క్షమాగుణంతో ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో తెలుసా?

Webdunia
శనివారం, 30 మే 2015 (16:09 IST)
క్షమాగుణాన్ని అలవరుచుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతారని వైద్యులు అంటున్నారు. మనపట్ల మనం కాని, ఇతరుల పట్ల కాని కఠినంగా వ్యవహరించకూడదు. సాధ్యమైనంతవరకు సమస్యలను పరిష్కరించుకుని, క్షమాగుణాన్ని అలవరుచుకోవాలి. ఎవరిపట్ల అయినా కక్షగా వున్నట్లయితే అది మనస్సును చికాకుపరుస్తుంటుంది. 
 
కాబట్టి మనలోని ప్రతికూల భావాలను వెలికినెట్టేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. అలా చేయాలంటే ఎదురివారిపట్ల కలిగిన కోపాన్ని నియంత్రించుకోగలగాలి. ఎప్పుడైతే క్షమాగుణాన్ని అలవరుచుకుంటారో అప్పుడే ప్రతికూల శక్తి ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. ఫలితంగా అప్పటివరకు వున్న ఒత్తిడి ఆవిరవుతుంది. 
 
ఇతరుల్ని క్షమించే గుణంతోపాటు, మననుమనం ఖండించుకోవడాన్ని కూడా ఆపేయాలి. గతం గతించాలేతప్ప దానికి ఆజ్యం పోసుకోకూడదు. ఎప్పుడూ కూడా మనకుకలిగిన అనుభవాలసారం నుంచి ప్రతిరోజూ మంచి పాఠాలు నేర్చుకుంటూ వుండాలి. చేసిన తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలి.
 
స్వయం తప్పిదాల్ని విస్మరించి, మరోసారి జరగకుండా చూడాలే కానీ నిందించుకుంటూ కూర్చోకూడదు. ఎందుకిలా దరిగిందన్న చింత, నిందలు పదేపదే ప్రశ్నించుకోవడం మానేయాలి. క్షమాగుణం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవడానికి మార్గం సుగమం అవుతుందని మానసిక నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మాజీ ప్రియుడి భార్యకు హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చిన మహిళ.. ఎక్కడ?

చెట్టుకు చీర కట్టినా దాని దగ్గరకు వెళ్లిపోతాడు: అరవ శ్రీధర్ పైన బాధితురాలు వ్యాఖ్య

Telangana : ఇన్‌స్టాగ్రామ్‌ ప్రేమకు నో చెప్పారని తల్లిదండ్రులను హత్య చేసిన యువతి

వారం రోజులు డెడ్‌లైన్.. అరవ శ్రీధర్‌పై విచారణకు కమిటీ వేసిన జనసేన

2026-27 బడ్జెట్ సమావేశాలు.. 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారు- ముర్ము

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suhas: హే భగవాన్‌ నుంచి నా సినిమాలు అందర్ని అలరిస్తాయి.: సుహాస్‌

Dhanush: కుమారులు లింగ, యాత్ర కలిసి తిరుపతిలో మొక్కు చెల్లించుకున్న ధనుష్

Vijay Sethupathi: మాట‌ల కంటే ఎక్కువ మాట్లాడిన నిశ్శ‌బ్దం గాంధీ టాక్స్‌ ట్రైల‌ర్

Rani Mukerji: రాణీ ముఖ‌ర్జీ 30 ఏళ్ల ఐకానిక్ సినీ లెగ‌సీని సెల‌బ్రేషన్స్

Santosh Shobhan: కపుల్ ఫ్రెండ్లీ నుంచి కాలమే తన్నెరా లక్ ని ఆమడ దూరం.. సాంగ్

Show comments