్రతిరోజూ వ్యాయామం చేయటం, మనసుకు తగిన విశ్రాంతి నివ్వటం ద్వారా సానుకూలంగా ఆలోచించటానికి మనసు ఉద్యుక్తురాలవుతుంది. చేసే పని ఏదైనా సరే దాన్ని ప్రేమించాలి. అప్పుడై చేసే పనిలో సంతృప్తి కలుగుతుంది. దాంతో సద్బావన పెంపొంది ఉన్నత స్థానాలకు ఎదిగే అవకాశం వుంటుంది.
 
* ఎప్పుడూ ఉల్లాసంగా ఉండటాన్ని ఒక హాబీగా అలవాటు చేసుకోవాలి. రంగు రంగుల పూలు, రివు్వన ఎగిరే పక్షులు, సమ్మోహితులను చేసే ఉదయకాల సూర్యకాంతి కిరణాలు... ఇలా పకృతి అంతటా ఆనందానికి అభివ్యక్తాలే. వాటిని అనుభూతి చెందండి. ఇతరులకు కావాల్సిన సహాయాన్ని అందించటానికి వెనుకాడకపోవటం. ఇది ఇవ్వడంలో వున్న ఆనందపు మాధుర్యాన్ని చవి చూపిస్తుంది.
 
* కష్టాల్లో వున్న వారికి చేయూత నివ్వటం ఎంతో మానసిక సంతృప్తిని అనిర్వచనీయమైన ఆనందాన్ని ఇస్తుంది. సన్నిహితులను వారి లోపాలతో సహా సంపూర్ణంగా స్వీకరించండి. మీతో పాటు మీ పక్కవారు కూడా బాగుంటేనే మీ ఆనందానికి అవరోధాలు చాలావరకు తగ్గిపోతాయి.
 
* ప్రతికూల పరిస్థితుల్లోనూ సానుకూల అంశాలకోసం అన్వేషించాలి. అప్పుడే మీలో పరిపూర్ణ ఆనందం అనుభూతిలోకి వస్తుంది. మనం బావుండటమే కాదు ఇతరులు కూడా బాగుండాలని కోరుకోవటంలోనే అసలైన ఆనందం ఇమిడి వుంది. 
 
వీటిలో ఏ ఒక్క సూత్రాన్ని అలవర్చుకునే ప్రయత్నం చేసినా మీ మునుపటి దృక్పథంలో మార్పు వచ్చినట్లే. ఆనందమయ జీవితానికి అంతా మంచే జరుగుతుందనే సద్భావనను పెంపొందించుకోవటమే సులువైన మార్గం. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తల్లి అంజనా దేవి పుట్టినరోజు.. జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్ కల్యాణ్

అమరావతిలో దేశంలోనే తొలి ఏఐ విశ్వవిద్యాలయం.. ఫిబ్రవరి 19న ప్రారంభం

మేడారం ఉత్సవంలో నీటి లభ్యతను, రిటైల్ సాధికారతను కల్పిస్తున్న కోకా-కోలా ఇండియా

వైఎస్ జగన్‌ను ఏకిపారేసిన షర్మిల- అధికారం కోసమే జగన్ మరో పాదయాత్ర

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను చుట్టేసిన సీతాకోకచిలుకలు, ఆయనలో ఆ పవర్ వుందట...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

SriRam: ది మేజ్‌ నుంచి శ్రీరామ్‌ ఫస్ట్‌లుక్‌ అండ్‌ గ్లింప్స్‌

కొచ్చిలో ఒకొరగజ్జ ప్రచారాన్ని భగ్నం చేయడానికి వారే బాధ్యులు!

సీతా పయనం నుంచి పయనమే..మెలోడియస్, రొమాంటిక్ పాట విడుదల

ఓం శాంతి శాంతి శాంతిః రీమేక్ కనుక తరుణ్ చేయన్నాడు : సృజన్‌ యరబోలు

NTR: ఎన్‌టీఆర్ కు రక్ష‌ణ క‌ల్పించిన ఢిల్లీ హైకోర్టు

Show comments